For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నల్లుల బెడదను వదిలించుకోవడానికి ఉత్తమ మార్గాలు

|

నల్లులు (ఆంగ్లంలో వీటిని Bed bugs అంటారు) దోమలాగా రక్తాహార కీటకాలు. ఇవి విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. భారతదేశంలో లభించే నల్లి శాస్త్రీయ నామం 'సెమెక్స్ రొటండస్'. ఐరోపా, అమెరికా దేశాలలో ఉండే నల్లిని 'సిమెక్స్ లెక్ట్యులేరియస్' అంటారు.నల్లులలో గుచ్చి పీల్చే రకమైన ముఖ భాగాలుంటాయి. ఇవి మానవుడి మీద బాహ్య విరామ పరాన్న జీవులుగా బతుకుతాయి. ఇది నిశాచర కీటకాలు. పగటిపూట ఇవి గృహోపకరణాల నెర్రెలలో, బల్లలు, సీట్ల పగుళ్ళలో దాగి ఉంటాయి.

బెడ్ బగ్స్ ను రాత్రిపూట కీటకాలు అని చెప్పవచ్చు. ఇవి మీకు నిద్ర లేకుండా చేస్తాయి. సాధారణంగా ఇవి వెచ్చని ప్రాంతాల్లో ఉండి రక్తంను ఆహారంగా తీసుకుంటాయి. అవి మీ మొత్తం ఫర్నిచర్ మరియు పరుపులకు బాగా విస్తరించి ఉంటాయి. కాబట్టి వాటిని ముందు వదిలించుకోవటం చాలా ముఖ్యం. సాధారణంగా బెడ్ బగ్స్ పరుపులు, బెడ్ కవర్లు మొదలైన వాటిలో దాక్కుంటాయి. అవి పగటిపూట మరియు రాత్రులు సమయంలో ఆహారం కొరకు బయట పాకుతూ ఉంటాయి. అందువల్ల వాటిని ఎదుర్కోవడంలో చాలా బాధను అనుభవిస్తారు.

ఈ నల్లుల బెడదను నివారించుకోవడానికి కొన్ని నేచురల్ హోం రెమెడీస్ అద్భుతంగా పనిచేస్తాయి. ఉదాహరణకు నిమ్మరసం, ఇందులో ఉండే స్టాంగ్ అసిడిక్ యాసిడ్ వల్ల దీన్నివంటింటి చిట్కాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే నిమ్మరసంలో కంటే వెనిగర్ మరింత స్ట్రాంగ్ గా ఉండటం చేత ఎటువంటి క్రిమి కీటకాలనైనా చాలా తేలికగా నివారించవచ్చు. ఇక్కడ బెడ్ బగ్స్ ను ఎలా ఎదుర్కొవడానికి మరికొన్ని నేచురల్ క్రిమి సంహారక హోం రెమెడీస్ మీకోసం...

Kill Bed Bugs With Pungent Ingredients

1. వెనిగర్: వెడ్ బగ్స్(నల్లులు)ను నివారించడానికి వెనిగర్ ఎఫిక్టివ్ గా సహాయపడుతుంది. వెనిగర్ మార్కెట్లో చాలా సులభంగా అందుబాటులో ఈ క్రిములున్నచోట వెనిగర్ ను చిలకరించి వదిలితే సులభంగా నివారించబడుతాయి.

2. ఉప్పు: మరో క్రిమి సంహారిని, ఉప్పు. ఇది బెడ్ బగ్స్ ను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. నలుల్లున్న ప్రదేశంలో కొద్దిగా సీసాల్ట్ చిలకరించి వదిలేయాలి. ఇది తక్షణ ప్రభావం చూపుతుంది.

3. ఉల్లిపాయ రసం: ఈ నేచురల్ హోం రెమెడీ గురించి చాలా మందికి తెలిసుండకపోవచ్చు, బెడ్ బగ్స్ ను నివారించడానికి ఉల్లిపాయ రసం అద్భుతంగా సహాయపడుతుంది, తక్షణం నల్లులు చనిపోయే విధంగా చేసే ఘాటైన వాసన ఉల్లిపాయలో ఉంది.

4. టీట్రీ ఆయిల్ : మీ పడకగదిలో బెడ్ బగ్స్ నివారించడానికి టీట్రీ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది . టీట్రీ ఆయిల్ యొక్క స్ట్రాంగ్ అండ్ ఘాటైన వాసన వల్ల నల్లులు నివారించబడుతాయి .

5. ల్యావెండర్ ఆయిల్: ఈ చిన్నని హేర్బల్ లీవ్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ల్యావెండర్ ఆయిల్ ను చిలకరించడం వల్ల లేదా ఎండిన ల్యావెండర్ ఆకులను ఒక క్లాత్ లో చుట్టి పడకగదిలో ఉంచడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

English summary

Kill Bed Bugs With Pungent Ingredients

To get rid of bed bugs in your home, will be a task which never ends in a hurry. When your home is infected with bed bugs, the first thing to do is wash all your clothes with baking soda or with vinegar. Keep them in a safe place out of the room until it is clean and free of bed bugs.
Desktop Bottom Promotion