తండ్రులు విశ్రాంతిని ఆనందిస్తుంటే, తల్లులు ఇంటిపనులు ఎక్కువ చేస్తున్నారు.

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

కొత్తగా జరిపిన అధ్యయనాల ప్రకారం ఇంటిపనులు మరియు పిల్లల సంరక్షణ అనేవి ఇంకా సమానంగా పంచుకోబడట్లేదని తేలింది. ఇందులో ముఖ్యాంశం ఇంకా తండ్రులు ఇంట్లో విశ్రాంతిగా ఆనందిస్తుంటే, తల్లులు ఇంటిపనులతో సతమతమవుతూనే ఉన్నారు.

మీ నాన్నకన్నా అమ్మ తక్కువ కష్టపడతారని మీకు కూడా అన్పిస్తుందా? లేదు, నిజానికి ఆమె ఎక్కువ కష్టపడుతుండవచ్చు. పరిశోధకుల ప్రకారం తండ్రులు విశ్రాంతిగా ఆనందిస్తుంటే, తల్లులు ఇంటిపనితో సతమవుతున్నారు.

Mothers do more household tasks

ప్రెగ్నన్సీ సమయంలో అస్సలు చేయకూడని కొన్ని ఇంటి పనులు!

జర్నల్ సెక్స్ రోల్స్ అనే దాంట్లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం మొదటి బిడ్డ పుట్టిన మూడు నెలల తర్వాత నుంచి, పనిలేని సెలవు రోజుల్లో, మగవారు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంటే, ఆడవారు ఇంటిపనులు, పిల్లల సంరక్షణ చేస్తున్నారు.

Mothers do more household tasks

ఇదివరకు అధ్యయనంలో కూడా ఎంత సంపాయించినా కానీ స్త్రీలు తమ భాగస్వాములకన్నా ఇంటి సంరక్షణ పనులు ఎక్కువ చేస్తారు.

ఒహియో రాష్ట్ర విశ్వవిద్యాలయంకి చెందిన అసోసియేట్ ఫ్రొఫెసర్, క్లైర్ కాంప్ డష్ మాట్లాడుతూ, “సమానంగా జీవిస్తున్న జంటలలో కూడా, అలా విశాల మనస్తత్వాలు కలిగి ఉంటారని ఊహించిన కుటుంబాలలో కూడా ఇంటిపనులు, పిల్లల సంరక్షణ విషయాలు సమానంగా పంచుకోబడట్లేదు’ అని అన్నారు. పరిశోధకులు నిర్వహించిన ఈ న్యూ పేరెంట్’స్ ప్రాజెక్టులో 52 జంటలు పాల్గొన్నారు.

Mothers do more household tasks

వారిలో స్త్రీలు తమ గర్భం ఆఖరి మూడు నెలలనుండి, బిడ్డపుట్టాక మూడు నెలల సమయం వరకు , ఆ తర్వాత భార్యాభర్తలు పనికి వెళ్ళేరోజు, సెలవురోజుల్లో వివిధ పనులకి కేటాయించిన తమ సమయాలను నమోదు చేయమని ఆ జంటలను కోరటం జరిగింది. బిడ్డ పుట్టాక సెలవురోజుల్లో కన్నా పనికి వెళ్ళినరోజుల్లో, ఈ పనులను పంచుకోవటం మరింత సమానంగా ఉన్నదని తేలింది. కానీ అప్పుడు కూడా స్త్రీలే కొంచెం ఎక్కువ పనిచేసారని ఫలితాలలో తేలింది.

మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఫాస్ట్ గా ఆలోచిస్తారా ?

కానీ మగవారు తమ భాగస్వాములు గర్భంతో ఉన్నప్పుడు, బిడ్డ పుట్టిన మూడునెలల వరకూ సమయంలో చేసిన సరదా పనులను ప్రస్తుత సెలవురోజుల్లో రెట్టింపు చేసారు. ఒక పరిశోధకుడి అభిప్రాయం ప్రకారం, “పనికి వెళ్ళని రోజుల్లో, తల్లిదండ్రులు తమ ఇంటిపనులను, పిల్లల సంరక్షణను మరింత సమానంగా పంచుకుంటున్నారు.”

Mothers do more household tasks

సెలవు రోజుల్లో మాత్రం, మగవారు 46% విశ్రాంతి తీసుకుంటుంటే వారి భాగస్వాములు పిల్లలని చూసుకుంటున్నారు. కానీ అదే సెలవు రోజుల్లో స్త్రీలు, తమ భర్తలు పిల్లలని చూసుకుంటున్న సమయంలో కేవలం 16% మాత్రమే సరదాగా వారికోసం వారు విశ్రాంతిగా గడుపుతున్నారు.

ఇంటి పనుల విషయంలో కూడా ఫలితాలు దాదాపుగా ఇలానే ఉన్నాయి. స్త్రీలు శుభ్రపర్చటం వంటి పనులు చేస్తున్నప్పుడు 35% తండ్రులు విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే మగవారు పనులు చేస్తున్నప్పుడు కేవలం 19% స్త్రీలే ఖాళీగా ఉన్నారు.

Mothers do more household tasks

పురుషులు కూడా పిల్లలను, ఇంటిని ముఖ్యంగా వారాంతంలో చూసుకోవాలి. కొన్ని కేసుల్లో, తల్లులు కొంచెం వెనకడుగు వేసి, తండ్రులు ఇంటిపని, పిల్లల సంరక్షణ చేయటానికి అవకాశం ఇవ్వాలి. అంతేకానీ సరిగ్గా చేయరేమోనన్న అనుమానపడకూడదు, వారిని ఆపకూడదని పరిశోధకులు తెలిపారు.

English summary

Mothers do more household tasks while fathers enjoy leisure time

Mothers do more household tasks while fathers enjoy leisure time
Subscribe Newsletter