గ్లాసుల మీద వాటర్ మార్క్స్ ను తొలగించడానికి సింపుల్ టిప్స్ ..!

Posted By: Staff
Subscribe to Boldsky

ప్పునీటిలో మినరల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇంట్లో ఉన్న గాజు అవ్స్తువుల మీద తెల్లని లేదా గోధుమన్ రంగు మచ్చలు ఏర్పడతాయి.ఈ మచ్చలని తొలగించడం చాలా కష్టం. అందువల్ల ఈ మరకలని తొలగించగలిగే చిట్కాలని తెలుసుకుంటే గ్లాస్ ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచవచ్చు.మీరు కనుక ఇప్పటికే అందుబాటులో ఉన్న చిట్కాలన్నింటినీ ఉపయోగించి బాత్రూములో అద్దం మీద, గ్లాస్ డోర్ల మీద, తలుపు, కిటికీల మీద ఈ మచ్చలని పోగోట్టాలని చూసి విఫలమయినట్లయితే కనుక క్రింద చిట్కాలు మీకు ఉపయోగకరం.ఇక ఆలశ్యమెందు, చదివి ఈ చిట్కాలు ప్రయత్నించండి మరి.

How To Remove Watermarks From Glass

1.నీటిలో నిమ్మరసం కలిపి ఉపయోగిస్తే గాజు మీద మరకలని సులభంగా తొలగించవచ్చు.నిమ్మరసం, వెనిగర్ని సమపాళ్ళల్లో తీసుకుని మరకల మీద రుద్ది మెత్తటి బట్టతో తుడవాలి.నిమ్మరసం, వెనిగర్లో ఉన్న ఆమ్లాలు మరకలని పోగొట్టడంలో సహాయపడతాయి.

How To Remove Watermarks From Glass

2.హానికరమైన పదార్ధాలు ఉపయోగించకుండా ఈ మరకలని పోగొట్టే ఇంకొక పద్ధతి బేకింగ్ సోదా మరియూ నీటి మిశ్రమం.ఒక గ్లాసు వెచ్చటి నీటిలో 30 గ్రాముల సోడా వేసి కలిపి ఈ పేస్టుని మరకల మీద వలయాకారంలో రుద్ది పావుగంట ఆగి మెత్తని బట్టతో తుడవాలి.

How To Remove Watermarks From Glass

3.ఫాస్పారిక్,హైడ్రోక్లోరిక్,సల్ఫ్యూరిక్ ఆమ్లాలున్న క్లీనింగ్ ఉత్పత్తులని ఉపయోగించి ఈ మరకలని పోగొట్టవచ్చు.ఈ ఆంలాలు చాలా శక్తివంతమైనవి అందువల్ల చేతికి రక్షణగా గ్లోవ్స్,ముఖానికి మాస్క్ మర్చిపోవద్దు.ఈ ఆమ్లాలు ఉన్న ఉత్పత్తులత్ని ఉప్పునీటి మరకల మీద ఉపయోగిస్తే ఫలితాలు చాలా బాగుంటాయి.

How To Remove Watermarks From Glass

4.మరకలని తీసేసాకా గ్లాస్ క్లీనర్తో శుభ్రపరచాలి.ఫలితాలు బాగుండాలంటే మెత్తని, పొట్టు రాలని బట్ట ఉపయోగించాలి.లైం అవే, బార్ కీపెర్స్‌తో కూడా ఈ మరకలని పోగొట్టవచ్చు.స్క్వీజీ అనే ఉత్పత్తి కూడా ఈ మరకలకి బాగా పనిచేస్తుంది.

How To Remove Watermarks From Glass

5.ఈ చిన్న చిన్న టిప్స్తో గ్లాస్ ఉత్పత్తులని శుభ్రంగా ఉంచుకోవచ్చు.గ్లాసు ఉత్పత్తులూ మరియూ కిటికీలు శుభ్రపరచడం గురించి మరింత సమాచారం కొరకు మా ఆర్టికిల్‌ని చూడండి.

How To Remove Watermarks From Glass

6.మా హోం క్లీనింగ్ క్యాటగిరీలో ఇలాంటి టిప్స్ బోలేడు ఉన్నాయి.

గ్లాసుని శుభ్రపరిచాకా రెయిన్-ఎక్స్ అనే ఉత్పత్తి ఉపయోగించి గ్లాస్ మీద నీరు చేరకుండా అరికట్టవచ్చు.బాత్రూముల్లో ఉన్న షవర్ డొర్లు ఉపయోగించిన ప్రతీసారీ శూభ్రంగా ఆరబెడితే నీరు చేరదు.అలాగే ఆమ్ల పదార్ధాలున్న ఉత్పత్తులని ఉపయోగించకపోవడం వల్ల కూడా గ్లాస్ దెబ్బ తినదు.

English summary

How To Remove Watermarks From Glass

Hard water is a type of water that is characterized by a high content of minerals that are responsible for leaving white or brown spots on many household glass surfaces. They're quite difficult to remove, so it's helpful to learn some useful tips to help eliminate them altogether and always keep glass surfaces clean.
Story first published: Monday, October 3, 2016, 20:15 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter