For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఉదయాన్నే ఫోన్ చూస్తుంటారా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే...

|

ఒకప్పుడు ఉదయం నిద్ర లేచిన వెంటనే ప్రతి ఒక్కరూ ఏ దేవుని గదికో లేక ఇంట్లో ఇష్టమైన వారి ముఖాన్ని చూసేవారు. దీని వల్ల తాము రోజంతా సంతోషంగా, హాయిగా గడుపుతామని భావించేవారు.

అయితే ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. మనలో చాలా మంది ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లోనే సగం జీవితాన్ని గడిపేస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం మనలో ప్రతి ఒక్కరికి ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ఫోన్ లేనిదే అస్సలు రోజు అనేదే గడవదు. అంతలా మనం స్మార్ట్ ఫోన్లకు బానిసలమైపోయాం.

మనలో చాలా మంది ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు తమ స్మార్ట్ ఫోన్లో మునిగిపోయి ఉంటారు. అయితే చాలా మంది ప్రస్తుతం నిద్ర లేవగానే దేవుడి చిత్రపటం మరియు ఇంట్లో వారి ముఖాలకు బదులు స్మార్ట్ ఫోన్లను చూసేస్తున్నారు. అయితే ఇలాంటి చాలా చెడ్డదని.. సాధ్యమైనంత త్వరగా ఈ అలవాటును మార్చుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎందుకంటే స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. ప్రతికూల ప్రయోజనాలు కూడా అన్నే ఉన్నాయన్నంటున్నారు. ఈ విషయాలు చాలా మందికి తెలీదు. ఈ సందర్భంగా ఉదయాన్నే స్మార్ట్ ఫోన్ చూడటం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుంటే.. అలాంటి అలవాటును మానుకునేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి ఆ వివరాలేంటో ఇప్పుడే తెలుసుకోండి...

తీవ్రమైన ఒత్తిడి..

తీవ్రమైన ఒత్తిడి..

ఉదయం మనకు నిద్రలో నుండి మెళకువ రాగానే స్మార్ట్ ఫోన్ పట్టుకుని మెసెజ్ లు, ఫొటోలు ఇతర సమాచారం కోసం స్వైపింగ్ చేస్తూ ఉంటే అందులోని వెలుతురు నుండి వచ్చే కిరణాలు మన కంటి లోపలికి నేరుగా చొచ్చుకుపోతాయి. దీని వల్ల మీకు ప్రతిరోజూ తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. మీకు తలంతా పట్టేసినట్టుగా ఉంటుంది. మీకు కూడా ఇలాగే అనిపిస్తుంటే.. మీరు ఈ అలవాటును మార్చుకునేందుకు ప్రయత్నించండి. ఈ అలవాటును మీరు ఎప్పుడైతే మానుకుంటారో.. అప్పుడు మీరు చాలా చురుకుగా మారిపోతారు.

పనితీరుపై దెబ్బ..

పనితీరుపై దెబ్బ..

ఉదయం నిద్ర లేచిన వెంటనే స్మార్ట్ ఫోన్ ను తీసుకుని ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో స్టేటస్ లు చూడటం ఏదైనా నచ్చితే షేర్ చేయడం వంటివి చేస్తూ ఉంటే.. దాని ప్రభావం మీ పనిపై పడుతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చే నోటిఫికేషన్లన్నీ మనకు క్లిక్ చేయాలనిపిస్తుంది. అయితే అందులో మంచివి ఉండొచ్చు.. అదే సమయంలో చెడ్డవిగా కూడా ఉండొచ్చు. మరికొన్ని అయితే మనకు చాలా ఇబ్బందికరంగా కూడా అనిపించొచ్చు. ఇలాంటి విషయాలు మన మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది

మనం రోజంతా ఆలోచిస్తూ..

మనం రోజంతా ఆలోచిస్తూ..

దీని గురించే మనం రోజంతా ఆలోచిస్తూ ఉంటాం. అలా ఆలోచించడం వల్ల ఆరోజు పనితీరు మొత్తం దెబ్బతింటుంది. అయితే మీరు ఈ అలవాటును మానుకోవాలనుకుంటే.. ఉదయాన్నే మీకు అత్యంత ఇష్టమైన పాటలను వింటూ లేదా సూర్యోదయాన్ని చూస్తూ.. మొక్కలకు నీరు పోస్తూ అలా గడిపితే ఈ రోజంతా మీ బ్రెయిన్ చాలా చురుకుగా ఉంటుంది. దీని ప్రభావం రోజంతా ఉంటుంది. ఇలాంటి పనులు చేసే సమయంలో, మీరు ఏదైనా ఇబ్బంది పెట్టే సమాచారాన్ని చదివినా వాటి ప్రభావం మరీ ఎక్కువ మాత్రం ఉండదు.

బిపి పెరుగుతుంది..

బిపి పెరుగుతుంది..

మీరు ఉదయం నిద్రలో నుండి మసక మసకగా కనబడే కళ్లతో మీ ఫోన్ ను పట్టుకుంటే, అందులో ఏముంటుందనే విషయం ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ శుభవార్తలైతే ఏమి పర్వాలేదు. కానీ మనల్ని ఇబ్బంది పెట్టే అంశాలు ఏవైనా ఉంటే మాత్రం బిపి పెరుగుతుంది. ఇలా ఉదయం పూట బిపి పెరిగితే రోజంతా అనేక రకాల ఒత్తిళ్లు పెరిగి బిపి(బ్లడ్ ప్రజర్) పెరిగిన దాని కంటే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.

కళ్లకు ఇబ్బంది..

కళ్లకు ఇబ్బంది..

ఉదయాన్నే మన కళ్లతో స్మార్ట్ ఫోన్ చూడగానే.. దాని నుండి వచ్చే వెలుగు పూర్తిగా కళ్లపై పడటంతో మన కళ్లకు కొంత ఇబ్బందిగా మారుతుంది. అప్పటివరకు హాయిగా విశ్రాంతి తీసుకున్న కళ్లపై ఒక్కసారిగా ఎక్కువ కాంతి పడటం వల్ల మీ కళ్లకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దీని వల్ల రోజంతా కళ్లు ఎక్కువ ప్రభావవంతంగా పని చేయవు. అయితే ఇలాంటి అలవాటు మానుకోవాలనుకుంటే.. ఉదయాన్నే మీరు యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి.

అవే ఆలోచనలు..

అవే ఆలోచనలు..

మీరు ఉదయాన్నే స్మార్ట్ ఫోన్ చూసినప్పుడు.. అందులో నుండి గతం గురించి కొన్ని క్షణాలు గుర్తుకు రావచ్చు. దీనికి తోడు ఎఫ్ బి, ఇన్ స్టా, ట్విట్టర్ వంటివి మనం గతంలో ఈరోజు చేసిన పనిని గుర్తు చేస్తూ ఉంటాయి. వీటిని మంచి మధురమైన క్షణాలుగా గుర్తు చేస్తాయి. అవి మంచి విషయాలైతే పర్వాలేదు. కానీ చెడు జ్ణాపకాలైతే మాత్రం ఉదయం నుండే మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు అలాంటి విషయాలను మరచిపోయి, మీ మైండ్ ను ప్రెజెంట్ మూడ్ లోకి తీసుకురావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

English summary

Why You Shouldn't Check Your Phone in the Morning

Here we discussing about why you shouldn't check your phone in the morning. Read on,