యాసిడ్ ను టాయిలెట్ క్లీనర్ గా ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలుగుతుంది..

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఒక వ్యక్తి ఇంటిలో అత్యంత మురికిగా ఉన్న ప్రదేశంగా భావించేది టాయిలెట్ మాత్రమే. ఈ ప్రదేశాన్ని అత్యంత హానికరమైన యాసిడ్ తో శుభ్ర పరిచేదిగా భావించబడుతుంది.

టాయిలెట్ ని శుభ్రపరచటం కోసం ఎక్కువ ప్రభావవంతమైన మరియు సంరక్షణ కలిగిన ఉత్పత్తులు వంటివి ఉన్నప్పటికీ, భారతదేశంలో యాసిడ్ ను చాలా సాధారణంగా, అనగా క్రిమిసంహారకంగా, మరకలను తీసివేసి - శుభ్రపరిచేదిగా, మరియు ఇది మార్కెట్లో సులభంగా, చౌకగా, అందుబాటులో దొరికేదిగా ఉంటుంది. దురదృష్టవశాత్తూ, ఈ యాసిడ్ ను టాయిలెట్ క్లీనర్ గా వాడటం వల్ల ఇది చాలా రకాల రోగాల ప్రభావానికి కారణమవుతుంది.

మీకు తప్పనిసరిగా తెలియాల్సిన టాయిలెట్ శుభ్రపరిచే మేటి చిట్కాలు

ఈ సర్వే ఏం చెప్తుంది ?

2000 మంది డాక్టర్లు మరియు కష్టమర్ల పైన నిర్వహించిన సర్వే ప్రకారం, వారి అభిప్రాయాలను సేకరించారు. ఇక్కడ వాటికి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఏం చెప్పాయంటే :

1. 91 శాతం ప్రజలు, యాసిడ్ ను టాయిలెట్ క్లీనర్ గా వాడటం వల్ల

1. 91 శాతం ప్రజలు, యాసిడ్ ను టాయిలెట్ క్లీనర్ గా వాడటం వల్ల

91 శాతం ప్రజలు, యాసిడ్ ను టాయిలెట్ క్లీనర్ గా వాడటం వల్ల శ్వాస అందకపోవడం, కళ్ళు చికాకు పుట్టడం, దగ్గు వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లుగా - డాక్టర్లు తెలిపారు.

2. శ్వాస సమస్యలు:

2. శ్వాస సమస్యలు:

51 శాతం జనాభా, టాయిలెట్ శుభ్రపరచడం కోసం యాసిడ్ని ఉపయోగించడం వల్ల శ్వాస సమస్యలను ఎదుర్కొంటున్నారని, నిపుణులు తెలుపుతున్నారు

3 . కళ్ళ చికాకు:

3 . కళ్ళ చికాకు:

31 శాతం మంది సల్ఫ్యూరిక్ యాసిడ్ని వాడటం వల్ల కళ్ళ చికాకులకు గురవుతున్నారని, తెలిపారు.

4 ర్మం మంటలు:

4 ర్మం మంటలు:

18 శాతం మంది వాళ్ల చర్మం మండినట్లుగా అనుభూతి చెందుతున్నారని, తెలుపుతున్నారు.

5.శరీరమంతా మండినట్లుగా :

5.శరీరమంతా మండినట్లుగా :

23 శాతం మంది వాళ్ళ శరీరమంతా మండినట్లుగా అనుభూతి చెందుతున్నారని, భావిస్తున్నారు.

6.

6.

8% మంది చాలా రకాల ప్రతికూల మరియు ప్రతిచర్యలను ఎదుర్కొంటున్నట్లుగా తెలిపారు.

7. టాయిలెట్ క్లీనర్ గా యాసిడ్స్ వాడటం వల్ల ఎందుకు ఆరోగ్యానికి హానికరం ?

7. టాయిలెట్ క్లీనర్ గా యాసిడ్స్ వాడటం వల్ల ఎందుకు ఆరోగ్యానికి హానికరం ?

సల్ఫ్యూరిక్ (H2SO4) యాసిడ్ని మనం చాలా సాధారణంగా వాడుతున్నాం. అది నీటితో జత కలవడం వల్ల వచ్చే పొగ చాలా విషపూరితమైనది. ఇంతేకాకుండా, సల్ఫ్యూరిక్ యాసిడ్ వల్ల ఉత్పన్నమయ్యే తీవ్రమైన పొగ, డీహైడ్రేషన్ను కలగజేసేదిగా మరియు మీ ఊపిరితిత్తులు, ముక్కు, గొంతు, శ్వాస నాళాల శ్లేష్మపొరను తినివేసే ఏజెంటుగా ఉంది.

8. ఈ యాసిడ్ని టాయిలెట్ క్లీనర్ గా ఉపయోగించడం వల్ల..

8. ఈ యాసిడ్ని టాయిలెట్ క్లీనర్ గా ఉపయోగించడం వల్ల..

ఈ యాసిడ్ని టాయిలెట్ క్లీనర్ గా ఉపయోగించడం వల్ల ఉత్పత్తి అయిన పొగ, ముక్కు మరియు శ్వాస తీసుకోవడంలో సమన్వయం జరిగి, వాటి మీద ఉన్న శ్లేష్మపు పొరకి నష్టాన్ని ఏర్పరుస్తుందని - డిఎన్ఏ (DNA) కి ఇచ్చిన ఒక ప్రకటనలో, లీలావతి హాస్పిటల్లో చెస్ట్ ఫిజీషియన్ గా పనిచేస్తున్న "డాక్టర్. జలీల్ పార్కర్" తెలిపారు.

9. ఊపిరితిత్తులకు భారీ నష్టం:

9. ఊపిరితిత్తులకు భారీ నష్టం:

గొంతు మరియు శ్వాసనాళం పై ఉన్న శ్లేష్మపు పొరలను నష్టపరిచేదిగా ఉండడమే కాకుండా, ఈ పొగను ఎక్కువగా పీల్చడంలో చికాకును, మంటను పుట్టించబడే ఒక రసాయనిక చర్యగా ఉంటుంది. ఇంకా అదనంగా చెప్పాలంటే, దీర్ఘకాలం ఈ పొగను పీల్చడం వల్ల ఎప్పటికీ సరిచేయ్యలేని ప్రక్రియలో ఊపిరితిత్తులకు భారీ నష్టానికి మరియు 'వాయు నిర్బంధ వ్యాధి' అని పిలవబడే శ్వాస సంబంధమైన ఇబ్బందికి దారితీస్తోంది.

10. దీనికి బదులుగా మీరు దేనిని ఉపయోగిస్తారు :

10. దీనికి బదులుగా మీరు దేనిని ఉపయోగిస్తారు :

టాయిలెట్ను శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా తయారు చేసిన ఇతర ఉత్పత్తులు చాలా ఉన్నాయి. తక్కువ మొత్తంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం (10%) ఉండి, వాటి పొగ యొక్క దుష్పలితాలు నుండి రక్షించే ఇతర ఏజెంట్లను ఈ ఉత్పత్తులలో కలిగి ఉంటాయి.

11. వెనీగర్, ఉప్పు:

11. వెనీగర్, ఉప్పు:

మీరు ఈ రసాయన ధార్మిక పదార్థాలను సవ్యంగా ఉపయోగించాలని కోరుకుంటే, తెలుపు వెనీగర్, ఉప్పు, బేకింగ్ సోడా, బోరాక్స్ పొడి మరియు సిట్రిక్ ఆమ్లం వంటి సేంద్రీయ ఉత్పత్తులను మీ టాయిలెట్ శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు.

12. యాసిడ్తో టాయిలెట్ను శుభ్రపరిచేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు :

12. యాసిడ్తో టాయిలెట్ను శుభ్రపరిచేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు :

మీ టాయిలెట్లో శుభ్రంగా ఉంచడం కోసం యాసిడ్ ను ఉపయోగించాలనుకుంటే ఇక్కడ సూచించిన కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి

13.

13.

చేతులకు తొడుగులు ధరించడం, కాళ్లకు చెప్పులు ధరించడం, ముఖానికి ముసుగును ధరించడం వల్ల శ్వాస తీసుకునేటప్పుడు ఆ దట్టమైన పొగను పీల్చకుండా మరియు మీ చర్మంతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండకుండా ఉంటుంది.

14. కంటి భద్రతకు:

14. కంటి భద్రతకు:

యాసిడ్ను ఉపయోగించేటప్పుడు మీ కంటి భద్రతకు కచ్చితంగా వేరే ఏదైనా సాధనాన్ని వాడవలసిన అవసరం చాలా ఉంది. యాసిడ్ మరియు దాని వల్ల ఉత్పన్నమయ్యే పొగ, మీ కంటి కణజాలాన్ని దెబ్బ తీసేదిగా ఉంటాయి. యాసిడ్ తో శుభ్రపరచే టాయిలెట్ అంతా కూడా సాధారణంగా చెప్పాలంటే, బురదమయంగా ఉంటుంది.

15. యాసిడ్ను కొద్దిగా పలుచని రూపంలో ఉపయోగించడానికి ప్రయత్నించండి.

15. యాసిడ్ను కొద్దిగా పలుచని రూపంలో ఉపయోగించడానికి ప్రయత్నించండి.

ఒకే చోట కేంద్రీకృతమైన యాసిడ్ను సులభంగా కనుగొనవచ్చు, కానీ పలుచని రూపంలో ఉన్నదైతే మీకు చాలా మంచిది. మీరు దీనిని ఒక మంచి షాపుల్లో కొనుగోలు చేస్తున్నారని నిర్ధారించుకోండి. అలాగే మీ స్వంతంగా యాసిడ్ ను పలుచగా చేయడానికి ప్రయత్నం చేయకండి. యాసిడ్కు నీరుని కలపటం వల్ల యాసిడ్ అనేది పైకి వెదజల్ల బడతుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Beware! Using acid as a toilet cleaner could kill you

    A toilet is widely regarded as the dirtiest place in a person’s house, which is why it is very often the one place that is cleaned with the most corrosive agent – acid. While there are more effect
    Story first published: Monday, September 11, 2017, 17:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more