For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో ఇంటి అలకరణతో ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం...

|

Home decoration for Summer
బయటి నుండి ఇంటికి రాగానే హాయిగా కొద్దిసేపు సేద తీరాలని ఎవరికుండదు చెప్పండి అందుకు ఎదుగా కనిపించే దివానాలోనో, సోఫాలోనో ఆశీనులై అందులోని కుసన్ ని సరి చేసుకుని నడేం వాల్చేసి కూచుని విశ్రాంతి తీసుకుంటారు. ఈ విశ్రాంతత ఎక్కడి నుండి వస్తుంది....అలంకరణ నుండినే కదా....విశ్రాంతతకు వస్తువుల అమరికే కాదు అలంకరణ ముఖ్యం...

ఇప్పుడు దాదాపు ధనిక, మధ్యతరగతి అన్న తారతమ్మాలు లేకుండా ఇంటిని అలంకరించుకునేందుకు ఎక్కువ మంది శ్రద్ద చూపిస్తున్నారు.
మారుతున్న కాలానుగుణంగా... ఇంటిలో చిన్న చిన్న మొక్క లు, రకరకాల పువ్వులతో కూడిన ఫ్లవర్‌ వాజ్‌లు, పక్షుల కిలకి లలతో పంజరాలు, ఆహ్లాదకరంగా అటు ఇటు కదులుతూ హొయలొలికించే అనేక రంగు రంగుల చేప పిల్లలతో ఉండే ఎక్వేరియంలు ఇలా అనేక హంగులు నేడు గృహా లంకరణలో నిత్యమైపోయాయి.

ఈ క్రమంలో దివాన్‌ కాట్‌లు, రకరకాల సోఫాలు ఇంటికి కొత్తవన్నెలు తెచ్చే లా కొనుగోలు చేయటమూ కాకుండా వాటిని అందంగా అలంకరించేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నాఇప్పుడు గృహిణులు. ఇంటి అలంకరణ ఓ కళ అనే చెప్పక తప్పదు, టీపాయ్‌ మొదలు, టివి స్టాండ్‌ వరకు, కర్టెన్‌ మొదలు సోఫా కవర్‌ వరకు అన్నీ ఆహ్లాదం పరిచేలా ఉండాల్సిందే.. ఇందుకు ఖర్చుకు వెనక్కి తగ్గకుండా.. తమ శక్తి కొలది కొనుగోలు చేస్తూ... ఇంటిని అలంకరించుకుంటే ఆ ఆహ్లాదకరమైన వాతావరణం మరొక్కటుండదు.

ఇంట్లో రసాయనిక ఏర్‌ ఫ్రెషనర్లను వాడకం తగ్గించి- వాటికి బదులు బేకింగ్‌ సోడా లేక ఏ ఇతర సహజమైన ఫ్రెషెనర్లను వాడటం మంచిది. లేకపోతే కిటికీలను కాసేపు తెరిచి వుంచడం వల్ల సహజమైనటు వంటి గాలి లోపలికి వస్తుంది. ఇల్లు ఆహ్లాదంగా ఉండాలంటే బ్రోమినేటెడ్‌ ఫ్లేమ్‌ రిటార్డెంట్లు, స్టేయి న్‌ రిపె ల్లెంట్లు, రింకిల్‌ రెసిస్టెంట్‌ ట్రీట్‌మెంట్లులేని ఫర్నిచర్‌, కార్పెట్లు, కర్టన్లు ఎంపిక చేసుకోవాలి.

ఇంట్లో విరివిగా మొక్కలు పెంచుకుంటే విషకాలుష్యాన్ని అరికట్ట వచ్చు. ఇంట్లో పెరిగే మొక్కలు కెమికల్స్‌ ను పీల్చుకుని వాటిని ఆహారంగా , శక్తిగా మారుస్తాయి. గాలిని శుభ్రపరు స్తాయి. సహజసిద్ధమైన మొక్కల్నే పెంచడం మంచిది. తలు పులు బార్ల తెరిచివుంచి ఇంట్లో వేడిని సహ జంగానే బయటికి పోయేలా జాగ్రత్త తీసుకొంటే . ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం...

English summary

Home decoration for Summer.. | ఇంటి అలకరణతో ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం...


 When the days are long and the air is warm, you want to throw open your windows and enjoy the days of summer. Bring the fresh look of summer into your home with some quick an easy additions (or removals) of color, style, and accessories.
Story first published:Monday, March 19, 2012, 8:58 [IST]
Desktop Bottom Promotion