ఇంట్లోని బంగారాన్ని అమ్మడం అశుభమని వాస్తుశాస్త్రం వివరించే ఆరు కారణాలు.

Subscribe to Boldsky

భారతీయులు నగదు తరువాత బంగారాన్ని మాత్రానే విలువైనదిగా పరిగణిస్తారు. బంగారం ఒక మూలకం. ఇదో విలువైన లోహం. అలంకారాలకు, నగలకు విరివిగా వాడుతారు. ఆయుర్వేద వైద్యంలోనూ దీనికి విశేష ప్రాధాన్యత ఉంది. బంగారం ఒక రసాయనిక మూలకం. ఇది ఆవర్తన పట్టికలో 11 వ సమూహానికి చెందింది.

పూర్వ కాలంలో దీన్ని ద్రవ్యంగా వాడేవారు. ఇక బంగారం వినియోగంలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉంది. ఆభరణాలంటే భారతీయులకు మక్కువ. దీన్ని నగదుకు ప్రత్యామ్నాయంగా కొన్ని సందర్భాల్లో పరిగణిస్తారు. అంతేకాదు బంగారు ఆభరణాలను ధరించడం హోదాకు చిహ్నంగా భావిస్తారు.

వాస్తు ప్రకారం బంగారాన్ని సొంతం చేసుకుంటే, వ్యక్తిత్వంపై విశ్వాసం పెరుగుతుంది.మనం ఎప్పుడు పడితే అప్పుడు బంగారాన్ని అమ్మరాదని వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. దీనికి గల కారణాలు ఈ విధంగా వివరింపబడ్డాయి.

బంగారం రాచరిక చిహ్నం:

బంగారం రాచరిక చిహ్నం:

అనాదిగా బంగారానికి రాజరిక వ్యవస్థకి అవినాభావ సంబంధం ఉంది. వాస్తు శాస్త్ర ప్రకారం బంగారం మన వ్యక్తిత్వానికి ఆత్మవిశ్వాసాన్ని జోడిస్తుంది.

బంగారం స్వచ్చమైన లోహం :

బంగారం స్వచ్చమైన లోహం :

ఇండ్లకు శంఖుస్థాపన చేసే సమయంలో స్వచ్చ ధాతువులైన బంగారం మరియు ఇతర లోహాలను వాడతారు. బంగారం ప్రతికూలతలను పారద్రోలుతుంది.

వాస్తుదోష నివారణకు బంగారం సహాయపడుతుంది:

వాస్తుదోష నివారణకు బంగారం సహాయపడుతుంది:

బంగారం బహు శక్తిమంతమైన లోహం. స్వల్ప వాస్తుదోషం ఉన్న ప్రదేశాలలో దోష నివారణకు బంగారాన్ని ఉపయోగిస్తారు.

అతీంద్రియ దైవిక శక్తులను ఆకర్షిస్తుంది:

అతీంద్రియ దైవిక శక్తులను ఆకర్షిస్తుంది:

మనకు అత్యవసరంగా నగదు అవసరమైనప్పుడు మనం బంగారం అమ్మాలనుకుంటాం, కాని అటువంటి సమయంలో దైవిక శక్తులను ఆకర్షించడంలో బంగారం తోడ్పడుతుంది.

ఆర్ధిక నష్టాలను కలుగ చేస్తుంది:

ఆర్ధిక నష్టాలను కలుగ చేస్తుంది:

మన అవసరాన్ని ఆసరాగా చేసుకుని, బంగారం అమ్మేటప్పుడు తరుగు, రామి , తయారి చార్జీలు మొదలైన పేర్లతో మనకు రావలసిన సొమ్మును వ్యాపారస్తులు కాజేస్తారు. కనుక బంగారం అమ్మేటప్పుడు ఇటువంటి నష్టాలకు ముందుగానే మనం సిద్దపడి ఉండాలి.

బంగారం మన ఆశలను చిగురింపచేస్తుంది:

బంగారం మన ఆశలను చిగురింపచేస్తుంది:

బంగారం మనలో నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలుగజేసి మనపై మనకు నమ్మకాన్ని చిగురింపచేస్తుంది. బంగారాన్ని నష్టపోవడమంటే మనపై మనం నమ్మకాన్ని కోల్పోవడమే.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    6 reasons Vaastu Says selling Gold brings bad luck

    We all know that whenever gold is sold, it leads to financial loss as making charges etc are deducted. So each time you sell a gold ornament be ready to pay the cost.
    Story first published: Wednesday, March 7, 2018, 17:05 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more