For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుస్తకాలను సర్దడం కూడా ఒక కళే..

|

ఎక్కడైనా మంచి పుస్తకం కనిపిస్తే చాలు కొనేయడం...చదివిన తర్వాత దాన్ని ఎక్కడో ఒక చోట పడేయడం..మామూలే!తర్వాత ఎప్పుడైనా అదే పుస్తకం అవసరమొచ్చి వెతికితే తొందరగా దొరకదు. ఎక్కడ ఉంచామో గుర్తుండదు. ఇలా కాకుండా ఇంట్లోనే వాటిని ఒక క్రమ పద్దతిలో అమర్చుకుని చిన్న పాటి గ్రంథాలయంలా ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి పుస్తకం అవసరమైనా వెంటనే తీసుకోవడం సులభమవుతుంది. చూడటానికి బావుంటుంది కూడా...

1. చదివిన పుస్తకాలను ఉంచడానికి ఇంట్లో అల్మరాలు ఎక్కువగా ఉండే గదిని కేటాయించుకోండి. లేదా మార్కెట్లో లభ్యం అవుతున్న బుక్ షెల్ఫ్స్ ని ఖరీదు చేయండి. మీ దగ్గరున్న పుస్తకాలన్నీ పెట్టుకోవడానికి సరిపడే దాన్ని ఎంపికచేసుకోవడం మరవకండి.

2. అల్మరాలలో చదివిన పుస్తకాలను లోపలివైపు, చదవాల్సిన పుస్తకాలను బయటివైపు ఉంచుకుంటే తీసుకోవడం చాలా తేలిక అవుతుంది.

3. ఇందులో ఇతర వస్తువులేవీ ఉంచకుండా జాగ్రత్తపడాలి.

Creative Ideas To Arrange Bookshelf

4. ప్రతి పుస్తకం పేరు బయటకు కనిపించేట్లు అమర్చుకోవాలి. పుస్తకాలను తొందరగా గుర్గించే విధంగా...రచయిత లేదా విభాగాల పేరు కనిపించేలా ఏర్పాట్లు ఉండాలి.

5. ప్రతి పుస్తకం పేరు బయటకు కనిపించేట్లు అమర్చుకోవాలి. పుస్తకాలను తొందరగా గుర్తించే విధంగా రచయిత లేదా విభాగాల పేరు కనిపించేలా ఏర్పాట్లు ఉండాలి.

6. ప్రతి పుస్తకానికి ఒక ప్రత్యేక సంఖ్యను కేటాయించి, పుస్తకం పేరు, సంఖ్యలను ఒక నోటు పుస్తకంలో రాసి పెట్టుకోవాలి. దీని వల్ల ఏ పుస్తకం ఎక్కడుందో, మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయో వెంటనే తెలుస్తుంది. మీ దగ్గర పుస్తకాలు ఎక్కువగా ఉంటే ఈ పద్ధతి అనుసరిస్తే అవసరమైన బుక్ వెతుక్కోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

7. కొన్ని పుస్తకాలకు పైన అట్టలుంటాయి. వీటి వల్ల పేర్లు కనబడవు. వాటిని తొలగించకుండా అట్టలపైనే పుస్తకం లేదా రచయిత పేరు కనిపించేలా అమర్చుకోవాలి.

8. కొత్త పుస్తకాలను అమర్చుకోవడానికి ఎప్పుడూ పది శాతం స్థలాన్నైనా అల్మరాలో ఖాళీగా ఉంచుకోవాలి.

9. పుస్తకాల అల్మరాలలో నాఫ్తలీన్ బాల్స్ (కలరా ఉండలు)వేస్తే చెద పురుగులు చేరకుండా ఉంటాయి.

10. అద్దాలు కలిగిన అల్మరాల, బుక్ షెల్ఫ్ ల వల్ల పుస్తకాలు దుమ్ముకొట్టుకుపోకుండా ఉంటాయి.

ఇలా పుస్తకాలకు ప్రత్యేకించి ఓ గదిని కేటాయించగలిగితే దానినే రీడింగ్ రూమ్ గా మార్చుకోవచ్చు. అలా వీలు కాని పక్షంలో పుస్తకాలు భద్రపరుచుకోవడానికి అవసరమయ్యే స్థలాన్ని గోడలకు అల్మరాల ద్వారా లేదా బుక్ షెల్ఫ్స్ రూపంలో ఏర్పాటు చేయవచ్చు. ఇందుకు అవరమైందల్లా కాస్త సమయం, మరికాస్త ఆలోచన. ఈ రెండింటినీ కలిపి మీ పుస్తకాలను ఎంటనే అందంగా సర్ధేయండి మరి..

English summary

Creative Ideas To Arrange Bookshelf

For many people, books are the essence of life. They play a pivotal role in shaping up people, their wisdom and their outlook in life. Books teach you, inspire you, and make you a better person. However, if you are an avid reader then you will face the problem of arranging your bookshelf.
Story first published: Friday, December 5, 2014, 16:45 [IST]
Desktop Bottom Promotion