For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  దిండ్లను (తలగడను) తాజాగా మరియు శుభ్రంగా ఉంచటం కోసం ఉపయోగపడే 5 చక్కని ఉపాయాలు !

  |

  ఆరోగ్య సమస్యలను నివారించడానికి మరియు మన చుట్టూ అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉండటం కోసం - మీ దిండ్లను కనీసం నెలలో ఒకసారైనా శుభ్రం చేయడం చాలా మంచిదని మేమిచ్చే సలహా !

  మీరు పరిశుభ్రమైన స్థితిలో ఉండాలని నిర్థారించుకోవాలనుకుంటే, ప్రత్యేకంగా పాటించవలసిన గృహవినియోగ అంశాలలో "దిండ్లు" అనేవి ఒకటి. మీరు రోజువారీ వినియోగం కోసం మనకు అనుకూలంగా వాటిని ఉంచాలనుకుంటే, దిండ్లలను ఎల్లప్పుడూ తాజాగా ఉంచడమనేది చాలా ముఖ్యం.

  దీని గురించి చాలా మంది ఎక్కువగా శ్రద్ధను తీసుకోరు. అయితే, దిండ్లు మాత్రం నిరంతరంగా మన శరీరం నుండి వచ్చే చెమటను మరియు గాలిలో ఎగిరే ధూళి కణాలను గ్రహిస్తాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే, వాటిపై పరుగులు మరియు బ్యాక్టీరియా చేరేందుకు చాలా అనువైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి.

  5 Fabulous Tricks for Keeping Pillows Fresh and Clean

  చాలామంది దిండ్లను పరిరక్షించే తొడుగులను దానిపైన కప్పి ఉంచుతారు. ఏదేమైనప్పటికీ కొన్ని అనివార్య పరిస్థితుల్లో, ఒక నిర్ణీతమైన సమయంలో దానిపైన నల్లటి మచ్చలను మరియు చెడువాసనలను వెదజల్లేదిగా ప్రారంభమైన నాటినుండి వాటిని బయటకు విసిరేసే సమయం వచ్చిందన్న ఆలోచనలను మనము కలిగి ఉంటాం.

  కానీ ఒక్కసారి ఆగింది ! మీరు అలాంటి నిర్ణయాన్ని తీసుకునే ముందు, వాటిపై క్రిమిసంహారక పద్ధతులను మరియు శుభ్రపరిచే ఇతర పద్ధతులను ప్రయత్నించడం గూర్చి ఆలోచనను చెయ్యండి. అలా దెబ్బతిన్న దిండ్లను తిరిగి మామూలు స్థితిలోకి తీసుకురావడానికి మీకు ఎక్కువ ఖర్చు కాకపోవచ్చు.

  ఇక్కడ, శుభ్రపరిచేందుకు అవసరమైన 5 మెళకువలను మీరు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజే వాటిని ప్రయత్నించి, కనీసం నెలలో ఒకసారైనా మీ దిండ్లు శుభ్రపరిచే అలవాటును చేసుకోండి.

  5 Fabulous Tricks for Keeping Pillows Fresh and Clean

  1. బేకింగ్ సోడా మరియు వెనిగర్ :

  బేకింగ్ సోడా మరియు తెల్లని వెనిగర్ మిశ్రమము అనేది 100% సహజసిద్ధమైనదిగా ఉంటూ, మీ దిండ్లు యొక్క బట్టను తెల్లగా, మృదువుగా చేస్తుంది.

  ఈ రెండు శక్తివంతమైన పదార్ధాలు, యాంటీ బాక్టీరియల్ మరియు తెల్లబడటం వంటి లక్షణాలను కలిగి ఉంటాయి, అందువల్ల ఇది మురికిని మరియు చెమటపు మరకలను తొలగించడానికి వీలును కల్పిస్తుంది.

  కావలసినవి :

  ½ కప్పు బేకింగ్ సోడా (80 గ్రా)

  ½ కప్పు వైట్ వెనిగర్ (125 మిలీ)

  తయారీ విధానం :

  మీ వాషింగ్ మెషీన్లో దిండ్లను ఉంచండి. అప్పుడు, బేకింగ్ సోడాను మరియు తెల్లని వెనిగర్ను అందులో వేసిన తర్వాత నీళ్లతో ఆ డ్రమ్మును పూర్తిగా నింపండి.

  అలా మీ వాషింగ్-మెషిన్ దాని యొక్క పూర్తి పనితనాన్ని చూపించాక, అందులో నుండి దిండును బయటకు తీసి, పొడిగా ఉంచేందుకు దానిని ఎండలో ఉంచండి.

  5 Fabulous Tricks for Keeping Pillows Fresh and Clean

  2. వేడినీళ్లు మరియు నిమ్మరసం :

  ఈ తాజా నిమ్మరసంలో ఉండే గుణాలు, అత్యంత ప్రభావవంతమైన బ్లీచింగ్ను మరియు క్రిమిసంహారక ఎజెంట్ గా ఉంటుందని చెప్పడంలో ఏ ఒక్కరికి సందేహం లేని, సహజసిద్ధమైన మనకు లభించే ఒక గొప్ప వరంగా చెప్పవచ్చు.

  మీరు వాడిన దిండ్ల యొక్క పరిస్థితిని మళ్ళీ యథాస్థానానికి పునరుద్ధరించడానికి సరిగ్గా సరిపోయే ఉత్తమమైన పదార్థాల్లో ఇది (నిమ్మరసం) ఒకటిగా ఉందని మనం ఆశ్చర్యపోనవసరం లేదు.

  కావలసినవి :

  6 నిమ్మకాయల రసం

  2-½ లీటర్ల నీరు (10 కప్పులు)

  తయారీ విధానం :

  నీళ్ళు బాగా వేడిగా అయ్యేలా మరగ కాయాలి. అలా మరిగిన తరువాత, అందులో 6 తాజా నిమ్మకాయల రసాన్ని కలపాలి.

  అప్పుడు అందులో జాగ్రత్తగా మీ దిండును ముంచివేయ్యాలి. అవసరమైతే, దిండు పూర్తిగా మునిగేంత వరకు ఎక్కువ నీరును పొయ్యాలి.

  అలా సుమారుగా 2 గంటల పాటు దానిని నానబెట్టాలి, ఆపై మీ సాధారణ డిటర్జంట్తో బాగా కడగాలి.

  5 Fabulous Tricks for Keeping Pillows Fresh and Clean

  3. బేకింగ్ సోడా మరియు 'టీ' చెట్టు యొక్క ఆకుల రసం :

  బేకింగ్ సోడా మరియు 'టీ' చెట్టు యొక్క ఆకుల రసంతో పాటు, కాస్త డ్రై-డిటర్జెంట్ పౌడర్ తో కలిగి ఉన్న ఈ మిశ్రమము, దిండ్లను పరిరక్షించడానికి చాలా గొప్ప సహయకారని ఉంటుందని చెప్పవచ్చు.

  ఈ మిశ్రమము మురికిగా ఉన్న పసుపు మచ్చలను వదిలించడంలో సహాయపడుతుంది. దానిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పురుగులను మరియు బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

  కావలసినవి :

  ½ కప్ బేకింగ్ సోడా (80 గ్రా)

  'టీ' చెట్టు యొక్క ఆకుల రసం 10 చుక్కలు

  తయారీ విధానం :

  మొదటగా, ఒక గిన్నెలోకి బేకింగ్ సోడాను తీసుకోవాలి. దానిని, 'టీ' చెట్టు యొక్క ఆకుల వల్ల వచ్చిన రసముతో బాగా కలపండి. ఒక మృదువైన పేస్ట్ లా వచ్చేవరకు మీరు దానిని బాగా కలపాలి. ఇలా తయారైన పదార్థాన్ని, దిండు మీద ఈ పేస్ట్ను అప్లై చేసి, 45 నిమిషాలు పాటూ అలానే నానిపోయేలా చెయ్యాలి. ఆ సమయం ముగిసిన తరువాత, ఒక బ్రష్ (లేదా) గుడ్డతో ఆ దిండును బాగా రుద్దాలి.

  5 Fabulous Tricks for Keeping Pillows Fresh and Clean

  4. డిటర్జెంట్ మరియు బోరాక్స్ :

  ఇటీవల కాలంలో, డిటర్జెంట్ మరియు బోరాక్స్ ట్రిక్ అనేది చాలా సమర్ధవంతమైనదిగా మారింది. ఆ తరువాత, ప్రపంచంలోని ఉన్న ప్రజలందరూ తమ దిండ్లకు ఉన్న దుమ్మును 100% వదిలించడమే కాకుండా, చాలా కొత్తదానిలా చూపించేలా చేసే దాని యొక్క సమర్థవంతమైన పనితీరును కలిగి ఉంటుంది.

  ఈ మిశ్రమం దిండ్లపై నెమ్మదిగా విస్తరించి ఉన్న చెమట బిందవుల సూక్ష్మ రూపాలను మరియు ఇతర దుమ్ము రేణువులను తొలగిస్తుంది. అందువలన, అది తొలగించటానికి వీలులేని / అసాధ్యమైన మరకలను సైతం తొలగిస్తుంది.

  అంతేకాదు, ఇంకా ఇందులో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల, పురుగులను మరియు ఇతర సూక్ష్మజీవులను చంపటంలో ఇది చురుకైన పాత్రను పోషిస్తుంది.

  కావలసినవి :

  1 కప్పు డిటర్జెంట్ (200 గ్రా)

  బయోడిగ్రేడబుల్ డిష్వాషర్ పౌడర్ యొక్క 1 కప్పు (250 మిలీ)

  1 కప్పు క్లోరిన్ రహిత బ్లీచ్ (250 మిలీ)

  ½ కప్పు బొరాక్స్ (80 గ్రా)

  వేడి నీరు (అవసరమైనంత)

  తయారీ విధానం :

  మొదట, ఈ పదార్ధాలతో సమ్మేళనం వల్ల కలిగే చర్యలను నివారించడానికి అవసరమైన జాగ్రత్తలను తీసుకోండి. లేదంటే, ఆ పదార్థాల యొక్క సమ్మేళనము విషపూరితంగా మారి, మీ చేతి మీద ఉన్న గాయాలకు మరియు కళ్ళకు హానికరంగా మారవచ్చు. కాబట్టి మీరు ఈ మిశ్రమాన్ని తయారుచేసేటప్పుడు మీ చేతికి గ్లోవ్స్ (తొడుగుల) ను మరియు ముఖానికి మాస్క్లను ధరించమని మేము సిఫార్సు చేస్తున్నాము.

  ఆ తరువాతి దశలో మీ దుస్తులను వాషింగ్ మెషీన్లో ఉంచి, దానితో పాటు ముందుగా తయారు చేసిన మిశ్రమాన్ని కూడా వెయ్యాలి.

  ఇప్పుడు, వాషింగ్ మెషీన్లో లోపల ఒకటి (లేదా) రెండు దిండ్లను ఉంచితే చాలు.

  అందులో కాస్త వేడి నీటిని జోడించి, వాషింగ్ మెషీన్ను స్టార్ట్ చెయ్యండి. అలా మీ వాషింగ్-మెషిన్ యొక్క పూర్తి పనితనాన్ని చూపించాక, అందులో నుండి దిండ్లనూ బయటకు తీసి, సూర్యుని కాంతి తగిలేలా దానిని ఎండలో ఉంచడం వల్ల పొడిగా మారడమే కాకుండా చెడు వాసనలను కూడా తీసివేస్తుందని నిర్ధారించుకోండి.

  5 Fabulous Tricks for Keeping Pillows Fresh and Clean

  5. హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు నిమ్మరసం :

  హైడ్రోజన్ పెరాక్సైడ్ను మరియు నిమ్మరసమును కలపడం ద్వారా, అద్భుతమైన క్రియాశీలక పదార్ధాలను కలిగి ఉన్న శక్తివంతమైన బ్లీచ్ ను మీ ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల పొందగలరు. ఈ పదార్ధము యొక్క తెల్లని నురగల వల్ల మీ తెల్ల దిండులపై మచ్చలను తొలగించి మరింత తెల్లగా చేస్తాయి.

  కావలసినవి :

  ½ కప్పు నిమ్మ రసం (125 మిలీ)

  1 కప్పు హైడ్రోజన్ పెరాక్సైడ్ (250 మిలీ)

  తయారీ విధానం :

  పూర్తిగా వేడి నీళ్లతో నిండి వున్న బకెట్లలో తయారు చేసిన మిశ్రమాన్ని కలిపి, మీ దిండ్లను ముంచి ఒక గంటపాటు నానబెట్టాలి.

  ఆ తర్వాత ఎప్పటిలానే మీ దిండ్లను వాషింగ్ మిషన్లో ఉంచి, శుభ్రపరచాలి. ఆపైన వాటిని సూర్యరశ్మికి ఉంచడం వల్ల పొడిగా మారడం జరుగుతుంది.

  మీ దిండ్ల మీద ఉన్న పసుపు, మరియు మురికి మరకలను చూసి వీటిని ఎలా తొలగించాలో అన్న ఆలోచనతో ఆశ్చర్యపోతున్నారా ? కానీ ఇది సులభం కాదు - మీ విలువైన దిండ్లను శుభ్రం చెయ్యడంలోనూ మరియు హానికరమైన సూక్ష్మజీవులు లేకుండా నివారించడానికి గానూ మేము ఇక్కడ వివరించిన ఉపాయాలలో ఏదో ఒకదానిని ఎంచుకొని, ఆ పద్ధతిని అమలు చేయడానికి ప్రయత్నించండి.

  English summary

  5 Fabulous Tricks for Keeping Pillows Fresh and Clean

  To avoid health problems and, what's more, to maintain them in the best conditions, our advice is to clean your pillows at least once a monthPillows are one of those household items that need special maintenance if you want to make sure they stay in a hygienic state. Keeping pillows fresh is important if you need them to be suitable for everyday use.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more