For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఇంటిని బోరాక్స్తో శుభ్రపరుచుకోండి !

|

మీ దగ్గర్లో ఉన్న సూపర్ మార్కెట్కి మీరు వెళ్ళిన ఒక అందమైన రోజున గూర్చి ఆలోచించండి. మీరు తప్పక కొనుగోలు చేయవలసిన వస్తువుల జాబితాను కలిగి ఉన్నారు, అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి :

a. "ఫినాల్/ఫెనీల్"; మీ ఇంటిని చక్కగా శుభ్రంగా ఉంచడానికి !

b. 'హిట్', మీ ఇంటి చీకటి మూలలో దాక్కుని ఉన్న ఎలుకలను మరియు తెగుళ్లను చంపడం కోసం !

c. మీ ఇంట్లో ఉన్న అన్ని రకాల శిలీంధ్ర (ఫంగస్) లను తొలగించటానికి ఒక ఫంగిసైడ్ (శిలీంద్ర సంహారిణి) !

మీరు సూపర్ మార్కెట్కి చేరుకుని ఈ కొత్త ఉత్పత్తులన్నింటినీ మీరు చూసినప్పుడు, వాటిలో 100% ఖచ్చితమైన ఫలితాలను పొందగలరని హామీ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. కాబట్టి మీరు ఈ మూడు రకాల ఇంటి పనుల కోసం, ఈ మూడు వేర్వేరు ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు.

పైన చెప్పిన ప్రొడక్ట్స్ ను మీరు కలిగి ఉన్నారు కాబట్టి మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, అయితే ఇన్ని రకాల ఇంటి పనుల కోసం రక రకాల ఉత్పత్తులు అవసరం లేదు.

మీ ఆనందానికి ఆటంకం కలిగించినందుకు మమ్మల్ని క్షమించండి, కానీ మేము మీకు మరికొంత జ్ఞానాన్ని అందించటం వల్ల, మీరు అదనంగా ఖర్చు పెట్టే డబ్బు మొత్తాన్ని పొదుపు చేసి, ఒక చిన్న కిడ్డీ పార్టీని నిర్వహించుకోవచ్చు.

ఈ విభిన్నమైన ఇంటి పనులకు మీకు అవసరమయ్యేది కేవలం బోరాక్స్ మాత్రమే !


బోరాక్స్ అంటే ఏమిటి?

సోడియం బోరేట్, సోడియం టేట్రాబోరేట్ (లేదా) డిస్డియమ్ టేట్రాబోరేట్ అని కూడా పిలవబడే బోరాక్స్, సహజంగా లభించే ఖనిజము మరియు ముఖ్యమైన బోరాన్ కాంపౌండ్స్లో ఇది ఒకటి. బోరాక్స్ రసాయన సూత్రం Na2B4O7 • 10H2O. ఇది డిటర్జెంట్లు, కాస్మిటిక్స్ వంటి వాటిలో ఉపయోగించబడుతుంది మరియు దాని ఇతర లక్షణాల ఆధారంగా క్రిమిసంహారకముగా మరియు ఫంగస్ను నివారించే దానిలా పనిచేస్తుంది.

ఇంటిని శుభ్రం చేయడానికి బోరాక్స్ ఎలా సహాయపడుతుంది ?

1) పెస్ట్ కంట్రోల్:

మన ఇళ్లలో ఆశ్రయం పొందే అత్యంత క్రూరమైన కీటకాలలో తెగుళ్ళు ఒకటి. మనము వివిధ రకాల కీటకాలను వదిలించుకోవడానికి, మీరు సంవత్సరానికి కనీసం రెండుసార్లు పెస్ట్ కంట్రోల్ కోసం కొన్ని బక్స్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. అయినప్పటికీ, బోరాక్స్ ఒక క్రిమిసంహారిణిగానూ మరియు పురుగులను నశింపచేసే మందుగానూ పని చేస్తుంది, కాబట్టి ఇది మీ ఇళ్లలో చొరబడే ఈ తెగుళ్ళను తొలగిస్తుంది.

ఇది బొద్దింకలను మరియు చీమలను దూరంగా ఉంచుతుంది, ఎలుకలను ఇంటికి దూరంగా ఉంచుతుంది, మరియు మన దుప్పట్లు మీద ఈ బోరాక్స్ పొడిని చల్లుతూ ఉంటే, నల్లులను మీరు దూరంగా ఉంచుతుంది. దాదాపు అన్ని రకాల తెగుళ్లను దూరంగా ఉంచడానికి బోరాక్స్ అనేది ఒక మంచి పరిష్కారం.


2) శుభ్రపరచడానికి :

బోరాక్స్ చాలా డిటర్జెంట్లలో ఉపయోగించే ఒక రసాయనిక సమ్మేళనం, ఇది చాలా సులువుగా మచ్చలను తొలగిస్తుంది. అందువల్ల, బోరాక్స్ను నేరుగా (నీటితో కలిపి) బట్టలు, దుప్పట్లు, కుండలు, గిన్నెలను మరియు దాదాపు ఏదైనా వస్తువుల పై ఉన్న మురికి మరకలను తొలగించడానికి ఉపయోగించవచ్చు. ఇది డిటర్జెంట్ జోడించబడి ఉన్నందున భర్తలను శుభ్రపరచడంలో దాని యొక్క పనితనాన్ని మనము ముందుగానే అనుభూతిని చెందాము.

మీరు మీ ఫ్లోర్ను శుభ్రం చేయడానికి కూడా బోరాక్స్ను ఉపయోగించవచ్చు మరియు ఇది తుప్పును నివారించడం (నిమ్మ రసంతో కలుపుతారు) లో కూడా సహాయపడుతుంది. అందువలన, బోరాక్స్ అన్ని-ప్రయోజనాలను కలిగిన క్లీనర్గా వ్యవహరిస్తుంది, అలాగే కొన్ని ఖరీదైన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు వినియోగించే డబ్బును ఆదా చేయడంలో మనకు సహాయపడుతుంది.

3) ఫంగస్ (శిలీంద్ర) నివారిణిగా :

ముందు చెప్పినట్లుగా బోరాక్స్ అనేది, ఫంగస్ (శిలీంద్ర) నివారిణి, ఇది ఆకుపచ్చని బూజును చంపి, దాని పెరుగుదలను అడ్డుకుంటుంది. ఫంగస్ ఇన్ఫెక్షన్ను ఎదుర్కొంటున్న వారికి, ఈ బోరాక్స్ పౌడర్ను వాడమని వైద్యులు కూడా సాధారణంగా సిఫార్సు చేస్తారు. మన శరీరంలోని ఫంగస్ను వదిలించడానికి ఇది బాగా సహాయపడుతుంది.

అంతేకాక, దీనిని వాడటం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు, ఎందుకంటే అందులో ఎలాంటి హానికర రసాయనాలు కలవలేదు. ఇది బాక్టీరియాలను మరియు సూక్ష్మ జీవులను చంపే ఒక క్రిమిసంహారకారి కూడా. అందువలన, అత్యంత హానికరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ను ఎదుర్కోవడం కోసం ఈ బోరాక్స్ను సిఫారసు చేయబడుతుంది, (లేదా) సాధారణంగా ఇది మన ఇళ్లలో ఉన్న ఫంగస్ యొక్క పెరుగుదలను అడ్డుకుంటుంది.

4) ఇతర ఉపయోగాలు:

ఇది స్మెల్లీ బ్యాక్టీరియాను చంపి, దానినుంచి వ్యాపించే చెడు వాసనను తగ్గించే డీయోడైజర్గా పనిచేస్తుంది. కాబట్టి, మీరు మీ గదిని, ఫ్రిజ్ను, బాత్రూమ్ను మొదలైనవాటిలో చెడు వాసనను దూరం చేసుకోవడానికి ఈ బోరాక్స్ను ఉపయోగించడం మంచిది. ఇది అనవసరమైన పరాన్నజీవులు, క్రీపర్లను మరియు అక్కడక్కడ పెరిగే కలుపులను కూడా చంపుతుంది, ఇది నీటిని మృదువుగా చేస్తుంది మరియు అనేక దేశాలలో ఆహారాన్ని నిల్వ చేయడానికి దీనినే ఉపయోగిస్తారు.

బోరాక్స్ అనేది విషపదార్థమా ?

మనము ఉపయోగించే అనేక ఇతర రసాయనాలతో పోలిస్తే, బోరాక్స్ అనేది విషపూరితం కానే కాదు. బోరాక్స్ను ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వ్యాప్తి చెందుతుందన్న కథనాలు పూర్తిగా సత్యాలు.

అయినప్పటికీ, బోరాక్స్లో ముఖ్యంగా బోరాక్స్ను పౌడర్ను పిల్లలకు (లేదా) పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి, ఎందుకంటే వారు దానిని తినవచ్చు. అలా తినడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలకు గురికావచ్చు, ఎందుకంటే బోరాక్స్ యొక్క pH స్థాయి 9, కాబట్టి ఇది అత్యంత ఆల్కలీన్గా తయారవుతుంది.

కాబట్టి, బోరాక్స్ను అన్ని రకాల ఇంటి పనులను నిర్వహించడానికి ఉపయోగించే ఒక ముఖ్యమైన ఖనిజము వంటిదని తెలుస్తోంది. అంతేకాకుండా, బోరాక్స్ అనేది ఖరీదైనది కూడా కాదు మరియు ఇది అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది, కాబట్టి ఇది అందరి ఇళ్లల్లో ఉండే అతి ముఖ్యమైన ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలచి ఉంది.

English summary

Cleaning your house with Borax.

Did you know borax is an all-in-one cleaning agent for your home? It can effectively help keep your house neat and clean, kill rodents and pests that hide in the shadows of your house and act as a brilliant fungicide to help eradicate any kind of a fungus in your house. Why reach to different products when the work can be done by one effective solution?
Story first published: Thursday, February 22, 2018, 11:30 [IST]
Desktop Bottom Promotion