క్రిస్మస్ ట్రీ తయారుచేయడానికి కావలసిన సాధారణ వస్తువులు

Posted By: Lekhaka
Subscribe to Boldsky

క్రిస్మస్ ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. మీరు చాల సంతోషంగా ఉన్నారు. అలాగే క్రిస్మస్ ట్రీ తయారుచేయడానికి ప్రణాళికా రచన ప్రారంభం చేసారా? మేము మీకు క్రిస్మస్ ట్రీ తయారుచేయడానికి అవసరమైన సాధారణ వస్తువుల గురించి సహాయం చేస్తాం.

మీరు క్రిస్మస్ సందర్భంగా వీధులు వెంట నడుస్తూ వెళుతున్నప్పుడు, ప్రతి ఇల్లు ఒక క్రిస్మస్ చెట్టు కలిగి అందంగా దండలు, లైట్లు మరియు అందమైన ఆభరణాలతో చూడముచ్చటగా ఉంటుంది.

క్రిస్మస్ చెట్లును ప్రజలు అలంకరించటం అత్యంత మనోహరమైన మరియు సంతోషకరమైన అనుభవం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక పురాతన సాంప్రదాయంగా ఉంది.

అయినా మొదటిసారి క్రిస్మస్ చెట్టును తయారుచేసినప్పుడు క్రిస్మస్ చెట్టుకి అవసరమైన వస్తువులు గురించి తెలియదు. అటువంటి అనుభవం లేని వారి కోసం ఈ వ్యాసం చాలా సహాయకారిగా ఉంటుంది.

ఇక్కడ క్రిస్మస్ చెట్టు తయారుచేయడానికి అవసరం అయిన చాలా ప్రాథమిక విషయాలు ఉన్నాయి:

క్రిస్మస్ చెట్టుకు అవసరమైన వస్తువులు

Simple Things Required To Make The Christmas Tree

చెట్టు యొక్క శాఖలు

మొదట ఒక క్రిస్మస్ చెట్టు సిద్ధం చేసుకోవటానికి అవసరమైన ముఖ్యమైన వస్తువుల యొక్క జాబితాలో చెట్టు కొమ్మలు అనేవి ముఖ్యమైన అంశం. మీరు ఒక పర్వతం లేదా ఒక పార్క్ సమీపంలో నివసిస్తూ ఉంటే, మీరు సులభంగా మీ పరిసరాల నుండి చెట్ల యొక్క కొన్ని చనిపోయిన శాఖలను వెదుక్కోవచ్చు. కొన్ని సార్లు వాతావరణం కారణంగా చెట్ల నుండి కొమ్మలు కిందకి పడిపోతూ ఉంటాయి. వాటిని అయినా క్రిస్మస్ చెట్టు కోసం సేకరించవచ్చు.

Simple Things Required To Make The Christmas Tree

ఒక కుండ లేదా బకెట్

క్రిస్మస్ చెట్టు యొక్క బేస్ చేయడానికి ఒక కుండ లేదా బకెట్ అవసరం. మీకు సెట్ అయ్యే విధంగా ఉత్తమమైన ధరలో దొరకటానికి మార్కెట్ లో అన్వేషించండి. క్రిస్మస్ చెట్టు అలంకరణ వస్తువులను అమ్మే దుకాణాలలో సరసమైన ధరలకు దొరుకుతాయి. లేకపోతే ఒక పాత మొక్క కుండ లేదా ఒక బకెట్ ను ఉపయోగించవచ్చు. దానిని కలరింగ్ ద్వారా రీసైకిల్ చేయవచ్చు. క్రిస్మస్ ట్రీ కి పెద్ద లేదా చాలా చిన్న కుండ ఉండాలని గుర్తు పెట్టుకోవాలి. ఇది చెట్టు యొక్క శాఖలనుపట్టుకోవటానికి ఒక పరిపూర్ణ పరిమాణంలో ఉండాలి.

Simple Things Required To Make The Christmas Tree

మధ్యస్థ పరిమాణంలో రాక్స్ మరియు స్టోన్స్

మీరు సముద్ర ప్రాంతంలో ఉంటే కనుక సముద్ర బీచ్ కి వెళ్లి కొన్ని రాక్స్ మరియు స్టోన్స్ ని సేకరించండి. మీరు సముద్ర ప్రాంతంలో నివసించకపోతే ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి నగరంలో తోట కేంద్రాలలో రాక్స్ మరియు స్టోన్స్ దొరుకుతాయి.

Simple Things Required To Make The Christmas Tree

త్వరగా డ్రై అయ్యే సిమెంట్

ఒక హార్డ్ వేర్ షాప్ కి వెళ్లి త్వరగా డ్రై అయ్యే సిమెంట్ ను అడగండి. వారు మీకు సిమెంట్ ని చిన్న టబ్ లో ఇస్తారు. మొక్క కుండ సిద్ధం చేసి దానిలో దిగువన చిన్న పరిమాణం రాళ్ళు వేయాలి. ఆ తర్వాత కుండ మధ్యలో చెట్టు ట్రంక్ సెట్ చేసి సిమెంట్ మిశ్రమం పోయాలి. కుండ బరువుగా ఉండటానికి మరియు మొక్క సురక్షితంగా ఉండటానికి భారీ పరిమాణ రాళ్ళను వేయాలి. ఆ తర్వాత సిమెంట్ మిశ్రమం పోయాలి. కుండ ఎగువన చిన్న అలంకరణలు మరియు బ్యాటరీ హోల్డర్ లను ఉంచాలి. కొన్ని గంటలు ఆలా వదిలేస్తే సిమెంట్ డ్రై అవుతుంది.

Simple Things Required To Make The Christmas Tree

స్ప్రే పెయింట్ కొనుగోలు

ఏదైనా సమీప హార్డ్వేర్ స్టోర్ లో స్ప్రే పెయింట్ కొనుగోలు చేయండి. ఇది క్రిస్మస్ చెట్టు తయారుచేయడానికి ముఖ్యమైన అంశం. మీరు మీ క్రిస్మస్ చెట్టు కోసం సిల్వర్ లేదా గోల్డ్ కలర్ ని ఎంపిక చేయవచ్చు. మీరు మీ క్రిస్మస్ చెట్టు కొమ్మలపై ఈ పెయింట్ ని పిచికారీ చెయ్యాలి.

Simple Things Required To Make The Christmas Tree

అలంకరణ లైట్స్

క్రిస్మస్ చెట్టు అలంకరణ కోసం మార్కెట్ లో లైట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ లైట్లు తెలుపు లేదా ఆకుపచ్చ వైర్ తీగలతో ఉంటాయి. వైర్ అదృశ్యమవ్వడానికి చెట్టు రంగులో ఉండే తీగను ఎంచుకోవాలి. ఈ తీగ చెట్టు యొక్క స్థావరం నుండి ప్రారంభం అయ్యి క్రమంగా ప్రతి శాఖ చుట్టూ కాంతి తీగలు చుట్టడం ద్వారా పైకి కొనసాగించాలి. చివరిగా, మీ చెట్టు అన్ని వైపులా లైట్ల తో కవర్ చేయాలి. క్రిస్మస్ చెట్టు కోసం బబుల్ లైట్లు, ఎల్ఈడి లైట్లు, మండే లైట్లు మరియు గ్లోబ్ లైట్లను ఎంపిక చేసుకోవచ్చు.

చెట్టు ఆభరణాలు

ఆభరణాలు క్రిస్మస్ చెట్టు యొక్క అలంకరణలో అంతర్భాగంగా ఉంటుంది. అలాగే అవి కూడా ఒక క్రిస్మస్ చెట్టును సిద్ధం చేయటానికి అవసరమైన ముఖ్యమైన అంశాల జాబితా కిందకి వస్తాయి. మీరు క్రిస్మస్ చెట్టును అలంకరించేందుకు మెరిసే,తేలికైన లోహపు రేకు, దండలు, క్యాండీ స్టిక్స్, నక్షత్రాలు మరియు దేవదూతలు వంటి ఆభరణాలను అనేక శాఖలకు ఉపయోగించవచ్చు. క్రిస్మస్ కొమ్మలను చాక్లెట్లు, క్యాండీలు మరియు రంగుల రిబ్బన్ల సహాయంతో అలంకరించవచ్చు.

English summary

Simple Things Required To Make The Christmas Tree

Christmas is just around the corner; you must be very excited and might have started planning to make an exceptional Christmas tree this time. We shall help you here by listing simple things that you need to make a christmas tree.
Story first published: Tuesday, December 13, 2016, 19:00 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter