Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
కాలానికి తగన కూరల మొక్కలు...

నిజానికి..కొన్ని జాగ్రత్తలు పాటించినట్లైతే.. ఇంటిపట్టునే ఏ కాలంలోనైనా ఏ పంటలైనా పండించుకోవచ్చు. అననుకూల వాతావరణంలో పంటలు పండించాలంటే.. ఆయా పంటల ప్రత్యేక లక్షణాలు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదా: క్యారట్, క్యాబేజీ వంటి పంటలు సాధారణంగా చలికాలం-శీతాకాలంలో చక్కగా పెరుగుతాయి. అధికవేడిని తట్టుకోలేకపోవడం వీటి సహజలక్షణం. కాలాన్ని బట్టి మొక్కలను పండించుకోవడం వల్ల పంట బాగా పండుటయే కాకుండా అధిక దిగుబడిని ఇస్తుంది. ఆకుకూరలు నెలరోజుల్లో కోతకు వస్తాయి. అయితే రెండు నెలలపాటు దిగుబడినిస్తాయి. అలాగే బెండవిత్తనం నెలకు కాపుకొస్తుంది అయితే కాయలు మాత్రం మూడు నెలలు కాస్తాయి.
ఇలా మిరిప, టమోటో, వంగ... అన్నిరకాల కూరగాయలను పండించుకోవచ్చు. కొత్తిమీర, పుదీన కుండీలు-మడుల అంచుల్లో చల్లుకుంటే సరిపోతాయి. ఎండాకాలంలో, ముఖ్యంగా టెరస్ ల్రపై, కూరగాయల మొక్కలు పెంచాలనుకుంటే షేడ్ నెట్ తో ఎండ నుంచి రక్షణ కల్పించాలి. సెల్ఫ్ వాటరింగ్ పాట్స్ ను....మడులను ఏర్పాటుచేసుకోవచ్చు.
ఎండాకాలం: చిక్కుడు, ఆనప, కాకర, బీర, పొట్లకాయ, గుమ్మడి, దొండ, బెండ, దోస, అన్ని రకాల ఆకుకూరలు...ఇంటి పెరడులో పండించవచ్చు.
వర్షా కాలం: అన్ని రకాల ఆకుకూరలు, వంగ, బెండ, గోరుచిక్కుడు, బీర, కాకర..పం
చలికాలం: బఠాణీలు, చిక్కుడు, టమాటా, క్యాబేజి, క్యాలీఫ్లవర్, బంగాళాదుంపలు, బీన్స్, క్యారట్..
ఎండలో / ఎక్కువ కాంతిలో పెరిగేవి: వంగ, టమాటా, మిరప..
నీడలో పెరిగేవి: చాలామటుకు ఆకుకూరలు, ఆవాలు, క్యాబేజి, క్యారట్, ముల్లంగి, చిలకడ దుంప మొక్కలు..



Click it and Unblock the Notifications
