For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వర్షాకాలంలో మీ ఇంటిని ఈ విధంగా శుభ్రపరుచుకోండి !

|

మన ఇల్లు - మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. అలా అవి మన మనసును ప్రతిబింబింస్తాయి కాబట్టి, మన స్టైల్ కి అనుగుణంగా మన ఇంటి అంతర్భాగాలను అలంకరించేందుకు మనము చాలా సమయాన్ని తీసుకుంటాం. అలా మనము మన ఇంటిని ఎల్లప్పుడూ అందంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తాము. కానీ కొన్నిసార్లు వాతావరణం అందుకు అనుకూలించకపోవచ్చు.

వేసవి కాలంలో వచ్చే వర్షాలు ఖచ్చితంగా మనకు భారీ వేడి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. కానీ మనదేశంలో ఉష్ణమండలాల వంటి ప్రాంతాలలో వచ్చే ఈ వర్షాల వల్ల మీకు అనేక ఇబ్బందులను కలుగజేస్తాయి. అలాగే బయట వాతావరణం పూర్తిగా తడి, బురదతో నిండి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో శుభ్రం చేసుకోవడం అనేది మీకు చికాకు కలిగిస్తుంది. ఈ వర్షాభావ ప్రభావం వల్ల మన ఇంటి ఇంటీరియల్ డెకరేషన్ చిన్నబోతుంది.

ఈ వర్షాలు మన ఇంటి ఇంటీరియల్ డెకరేషన్ను మార్చుతుంది. వర్షపు నీరు, బురద కలయిక మీ ఇంటి చుట్టుపక్కల ఏర్పడిన మరకలను వదిలించడం మరింత కష్టమవుతుంది. తెల్లని గచ్చులు & గోడలకు అందంగా వేయించిన రంగులు అందంగా కనిపిస్తాయి కానీ వర్షాకాలంలో, అవి అలా కనపడవు.

ఇంట్లో పనిచేసే ఆడవారు, వర్షాకాలంలో మీ ఇంటి మూలాలను శుభ్రం చేయడానికి మీకు తగిన అవకాశం ఎక్కువగా వుండదు. వర్షాకాలంలో ఇలాంటి సమస్యలను కలిగివున్న మీఇంటిని శుభ్రపరచడానికి కొన్ని సులభమైన చిట్కాలు మీకు కచ్చితంగా అవసరమవుతాయి.

మీ ఇల్లే మీ హోదాకి చిహ్నమని మనందరికీ బాగా తెలుసు. అలాంటి మీ ఇల్లు వాతావరణం కారణంగా ఎందుకు తన శోభను కోల్పోవాలి ? ఈ వర్షాకాలంలో మీ ఇంటిని శుభ్రం చేయడానికి మీకు సహాయపడే కొన్ని చిట్కాలను మీకు అందజేస్తున్నాము.

మీ ఇంటిని శుభ్రం చేయడంలో సహాయపడే అతి సులభమైన మార్గాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి.

1. అన్ని రకాల కార్పెట్స్ను దూరంగా ఉంచండి :-

1. అన్ని రకాల కార్పెట్స్ను దూరంగా ఉంచండి :-

కార్పెట్స్ పై ఉండే క్రిములు & ధూళి మీ ఇంటికి ఆవాసంగా తయారవుతుంది. ఈ క్రిములను పూర్తిగా తొలగించడమనే చాలా చిన్న విషయం ద్వారా మిమ్మల్ని మీరు చాలా శుభ్రంగా ఉంచుకోవచ్చు. అంతేకాక, ఇది మీ ఇంటిని క్రిములు & ధూళి నుంచి దూరంగా ఉంచుతూ, మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచడాన్ని సులభం చేస్తుంది.

2) ఫర్నిచర్ను సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి :-

2) ఫర్నిచర్ను సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి :-

చాలా ప్రత్యేకంగా ఉన్న ఫర్నిచర్ను తలుపులు (లేదా) కిటికీల నుంచి దూరంగా ఉంచడం ద్వారా వాటిని సురక్షితంగా కాపాడుకోవచ్చు.

3) లైట్ కలర్లు ఉన్న చోట డార్క్ కలర్స్ను ఉంచండి :-

3) లైట్ కలర్లు ఉన్న చోట డార్క్ కలర్స్ను ఉంచండి :-

మీ ఇంట్లో వాడే కర్టిన్స్, డ్రాప్స్ ఈ వర్షాకాలంలో మరింత మురికిగా అవ్వడం ఖాయం. వాటిని శుభ్రం చేసి, ఎండ బెట్టడమనేది మీకు పెద్ద సమస్య ఏమీ కాదు. కానీ మీకు ఇష్టమైన తెల్లని కర్టెన్లను & టేబుల్ స్ప్రెడ్లను డార్క్ కలర్స్లో ఉన్న కర్టెన్లతో భర్తీ చేయడం తెలివైన నిర్ణయం కావచ్చు. ఇలాంటి డార్క్ కలర్స్ ను ఉపయోగించడం వల్ల మీ ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దవచ్చు.

4. కాలి చెప్పులను ఇంటిలోనికి అనుమతించవద్దు :-

4. కాలి చెప్పులను ఇంటిలోనికి అనుమతించవద్దు :-

ఈ వర్షాకాలంలో మీరు ఈ నియమాన్ని తప్పక పాటించాలి. పాదరక్షలను ఇంటిలోపలికి అనుమతించడం ద్వారా ఎక్కువ స్థాయిలో క్రిములను & ధూళిని అనుమతిస్తున్నట్టు లెక్క ! కాబట్టి మీ కాలి చెప్పులను ఇంటి బయట మాత్రమే ఉంచేలా కఠినమైన నియమమును పాటించండి. ఇలా చేయటం వల్ల మీ ఇంటిని శుభ్రపరచడానికి మీ ఎనర్జీ ఎక్కువగా వృధా కాదు, మీ ఇల్లును చూడటానికి చాలా పరిశుభ్రంగా కూడా ఉంటుంది.

5. తడి బట్టలను వేరేగా నిల్వ ఉంచండి :-

5. తడి బట్టలను వేరేగా నిల్వ ఉంచండి :-

రెయిన్ కోట్లు & గొడుగులు వంటి వస్తువులు ఇంటి లోపల ఉండరాదు. వాటి కోసం మీరు కొన్ని హుక్స్ (లేదా) ఒక రాక్ ఉంచవచ్చు, ఇలా ఎండిన బట్టలను ఇంటి బయట నిల్వ చేయవచ్చు.

6. మీరు వాడే ఫర్నిచర్ను పొడిగా ఉంచండి :-

6. మీరు వాడే ఫర్నిచర్ను పొడిగా ఉంచండి :-

ఈ వర్షకాలంలో గాలి ద్వారా తేమ మీ ఫర్నిచర్ను చేరుకుని ఇతర క్రిములు & బ్యాక్టీరియా ఉత్పత్తి కావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ పరిస్థితిని నివారించడంకోసం ఎల్లప్పుడూ మీరు వాడే ఫర్నిచర్ను పొడిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఈ వర్షాకాలంలో మీ గోడలకు & ఫర్నీచర్కు మధ్య సరైన దూరాన్ని ఉంచడం వల్ల తడిగా మారినా ఇంటి గోడలు మీ ఇంటిలో ఉన్న ఫర్నిచర్ తాలూకా చెక్కను నాశనం చేయకుండా ఉంటుంది.

7. వర్షం వచ్చే ముందే బెడ్ షీట్లను, దుప్పట్లను శుభ్రపరచుకోవాలి :-

7. వర్షం వచ్చే ముందే బెడ్ షీట్లను, దుప్పట్లను శుభ్రపరచుకోవాలి :-

వర్షాకాలంలో వర్షం రాకముందే మీరు ఉపయోగించే దుప్పట్లను, కర్టెన్లను శుభ్రంగా ఉతికి పొడిగా మార్చుకోవాలి. తేలికపాటి దుప్పట్లను సులభంగా ఉపయోగించవచ్చు అంతే సులభంగా ఉతికి ఆరబెట్టివచ్చు.

 8. ఇంట్లో ఆరబెట్టే బట్టలకు ప్రత్యేకమైన ప్రదేశాన్ని కేటాయించాలి :-

8. ఇంట్లో ఆరబెట్టే బట్టలకు ప్రత్యేకమైన ప్రదేశాన్ని కేటాయించాలి :-

మీ ఇంట్లో వాడని గదిని బాగా వెంటిలేషన్గా ఉండేటట్లుగా చేసి, ఉతికిన బట్టలను ఆరబెట్టడానికి ఉపయోగించవచ్చు. బట్టలు చెడిపోకుండా వాటిని శుభ్రపరిచి, ఎండబెట్టడమనేది చాలా ముఖ్యమైన చర్య. ఉతికిన తడి బట్టల నుండి వచ్చే వాసనను దూరం చేయడానికి ఆ గది చుట్టూ కొన్ని నాఫ్తలీన్ బంతులను ఉంచవచ్చు.

9. తేమను హరించు పరికరాన్ని అమర్చండి :-

9. తేమను హరించు పరికరాన్ని అమర్చండి :-

వర్షాల కారణంగా ఏర్పడే అధిక తేమ మనకు శత్రువు వంటిది. అవి కేవలం ఇంట్లో ఉన్న ఫర్నిచర్ను & ఇతర వస్తువులను నాశనం చేయడమే కాకుండా, మనల్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఈ అధిక తేమ కారణంగా చర్మం ఉపరితలంపై ఉన్న బ్యాక్టీరియా & ఫంగస్ వంటి క్రిముల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, ఈ విధంగా మనకు అనేక రకాల చర్మ సమస్యలు కలగటానికి దారితీస్తుంది. తేమను హరించు పరికరాన్ని ఉపయోగించడమనేది కాస్త ఖర్చుతో కూడుకున్న విషయమే అయినప్పటికీ, ఇది భవిష్యత్తులో మనకు చాలా రకాల ఇబ్బందులు కలగకుండా రక్షిస్తుంది.

10. ఇంటిని శుభ్రపరిచే సాధనాలను ఎల్లప్పుడు నిల్వ ఉంచుకోండి :-

10. ఇంటిని శుభ్రపరిచే సాధనాలను ఎల్లప్పుడు నిల్వ ఉంచుకోండి :-

ఈ వర్షాకాలంలో మీరు క్రిములు & ధూళి బారిన పడకుండా ఉండటానికి తరుచుగా మీ ఫ్లోర్స్ ను శుభ్రం చేయవలసి ఉంటుంది. అందువల్ల మీ ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రపరిచే క్లీనర్లను మీ వద్ద నిల్వ ఉంచుకోవటం వల్ల వర్షాకాలంలో సూపర్మార్కెట్లు చుట్టూ తిరిగి అవస్థల నుంచి మీరు రక్షించబడతారు.

English summary

Keeping Your House Clean This Monsoon

It's monsoon time and it's that time of the year when your house becomes dirty due to heavy rains and there might be leakage around your house. But following certain tips will help you keep your house clean this monsoon. Cleaning the carpet or, in fact, not using the carpet can keep your house clean. Never wear a footware inside the house.
Story first published: Saturday, July 21, 2018, 13:30 [IST]
Desktop Bottom Promotion