For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Vastu Tips For Couple: ఇంట్లోని ఈ వాస్తు దోషాల వల్ల దంపతుల మధ్య ఎప్పుడూ గొడవలే

ప్రతి జంట తమ బంధాన్ని బలోపేతం చేసుకోవాలని కోరుకుంటారు. అయితే ఇంట్లోని కొన్ని వాస్తు దోషాల వల్ల దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆ వాస్తు దోషాలను పరిష్కరించుకుంటే సమస్యలు తొలగిపోయి బంధం బలోపేతం అవుతుంది.

|

Vastu Tips Fot Couple: వివాహంలో కేవలం ఆనందం, సంతోషం మాత్రమే ఉండదు. అసంతృప్తులు, సమస్యలు, కలహాలు, గొడవలు ఇలా చాలా ఉంటాయి. ఇవే అసలు ఒక జంటను పరీక్షిస్తాయి. వీటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగినప్పుడే సంబంధం బలోపేతం అవుతుంది.

Vastu tips to solve problem between couple in telugu

ప్రతి జంట తమ బంధాన్ని బలోపేతం చేసుకోవాలని కోరుకుంటారు. అయితే ఇంట్లోని కొన్ని వాస్తు దోషాల వల్ల దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆ వాస్తు దోషాలను పరిష్కరించుకుంటే సమస్యలు తొలగిపోయి బంధం బలోపేతం అవుతుంది.

దంపతులు పాటించాల్సిన వాస్తు చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. పడకల విషయంలో..

దంపతులు పాటించాల్సిన వాస్తు చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. పడకల విషయంలో..

మెటల్ బెడ్‌లపై పడుకోవడం మానుకోవాలి. ఎందుకంటే ఇది మీకు, మీ భాగస్వామికి నిద్రకు భంగం కలిగిస్తాయి. దీని వల్ల బంధంలో కలహాలు, కలహాల వల్ల వివాదాలు వస్తాయి. అలాగే రెండు చిన్న సైజు పడకల కంటే ఒక పెద్ద సైజు కింగ్ లేదా క్వీన్ సైజ్ బెడ్ వాడుకోవడం ఉత్తమం.

గోడలపై రంగులు

గోడలపై రంగులు

జంటలు ఈశాన్య ప్రాంతంలో నీలం లేదా ఊదా రంగు ఉండేలా చూసుకోవాలి. అక్కడ ఖాళీ స్థలం కూడా తెరిచి ఉండాలి. కాంతిల లోపలికి రావాలి. ఇది వివాహిత జంటల మధ్య సంతోషకరమైన ఆలోచనలను సృష్టిస్తుంది.

పెద్ద బెడ్‌రూమ్

పెద్ద బెడ్‌రూమ్

మాస్టర్ బెడ్రూమ్ ఇంటి నైరుతి ప్రాంతంలో ఉండాలి. ఇది పురుష శక్తిని సమతుల్యం చేస్తుంది. పురుషుడిని స్త్రీ వైపు మొగ్గు చూపేలా చేస్తుంది. దీంతో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా కుదురుతుంది. ఇది వివాహంలో స్థిరత్వాన్ని కూడా ఏర్పరుస్తుంది.

మృదువైన రంగులు

మృదువైన రంగులు

మృదువైన లేదా వార్మ్ కలర్ లాంప్‌షేడ్‌లు ఇంటికి మంచి లుక్‌ను ఇస్తాయి. పాస్టెల్- రంగు షీట్లు ఎవరినైనా వివాహం చేసుకోవాలని ఎదురుచూస్తున్న వ్యక్తులకు అదృష్టాన్ని కలిగిస్తాయి. ఫ్లవర్ డిజైన్లు కూడా వాస్తు ప్రకారం మంచిదే.

వంటగది

వంటగది

వంటగది ఆగ్నేయ దిశలో ఉండాలి. ఇది భాగస్వాములిద్దరినీ మానసికంగా, శారీరకంగా స్థిరంగా ఉంచుతుంది. ఆగ్నేయ దిశలో వంటగది ఉండటంలో దంపతుల మధ్య కలహాలు రావు. బంధం బలోపేతం అవుతుంది.

దుప్పట్ల రంగులు

దుప్పట్ల రంగులు

పింక్ లేదా రెడ్ కలర్ దుప్పట్లు, బెడ్‌షీట్‌లను, డ్రేప్స్‌ను ఉపయోగించడం వల్ల వివాహ జీవితం సాఫీగా సాగుతుంది.

సంతోషకరమైన వివాహ జీవితానికి వాస్తు చిట్కాలు:

సంతోషకరమైన వివాహ జీవితానికి వాస్తు చిట్కాలు:

* కొత్తగా వివాహం అయిన జంటలు ఆగ్నేయ దిశలో ఉండే గదిలో ఉండొద్దు. ఇది సంబంధానికి హానికరం. మీరు అలాంటి గదిలో ఉంటే మీ సంబంధం దెబ్బతింటుంది.

* పడకగదిలో లేత రంగులను మాత్రమే ఉపయోగించాలి. అలాగే గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. సామాన్లు చిందరవందర గా ఉంటే జీవితం కూడా అలాగే మారుతుంది.

* ఇంటి నాయకుడి గది నైరుతి దిశలో ఉండాలి. ఇలాంటి గదిలో నివసించడం వల్ల సంబంధాలు బాగుంటాయి.

* పడుకునే మంచం చెక్కతో చేసినదై ఉండాలి. అలాగే చతురస్రాకారంలో ఉండాలి. పడుకునేటప్పుడు తలను దక్షిణం వైపు, కాళ్లు ఉత్తరం వైపు ఉంచాలి. ఈ స్థానం సంబంధానికి మంచిదని భావిస్తారు.

* పెళ్లైన జంటలు తమ అలంకరణ వస్తువులను ఒకే చోట ఉంచుకోవాలి. మీ పడకగదిలో టీవీ లేదా కంప్యూటర్ ఉంచుకోవద్దు.

* పడుకునే మంచం ఒకటే ఉండాలి. రెండు చిన్న మంచాలను కలిపి పెద్ద మంచంగా ఉపయోగించవద్దు. మంచాన్ని దక్షిణం లేదా నైరుతి దిశలో మాత్రమే ఉంచాలి.

* పడకగదిలో చనిపోయిన వ్యక్తుల చిత్రాలు ఉంచవద్దు. వాస్తు ప్రకారం ఇలా చేయవద్దు.

* గదిలో పడుకునే సమయంలో భార్యభర్తల ముఖాన్ని చూడగలిగే అద్దం ఉంటే అది సంబంధానికి ఏమాత్రం మంచిది కాదు. వేరే చోట పెట్టలేకపోతే పడుకునే సమయంలో దానిపై తువ్వాలు కప్పుకోండి.

English summary

Vastu tips to solve problem between couple in telugu

read on to know Vastu tips to solve problem between couple in telugu
Story first published:Thursday, December 15, 2022, 17:41 [IST]
Desktop Bottom Promotion