For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైట్ సాక్సులను కాంతివంతంగా శుభ్రం చేయడం ఎలా

|

సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లోను చిన్న పిల్లలు ఉంటారు, ఆఫీసుకు వెళ్ళేవారు, స్కూల్, కాలేజ్ కు వెళ్ళే పిల్లలు ఉంటారు. వారు సాక్సులు ధరించడం సహజం వైట్ సాక్సులను చిన్న పిల్లలు ఎక్కువగా ధరిస్తుంటారు. వైట్ కలర్ చాలా లైట్ గా ఉండటం వల్ల ఎప్పుడూ, చాలా త్వరగా దుమ్ము, ధూళి, మురికి చాలా త్వరగా గురి అవుతుంటుంది. కొన్నప్పుడు ఉన్నంత మెరుపు, వాటిని ఉతికిన తర్వాత వైట్ సాక్సుల్లో కనబడదు. వైట్ సాక్సులను ఉతికిన తర్వాత అవి పసుపురంగులోనికి మారుతాయి. కొన్ని ఉతుకుల తర్వాత వైట్ సాక్సులను కొత్తవాటిలా మెరిపించడం సాధ్యం కాదు, కానీ, పసుపుగా మారకుండా నివారించవచ్చు.

తెల్లని సాక్స్ ల వల్ల ఒక పెద్ద సమస్య, చాలా త్వరగా ఇవి మురిపడుతాయి మరియు మరకలు పడుతాయి. మరియు దూరం నుండీనే ఈ మరకలను మనం గమనించవచ్చు . వైట్ సాక్స్ లను మెయింటైన్ చేయడం చాలా కష్టం, కాబట్టి, ఇక్కడ కొన్ని క్లీనింగ్ చిట్కాలు ఉన్నాయి. వైట్ సాక్సులను ఉతికి, కొత్తవాటిలా నిర్వహించడానికి కొన్ని సులభ చిట్కాలు ఉన్నాయి. ఇవి చాలా సింపుల్ వాషింగ్ టిప్స్, వీటిని ఎటువంటి సమస్య లేకుండా ప్రతి ఒక్కరూ అనుసరించవచ్చు.

Tips To Wash White Socks

వైట్ సాక్సులను రెగ్యులర్ గా వాష్ చేయవచ్చు: మీరు వైట్ సాక్సులను రెగ్యులర్ గా వేసుకుంటున్నట్లైతే, మీ వార్డ్ రోబ్ లో రెండు, మూడు జతలను అదనంగా పెట్టుకోవాలి. సాక్సులను ఉపయోగించిన ప్రతి సారి ఉతికి ఎండలో వేసి నానబెట్టుకోవాలి . ఇలా చేయడం వల్ల మరకలను వదిలిస్తుంది మరియు దుమ్మను శాస్వతంగా వదలగొడుతుంది. ముఖ్యంగా ఇతర కలర్స్ తో పోల్చినప్పుడు వైట్ సాక్స్ చాలా త్వరగా మురికి పడుతాయి. కాబట్టి, వైట్ సాక్సులను నిర్వహించడం కొంచెం కష్టం అవుతుంది.

గోరు వెచ్చని నీటిని ఉపయోగించాలి: వైట్ సాక్సులను బాగా వేడిగా ఉన్న నీటిలో నానెబట్టుట వల్ల మెటీటిరయల్ మరియు సాక్సుల యొక్క ఎలాసిటి పోతుంది. కాబట్టి, గోరువెచ్చని నీటిని ఉపయోగించమని సలహా. గోరువెచ్చని నీటిని ఉపయోగించడం వల్ల ఇది చాలా సులభంగా మురికి వదులు తుంది మరియు ఫ్యాబ్రిక్ ఫ్రెండ్లీ గా ఉంటుంది.

బ్రెష్: డర్టీ వైట్ సాక్స్ ను గోరువెచ్చని నీటిలో డిటర్జెంట్ సొల్యూషన్ తో ఒక గంట సేపు నానబెట్టుకోవాలి, దాని తర్వాత సాక్సులకు చాలా సున్నితంగా బ్రష్ వేసి, ఉతకాలి. తర్వాత మంచి నీటిలో రెండు మూడు సార్లు జాలించి తర్వాత ఎండలో వేయాలి.

బ్లీచ్: కొన్నిసమయాల్లో, ఇంట్లోనే బ్లీచింగ్ ఉపయోగించి వైట్ సాక్స్ లను వాష్ చేసుకోవచ్చు. ఇది వైట్ సాక్సులు, క్లీన్ అవ్వడానికి మరియు కలర్ తగ్గకుండా ఉండటానికి బాగా సహాయపడుతుంది.

నిమ్మరసం: నిమ్మరసం సిట్రస్ మరియు యాసిడ్స్ ఇది సాక్సుల యొక్క వైట్ కలర్ ను ఏ మాత్రం తగ్గనివ్వకుండా చేస్తుంది. ముఖ్యంగా మీకు కాళ్ళలో చెమట పట్టడం మరియు దుర్వాస, చెమట వాసన పోగొట్టాలంటే, నిమ్మరసాన్ని ఉపయోగించండి గోరు వెచ్చని నీటిలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి, తర్వాత డిటర్జెంట్ వేసి 30నిముషాలు నానబెట్టి, తర్వాత శుభ్రంగా ఉతికి, మంచి నీటిలో జాలించి తర్వాత ఎండలో వేసి ఆరబెట్టాలి.

బేకింగ్ సోడా: వైట్ సాక్స్ లను శుభ్రపరచడానికి మరియు మెయింటైన్ చేయడానికి ఇది ఒక అద్భుత చిట్కా. గోరువెచ్చని నీటి ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసి , మురికబడ్డ సాక్సులను నానబెట్టి, తర్వాత బ్రష్ చేసి ఉతికి మంచినీటిలో జాలించి తర్వాత ఎండలో ఆరబెట్టుకోవాలి.

English summary

Tips To Wash White Socks


 White socks are found in every wardrobe. The colour is too light and as socks are always exposed to dirt, it tends to get dirty very easily.
Story first published: Tuesday, January 7, 2014, 10:08 [IST]
Desktop Bottom Promotion