For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీపావళి తర్వాత ఇల్లు శుభ్రపరచడానికి సులభ చిట్కాలు...

|

దీపావళికి టపాసులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వులు, ఆటంబ్ బాంబులు, లక్ష్మీటపాసులు....ఇలా ఎవరికి నచ్చిన మందుగుండు సామాగ్రి వాళ్లు సంతోషంగా కాల్చుకునే ఉంటారు. కానీ వేడకలు పూర్తి అయిన తర్వాత ఇంటిని, ఇంటి పరిసరాల్ని ఒకసారి బాగా గమనించండి. మనం కాల్చిన మందుల వల్ల ఏర్పడే చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోయి చాలా ఇబ్బందికరంగా కనిపిస్తుంది. ఇక నేల మీద మనం పెట్టే దీపాల వల్ల నూనె మరకలు కూడా పడుతూ ఉంటాయి. వీటికి తోడు మందుల నుంచి వెలువడే పొగ, కాలుష్యం ఇల్లంతా వ్యాపించి ఉంటుంది. అందుకే దీపావళి తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవడం చాలా అవసరం.

సంప్రదాయబద్దంగా దీపావళి వేడుకలను జరుపుకోవాలని ఇంటిని వివిధ రకాల పూలతోనూ, ఆకులతోనూ తోరణాలు కట్టి అందంగా అలంకరిస్తాము. ప్రమిదల్లో దీపాలు వెలిగించి, సంతోషంగా టపాసులు కాలుస్తాం. అయితే ఇలా దీపావళి వేడుకలు ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రంగా ఉంచడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

Home Cleaning Tips After Diwali..: Inti Chitkalu in Telugu

కాల్చిన వెంటనే:
ఇంటిముందు టపాసులు కాల్చిన వెంటనే వ్యర్థాలను ఎక్కడికక్కడే పడేయకుండా అన్నీ ఒక మూలకు చేర్చాలి. లేదంటే నడిచేటప్పుడు కాలికి గుచ్చుకుని గాయమయ్యే అవకాశం ఉంటుంది. వీలైతే ఇసుక లేదా నీళ్లతో నిండిన బకెట్ లో వాటిని వేసినా మంచిదే. అలా చేడయం వల్ల మరుసటి రోజు ఇంటి ముందు శుభ్రం చేయడానికి చాలా సులభంగా ఉంటుంది.

Home Cleaning Tips After Diwali..: Inti Chitkalu in Telugu

వ్యర్థాలను తొలగించాలి:
దీపావళి మరుసటి రోజు ఇంటిని శుభ్రం చేయకూడదని కొందరు నమ్ముతారు. అయితే ఆ తర్వాతైనా ఇంటిని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ముందు ప్రమిదలు పక్కన పెట్టి, టపాసుల వ్యర్థాలు తొలగించాలి. తర్వాత ముంగిట వేసిన ముగ్గులు పూర్తిగా తొలగిపోయేలా కడిగేసుకోవాలి. వీలైనంత త్వరగా ఈ పనులు చేసుకోవాలి.

Home Cleaning Tips After Diwali..: Inti Chitkalu in Telugu

వాడిపోయిన వాటిని:
ఇంటి తోరణాలకు కట్టిన ఆకులు, పువ్వులను తొలగించేయాలి. లేదంటే అవి వాడిపోయి ఇంటి అందాన్నితగ్గించేస్తాయి. ఎలక్ట్రికల్ లైట్లు ఉన్నా పర్వాలేదు కానీ, కేవలం సహజసిద్దమైన ఆకులను, పువ్వులను వాడిపోక ముందే తొలగించేస్తే సరిపోతుంది.

మరకలు పోయేలా:
నేల మీద దీపాలు పెట్టినప్పుడు వాటి నుంచి నూనె కారడం వల్ల జిడ్డు మరకలు ఏర్పడుతాయి. వాటిని శుభ్రం చేసుకోకపోతే కాలుజారి పడే అవకాశం ఉంటుంది. అందుకే జిడ్డు పూర్తిగా వదిలిపోయేలా డిటర్జెంట్ తో కడిగేసుకోవాలి. లేదంటే డిటర్జెంట్ నీళ్లలో తడిపిన బట్టతో తుడిచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జిడ్డు మరకలు పోవడంతో పాటు నూనె వాసన కూడా తగ్గుతుంది.

Home Cleaning Tips After Diwali..: Inti Chitkalu in Telugu

టపాసుల వాసన పోయేలా:
టపాసులు కాల్చడం వల్ల పొగ ఇల్లంతా అలుముకుంటుంది. టేబుల్స్ మీద ఉండే టాప్స్, బెడ్ షీట్స్, కర్టెన్స్,...అన్నీ పొగనిండి ఉండటం వల్ల వాసన వస్తూనే ఉంటుంది. దాని వల్ల ఇల్లంతా శుభ్రంగా కనిపించినా తాజాదనం ఉండదు . దీపావళి మరుసటి రోజు ఇంట్లోని టేబుల్ టాప్స్, కర్టెన్స్, బెడ్ షీట్స్...అన్నీ మార్చేయాలి. వీలుంటే పైకి కనిపించే వస్తువులన్నీ ఒకసారి పైపైన తుడిచేస్తే సరిపోతుంది.

తాజాదనం కోసం: ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత తాజాదనం కోసం రూమ్ ఫ్రెషనర్ ని స్ప్రే చేయండి. అక్కడక్కడా పరిమళాలు వెదజల్లే పూలను వాజుల్లో అమర్చితే బాగుంటుంది. ఇప్పుడు ఇంటికి సాధారణ లుక్ వచ్చేస్తుంది. కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్లకు, ఇంటికొచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బందులుండవు.

English summary

Home Cleaning Tips After Diwali..: Inti Chitkalu in Telugu

Home Cleaning Tips After Diwali..: Inti Chitkalu in Telugu, Diwali the festival of lights and crackers is here. This festival starts with the day of "Dhanteras" followed by "Lakshmi Pooja" and will end with the start of the Hindu New Year "Padwa".
Desktop Bottom Promotion