For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాలె గూళ్ళును వదిలించుకొనే సులభ చిట్కాలు...!?

|

చాలా మందికి అరాక్నోఫోబియా వుంటుంది కాబట్టి సాలె గూళ్ళు వదిలించుకోవడం భయంతో కూడుకున్నదే. అదృష్టవశాత్తూ, ఆశ్చర్యాలు, భయాలు లేకుండానే మూలల నుంచి పగుళ్ళ నుంచి సాలె గూళ్ళు బయటకు తీసే విధానాలు వున్నాయి.

చర్యలు:

1. సాలె గూట్లో బతికి వున్న సాలీళ్ళు, పురుగులూ వున్నాయేమో చూడండి. వాటిని ముందే తీసివేయక పొతే మీరు గూడును శుభ్రం చేయగానే కీటకాలు, సాలీళ్ళు చెల్లాచెదురుగా పరిగెడతాయి - దాంతో మీ పని మరింత క్లిష్టం అవుతుంది.

2. ఈ సాలె గూళ్ళు తీసేయడానికి కావలసిన సామాన్లన్నీ ఒకేసారి తెచ్చుకోండి - ని౦చోడానికి కుర్చీ, చేతి తొడుగులు, కాగితం తువ్వాళ్ళు లాంటివి.

3. మీరు ఏ విధానంలో సాలె గూళ్ళు తొలగించాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. దీనికి కనీసం నాలుగు విధానాలు వున్నాయి - అవి తరువాత వివరంగా చెప్పబడ్డాయి.

విధానం 1:

1. ఒక పేపర్ తువ్వాలు వాడండి. గూట్లో వున్న సాలీడు ని మీరు తొలగించ లేకపోతె, పేపర్ తువ్వాలుతో దాన్ని గబుక్కున పట్టుకుని పారవేయండి లేదా అదింకా బతికే వుంటే వదిలేయండి.

2. గూడును గూడును పేపర్ తువ్వాలుతో తుడిచేయండి. మీకు అసౌకర్యంగా అనిపిస్తే చేతికి తొడుగులు వేసుకోండి.

How to Get Rid of Spider Webs

విధానం 2:

1. గూడును తొలగించడానికి కర్రను ఉపయోగించండి. పగుళ్ళు ఎలా వున్నాయనే దాన్ని బట్టి ఎంత కర్ర వాడాలో ఆధార పడివుంటుంది. ఉదాహరణకు, మీరు ఒక సైకిల్ ను శుభ్రం చేసేటప్పుడు ఒక చిన్న కొమ్మ లేదా కర్రముక్క వాడవచ్చు. అదే పైకప్పు మూలలకోసం ఐతే ఒక బూజుల కర్ర వాడాలి.

2. గూడును మరింత సమర్ధంగా లాగడానికి కర్రకి చుట్టూ ఏదైనా చుట్టండి. బూజుల కర్రకైతే డక్ట్ టేపు లాంటిది చుట్టవచ్చు - అదీ దాని అతుక్కునే భాగం బయటకు వచ్చేలాగా. కొమ్మలు, చిన్న కర్ర ముక్కలకైతే టాయిలెట్ పేపర్ బానే పనిచేస్తుంది. ముళ్ళతో వుండే దేవదారు చెక్క కూడా చాలా బాగా పని చేస్తుంది.

3. కర్రతో లాగేయండి. సౌకర్యవంతమైన దూరం నుంచి కర్రతో గూళ్ళన్నీ లాగేయండి.

4. కర్రైతే పారేయండి. అదే బూజుల కర్రైతే గూళ్ళు దులపడం ఐపోతే ఒక హోస్ తో చక్కగా కడిగేయండి.

విధానం 3:

1. చేత్తో పట్టుకునే ఒక చిన్న వాక్యూం క్లీనర్ తో గూళ్ళు శుభ్రం చేయండి. శుభ్రం చేయాల్సిన ప్రతీ దానికి ఇది పనికి రాదు - ఉదాహరణకు సైకిళ్ళు శుభ్రం చేయడం లాంటివి.

విధానం 4:

1. క్లోరాక్స్ క్లీనప్ లాంటి డైల్యూట్ చేసిన బ్లీచ్ ద్రావకం గూడుపై చల్లండి.

చిట్కాలు:

మామూలు నీళ్ళు గూళ్ళ మీద పెద్దగా పనిచేయవు - ఎందుకంటే అవి గూడులోంచి బయటకు వెళ్ళిపోతాయి. దాని బదులు దాని మీద ఒత్తిడితో కూడిన నీరు వాడండి. ఇది మెరుగ్గా పని చేస్తుంది కానీ కొంత గూడును వుంచేస్తుంది. దీన్ని బహిరంగ ప్రాంతాల్లోనే వాడండి.

గూళ్ళు తొలగించడానికి వెబ్స్టర్స్ గా పిలువబడే పెద్ద, దట్టమైన బ్రష్ లు కొన్ని కంపెనీలు అమ్ముతాయి. ఆహారం దొరుకుతుంది కాబట్టి మీకు సాలీళ్ళు అక్కడ కనపడతాయి. మీరు గూళ్ళన్నీ తీసేసి, వాటి ఆహారాన్ని అక్కడే ఉంచితే సాలీళ్ళు మళ్ళీ అక్కడికి చేరుతాయి. అలాగే సాలీళ్ళు తగ్గితే మిగతా కీటకాల సంతతి పెరుగుతుంది. ఒక ప్రదేశంలో చాలా సాలీళ్ళు ఉన్నాయంటే అక్కడ చాలా ఆహారం ఉందన్నమాట. కీటకాల నియంత్రణకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి సాలీళ్ళతో రాజీ పడిపోవడమే మంచిదేమో. ఈ ఎనిమిది కాళ్ళ కీటకాలు నిజంగానే మిమ్మల్ని భయపెడితే, దగ్గరలోనే వున్న కుటుంబ సభ్యులనో స్నేహితులనో అడగడానికి బిడియ పడకండి.

ఈగలకు పనిచేసినట్టే ఫ్లై స్వాటర్లు సాలీళ్ళకు కూడా పని చేస్తాయి. మీ దగ్గర ఇప్పటికే ఒకటి వుండే వుంటుంది - దాన్ని బయటకు తీసి వాడండి.

English summary

How to Get Rid of Spider Webs | సాలె గూళ్ళు తొలగించేదుకు సులభ చిట్కాలు..!

Since a lot of people suffer from arachnophobia, getting rid of spider webs can be frightening. Fortunately, there are ways of getting a web out of nooks and crannies without the surprises and scares.
Story first published: Thursday, January 3, 2013, 17:34 [IST]
Desktop Bottom Promotion