For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Joint Pain Relief Tips: చలికాలంలో జాయింట్ పెయిన్స్ బాధిస్తున్నాయా? ఈ చిట్కాలు మీకోసమే

చలికాలంలో చాలా మందిని జాయింట్ పెయిన్స్ బాధిస్తాయి. చలి పెరుగుతున్న కొద్దీ మొకాళ్లు, తుంటి, చీలమండల్లో నొప్పి వస్తుంది. చల్లని వాతావరణమే కీళ్ల నొప్పికి కారణం.

|

Joint Pain Relief Tips: చలికాలంలో చాలా మందిని జాయింట్ పెయిన్స్ బాధిస్తాయి. చలి పెరుగుతున్న కొద్దీ మొకాళ్లు, తుంటి, చీలమండల్లో నొప్పి వస్తుంది. చల్లని వాతావరణమే కీళ్ల నొప్పికి కారణం.

Winter joint Pain Relief Tips in Telugu

చలికాలంలో బాధించే నొప్పుల నుండి ఎలా ఉపశమనం పొందేందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అయితే దానికంటే ముందు మీకు అసలు జాయింట్ పెయిన్స్, చీలమండల్లో నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకోవడం ముఖ్యం.

చలికాలంలో పెయిన్స్ ఎందుకు వస్తాయంటే..

చలికాలంలో పెయిన్స్ ఎందుకు వస్తాయంటే..

చలికాలం రాగానే కీళ్లలో నొప్పి రావడానికి చాలానే కారణాలు ఉన్నాయని అంటున్నారు వైద్యులు. చలికాలంలో సహజంగానే కండరాలు బిగుతుగా మారతాయి. దీని వల్ల కీళ్లలో చలనశీలత తక్కువగా ఉంటుంది. టైట్ గా మారతాయి. అలా కీళ్లలో నొప్పి వస్తుందని అంటున్నారు వైద్యులు. అయితే బారోమెట్రిక్ పీడనం, పొడి గాలి, ఇతర వాతావరణ మార్పుల వల్ల కీళ్లలో నొప్పి వస్తుందని చెబుతున్నారు.

అంతకుముందు లేని నొప్పి చలికాలంలో అదీ ముఖ్యంగా రాత్రి సమయంలో వస్తుంటే దానికి చలి కారణం అనుకోవచ్చు. ఈ నొప్పుల నుండి ఉపశమనం పొందేందుకు ఈ చిట్కాలు పాటించండి.

1. కదులుతూ ఉండాలి

1. కదులుతూ ఉండాలి

చలికాలంలో శరీరాన్ని చురుకుగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. తరచూ కాళ్లు, చేతులు, వేళ్లు కదుపుతూ ఉండాలి. శరీరాన్ని కదిపేందుకు ఇంటి నుండి చలిలో బయటకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడూ ఛైర్ లోనో, సోఫోలోనో కూర్చోకుండా కొద్ది సేపు అటు ఇటు నడవడం వల్ల శారీరక శ్రమ చేసినట్లు అవుతుంది. కండరాలు, కీళ్లు పట్టుకోకుండా ఉంటాయి.

2. చలికాలంలో బరువు పెరగకుండా చూసుకోవాలి

2. చలికాలంలో బరువు పెరగకుండా చూసుకోవాలి

చాలా మంది చలికాలం రాగానే జిమ్ లో జాయిన్ అవుతారు. కానీ ఈ ముచ్చట మూణ్ణాళ్లే ఉంటుంది. చల్లని వాతావరణంలో బెడ్ పై నుండి లేవలేరు. ఇంట్లో ఉండేందుకు ఇష్టపడతారు. అలాగే చల్లని వాతావరణంలో ఏదైనా వేడి వేడిగా తినాలన్న కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలా చలికాలంలో ఆహారపు అలవాట్లు మారిపోతాయి. ఇది బరువు పెరిగేందుకు కారణం అవుతుంది.

అధిక బరువు వల్ల కాళ్ల కండరాలు, జాయింట్స్ పై ఒత్తిడి పడుతుంది. దీని వల్ల నొప్పులు వస్తాయి.

3. వెచ్చగా ఉండండి

3. వెచ్చగా ఉండండి

చలికాలంలో రాత్రి పూట, కొద్దిగా చీకటి పడగానే చలి మొదలు అవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తప్పకుండా కోట్ ధరించాలి. చేతి గ్లౌజులు, బూట్లు ధరించాలి. అలాగే ముక్కు, చెవులు కవర్ అయ్యేటు వంటి మఫ్లర్లు వేసుకోవాలి. వీటి వల్ల మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోవచ్చు.

ఇంట్లో ఉన్నా.. మీకు మీరుగా వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. మీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతూ ఉంటే ఇంట్లో హీటర్ వాడటం ఉత్తమం. అలాగే వేడి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోండి. ఈ సమయంలో హీటింగ్ ప్యాడ్ లు మంచి ఉపశమనాన్ని అందిస్తాయి. లేదంటే వేడి నీటి తాపడం అయినా హాయిగా అనిపిస్తుంది.

4. నీళ్లు ఎక్కువగా తాగాలి

4. నీళ్లు ఎక్కువగా తాగాలి

కాలం ఏదైనా హైడ్రేటెడ్ గా ఉండటం ముఖ్యం. అయితే వేసవి కాలంలో ఎక్కువగా దాహం వేస్తుంది. దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం వల్ల హైడ్రేటెడ్ గా ఉంటాం. అయితే చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఎక్కువగా దాహం వేయదు. దాహం వేసినా వేయకపోయినా తరచూ నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.

దీని వల్ల హైడ్రేటెడ్ గా ఉండవచ్చు. డీహైడ్రేట్ కావడం వల్ల అలసట, నొప్పులు కలుగుతాయి. తగినన్ని నీళ్లు తాగకపోతే శరీరం తేమగా ఉండదు. చేతి, కాలి వేళ్లు పగలడం, తెల్లగా అవడం జరుగుతుంది. వీటన్నింటికి నీళ్లు పుష్కలంగా తాగడమే పరిష్కారం.

5. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం

5. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం

ఆరోగ్యం - ఆహారం. చిన్న పిల్లలకైనా, పెద్దవారికైనా ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారం తీసుకోవడం అత్యంత ముఖ్యం. మంచి సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల చాలా వరకు రోగాలు దరిచేరకుండా కాపాడుకోవచ్చు. అలాగే మంచి శరీర బరువును నిర్వహించుకోవచ్చు.

మంచి పోషకాలు, విటమిన్లు, అవసరమైనన్ని కేలరీలు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల చాలా రకాల దీర్ఘకాలిక రోగాలు రమ్మన్నా రావని అంటారు వైద్యులు.

చలికాలంలో ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడంపై దృష్టి పెట్టాలని అంటారు న్యూట్రిషనిస్టులు.

English summary

Winter joint Pain Relief Tips in Telugu

read on to know Winter joint Pain Relief Tips in Telugu
Story first published:Tuesday, November 29, 2022, 15:11 [IST]
Desktop Bottom Promotion