For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పడకగది అలంకరణకు కాదు మానసిక ఉపశమానానికి ప్రాధాన్యత ఇవ్వండి..!!

|

Bedroom Decor For Nice Sleep
ప్రశాంతమైన నిద్రకు ఒంటి తాజాదనం ఎంత ముఖ్యమో.. పడకగది సౌలభ్యము అంతే ముఖ్యం.. పడకగది అలంకరణలో ఇష్టాయిష్టాలకు అభిరుచులకు ప్రాధాన్యత ఇవ్వటంకంటే మానసకి ఉపశమనానికి ప్రాధాన్యం ఇచ్చేలా ఉండాలి. పడక గదికి సంబంధించి గోడల రంగులు, తులపులకు వేసే కర్టెన్లు, కిటికీలకు వేసే కర్టెన్లు లాంటివి కంటికి భారంగా కనిపించకుండా.. గదిలోకి వెళ్లగానే మనసుకు విశ్రాంతి కలిగించేలా అమర్చుకోవాలి.

ఒక్కమాటలో చెప్పాలంటే పని ఒత్తిడితో అలసిసొలసి ఇంటికి వచ్చిని వారు మంచం పై వాలగానే నిద్రపట్టే విధంగా పడకగదిని తీర్చిదిద్దాలి. నిద్ర సరిగా పట్టాలంటే పడకగదిలో ప్రకాశవంతమైన, ముదురు రంగులు ఉండకూడదు. గదులకు ముదురు రంగులతో పెయింట్ వేయించకూడదు. గదిలో అడుగుపెట్టగానే మానసిక ఉల్లాసాన్నిచ్చేలా ఉండే లైట్ కలర్స్ ను పడకది గోడలకు వేయించాలి.

పడకగది అలంకరణ కోసం బొమ్మలు, వాల్ హేంగింగ్ వంటి వస్తువుల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఖరీదైన వస్తువులు కొనడం మాని, పిల్లలు సొంతంగా వేసిన డ్రాయింగ్ కాని పెయింటింగ్ కాని ఫ్రేమ్ కట్టించి తగిలించండి. దీనివల్ల గది గోడలకు కొత్త అందం రావడమే కాకుండా, పిల్లలు తమ పెయింటింగ్ లను చూసుకుని ఆనందిస్తారు.

English summary

Bedroom Decor For Nice Sleep | సుఖవంతమైన నిద్ర మీ సొంతమవ్వాలంటే..!!

Are you currently in search of some simple ways to make your bedroom more attractive and inviting? Perhaps you’re tired of coming home to the same tired bedroom decor day after day and you’re looking to change things up a bit. Whatever your reasons, you’ve come to the right place for helpful bedroom decor tips and bedroom decorating ideas.
Story first published:Tuesday, August 16, 2011, 10:10 [IST]
Desktop Bottom Promotion