For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మైక్రో ఫైబర్ వస్త్రాలను ఉతకడం ఎలా ?

|

అధ్బుతమైన వస్త్రాలుగా ప్రసిద్ధమైన ఈ బట్టలు ఇప్పుడు అస్తమానూ వాడే గుడ్డలకు రోజువారీ ప్రత్యామ్నాయంగా మారాయి. పాత గుడ్డలు, స్పాంజ్ లు, లేదా ఇతర పాత్రలు శుభ్రం చేసే అన్ని పనులూ చేస్తూ ఫైబర్ గుడ్డలు ఇప్పుడు ప్రతి ఇంటికీ చేరాయి. ఎందుకంటే మైక్రో ఫైబర్ గుడ్డలు తేలికగా, శుభ్రం చేయడానికి లేదా తిరిగి వాడడానికి తేలికగా వుండి, మురికిని, చెత్తను ఆకర్షి౦చడానికి బాగుంటాయి. మీరు జాగ్రత్తగా చూసుకుంటే ప్రత్యేకంగా నేసిన సింథటిక్ దుస్తులు చాలా కాలం మన్నుతాయి.

సూచనలు :

కొన్ని మైక్రో ఫైబర్ దుస్తులను చేత్తో ఉతకండి.

1. టర్పెన్టైన్ లాంటి గాఢమైన క్లీనర్లు లేదా సాల్వెంట్లతో వాడిన గుడ్డలను వేరు చేయండి, విడిగా ఉతకండి.

2. ఉతికే నీళ్ళను విడిగా ఒక బకెట్ లో సిద్ధం చేయండి. ఒక గ్యాలన్ చల్లటి నీటికి ఒక టీస్పూన్ లేదా అంతకన్నా ఎక్కువ లాండ్రీ సబ్బు వేసి గిలక్కొట్టి నురగ తెప్పి౦చండి.

3. మురికి పట్టిన గుడ్డలను ముందుగా మరకలు తొలగించే ద్రవంతో తుడిచి కొద్ది సేపు ఉండనివ్వండి.

How to Wash Microfiber Cloths

4. ఒకేసారి ఆరు నుంచి ఎనిమిది గుడ్డలు ఉతకండి. కొద్ది సేపు వాటిని ముంచి నాననివ్వండి. తరువాత సబ్బు నీటిని వాటినుంచి పిండి వేయండి.

5. చల్లటి, కారే నీళ్ళలో గుడ్డలను బాగా ఝాడి౦చండి.

6. బాగా మురికిగా వున్న బట్టలను విడిగా ఉతకండి. వాటిని ఉతకడానికి గోరువెచ్చటి లేక వేడి నీరు అవసరం కావచ్చు, అలాగే చాలా సార్లు నానబెట్టాల్సి రావచ్చు.

7. మైక్రో ఫైబర్ గుడ్డలను దాచే ముందు బాగా గాలికి ఆరనివ్వండి.

ఒక కుప్ప మైక్రో ఫైబర్ గుడ్డలను మెషీన్ లో ఉతకండి.

8. బాగా మురికి పట్టిన గుడ్డలను లేదా గాఢమైన క్లీనర్లు, శుభ్రం చేసే ఉత్పత్తులను ఒక మూట గా వేయండి - వాటిని విడిగా వుంచండి.

9. కనబడే నూనె లేదా గ్రీసు మరకల మీద మరకలు తొలగించే ద్రవం వాడి, వాటిని కొద్ది సేపు పక్కన ఉండనివ్వండి.

10. మీరు ఉతకడానికి వేసిన మైక్రో ఫైబర్ గుడ్డలను బట్టి వాషింగ్ మిషన్ లో నీటి స్థాయి ని చిన్న, మధ్యస్తం లేదా పెద్ద స్థాయికి సర్దండి.

11. మీరు వేసిన గుడ్డల బరువును బట్టి చల్ల నీటి ఉతుకు, సాధారణ లేదా సున్నితమైన సైకిల్ ను ఎంచుకోండి.

12. వాషింగ్ మిషన్ ఆన్ చేసి అట్టపెట్టె మీద రాసిన సూచనల ప్రకారం సబ్బు కలపండి.

13. బాగా మురికి పట్టిన గుడ్డలను, మీకు కనిపించే మురికి స్థాయిని బట్టి విడిగా వెచ్చటి లేదా వేడి నీటిలో వేసి ఉతకండి.

14. డ్రైయర్ ను లో మీద వుంచి మొత్తం గుడ్డలను ఆరనివ్వండి లేదా మీకు స్థలం అందుబాటులో వుంటే గాలికి ఆరనివ్వండి.

చిట్కాలు & హెచ్చరికలు

మీరు శుభ్రం చేయడానికి వాడే గుడ్డల మీద మరకలు తొలగించే ద్రవం వాడండి. ఇలాంటి ద్రవాలకు పెద్ద సాధనం ఏమిటంటే పెంపుడు జంతువులుండే నడవా. కొన్ని పెట్ కార్పెట్ క్లీనర్లు అన్ని రకాల మరకలనీ పోగొడతాయి. పై పట్టికలు చదవండి.

వాటి నిర్మాణం వల్ల మైక్రో ఫైబర్ గుడ్డలు చాలా త్వరగా ఆరిపోతాయి. డ్రైయర్ కు వాడే విద్యుత్ ఆదా చేయాలంటే వాటిని ఆరవేయండి - అవి ఇట్టే ఆరిపోతాయి.

వేడిని దగ్గరకు రానేయకండి, ఎందుకంటే అవి మైక్రో ఫైబర్ వస్త్రాలను పాడు చేసి కుంచించుకు పోయేలా చేస్తాయి. వాటిని తడి లేదా వేడి కి ఎక్కువ సేపు అంటుకుని ఉండకుండా చూసుకోండి.

English summary

How to Wash Microfiber Cloths | మైక్రో ఫైబర్ వస్త్రాలను ఉతకడం ఎలా ?

They started as the fabled Miracle Cloths and became the everyday substitute for regular cloth rags. Microfiber cloths have worked their way into household tasks that rags, sponges or other cleaning utensils used to do.
Story first published: Sunday, January 13, 2013, 15:32 [IST]
Desktop Bottom Promotion