Just In
- 24 min ago
Couples Yoga: ఈ యోగాసనాలు చేస్తే బెడ్రూంలో గుర్రాలవుతారు
- 2 hrs ago
Amazon Sale: డ్రై, వెట్ వాక్యూమ్ క్లీనర్స్ పై భారీ ఆఫర్లు
- 6 hrs ago
Today Rasi Palan: ఈ రోజు ఈ రాశుల వారు అధిక కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది...
- 11 hrs ago
మీరు ఆరోగ్యకరమైనవి అనుకునే ఈ ఆహారాలు మీ హార్మోన్ల అసమతుల్యతను పెంచుతాయి...!
Don't Miss
- Finance
GST On Rentals: అద్దెపై 18 శాతం GST.. జూలై 18 నుంచి అమలులోకి.. ఎవరికి వర్తిస్తుందంటే..
- Movies
Sita Ramam 1st Week Collections: 17 కోట్ల బిజినెస్.. వారంలో ఊహించని విధంగా.. లాభం ఎన్ని కోట్లంటే!
- News
బందరులో మేరీమాత విగ్రహం ధ్వంసం-ఎస్పీ ఆఫీసు పక్కనే అర్ధరాత్రి ఘటన
- Technology
ఐఫోన్‌లోని సిరి వాయిస్‌తో విసుగు చెందారా? అయితే ఇలా మార్చేయండి ....
- Automobiles
కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. జీరో నుండి హీరోగా మారిన ఎస్యూవీ..
- Sports
IRE vs AFG: మళ్లీ షాకిచ్చిన ఐర్లాండ్.. రెండో టీ20లోనూ అఫ్గాన్ చిత్తు!
- Travel
మరో ప్రపంచపు అంచులకు చేర్చే.. కుద్రేముఖ్ పర్వత శిఖరాలు!
మీ బట్టలపై ఉన్న డియోడ్రెంట్ మరకలను తొలగించుకోవటం ఎలా ?
మీరు ఇంటిని వదిలి బయటకు వెళ్ళే ముందు మీరు చివరిగా చేసే పని ఏమిటంటే, డియోడ్రెంట్ను ఉపయోగించటం. మీరు బయటకు వెళ్లే ఆతృతలో ఉన్నప్పుడు, మీ బట్టల మీద డియోడ్రెంట్ను వాడటం వల్ల కలిగిన మరకల గూర్చి మరచిపోతారు. అలా వ్యాపించిన మరకలకు కారణం డియోడ్రెంట్ను మితిమీరి ఉపయోగించటం వల్లే అనేది ఒక అధ్యయనంలో కనుగొనబడింది.
ఈ డియోడ్రెంట్ మరకలను ఎలా పోగొట్టుకోవాలో అని ఆలోచిస్తున్నారా ? చింతించకండి, మీరు బట్టలు వేసుకొనే ముందు డియోడ్రెంట్ను బట్టలపై అప్లై చేయండి, 2 నిమిషాల పాటు పొడిగా అయ్యేలా ఆరాబెట్టిన తర్వాత ఆ బట్టలను మీరు ధరించండి. ఈ చిన్న ట్రిక్ను పాటించడం వల్ల మీ బట్టలపై కొద్దిగా మరకలను కలిగి ఉండటం గానీ (లేదా) పూర్తిగా మరకలనేవి ఉండకపోవచ్చు.
మీరు ఉన్ని బట్టలు (లేదా) పట్టుబట్టల పై ఈ డియోడ్రెంట్ను ఉపయోగించినట్లయితే, వాటిపై ఉన్న రంగులు పాలిపోవడానికి కారణమవుతుంది.
ఈ డియోడరెంట్ యొక్క మరకలు మీ బట్టలపై మందమైన పొరను ఏర్పరచిన కారణంగా దానిని తొలగించడం చాలా కష్టతరమవుతుంది.
మిమ్మల్ని అతిగా బాధించే డియోడరెంట్ యొక్క మరకలను త్వరగా వదిలించుకోవడానికి మరియు మీ బట్టలను మరింతగా తాజాగా ఉంచటానికి పాటించవలసిన సులభమైన పద్ధతిలో గూర్చి ఇక్కడ వివరించబడినది. అవి,

1. మద్యం (ఆల్కహాల్) :
ఆల్కహాల్ను వివిధ రకాల మరకలను తొలగించడానికి ఉపయోగిస్తారు. ద్వారకలో ఉన్న ప్రదేశంలో కొద్ది మొత్తంలో ఈ ఆల్కహాల్ వేసి, స్క్రబ్తో నెమ్మదిగా రుద్దండి. ఇలా చేయడం వల్ల
డియోడ్రెంట్ వల్ల ఏర్పడిన మరకలను త్వరగా పోగొడుతుంది. ఒకవేళ బట్టలపై మొండి మరకలు గానీ ఉన్నట్లయితే, ఆ బట్టలను ఆల్కహాల్లో కొద్దిసేపు నానబెట్టిన తర్వాత బాగా స్ర్కబ్తో శుభ్రం చేయండి.

2. వెనిగర్ :
ఇది మ్యాజిక్ చెయ్యగల అద్భుతమైన పానీయం.
వెనిగర్ను మరియు గోరువెచ్చని సమాన మోతాదులో తీసుకొని వాటిని బాగా కలిపి, మరకలను కలిగి ఉన్న ప్రాంతంలో దీనిని ఉపయోగించండి. మెరుగైన ఫలితాల కోసం మీ బట్టలను ఈ మిశ్రమంలో పూర్తిగా కొన్ని గంటల పాటు నానబెట్టండి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయడం వల్ల దానిపై ఉన్న మరకలను పూర్తిగా పోగొట్టుకోగలరు.

3. పాంథియోస్ :
వినడానికి చాలా వింతగా ఉంది కదా ! కానీ ఇది నిజం. పాంథియోస్ మీ బట్టలు నుండి మరకలను తొలగించడానికి సహాయపడుతుంది. మరకలు ఉన్న ప్రాంతం చుట్టూ నెమ్మదిగా రుద్దుతూ వుండటం వల్ల ఆ మరకలు పూర్తిగా అదృశ్యమవుతారు. ఫ్యాబ్రిక్తో కూడిన ఈ పాంథియోస్ను మరకలను పోగొట్టడానికి మీ బట్టలకు వ్యతిరేకంగా ఉపయోగించటం వల్ల, మీరు మంచి ఫలితాలను త్వరగా పొందగలరు.

4. బేకింగ్-సోడా మరియు నీరు :
ఇది మన బామ్మల కాలంనాటి పాత చిట్కా ! నీ బట్టలపై చంకల భాగంలో కఠినంగా ఉన్న మరకలను వదిలించడానికి బేకింగ్-సోడా మరియు నీటిని కలపగా వచ్చిన మెత్తని పేస్ట్ను ఉపయోగించాలి. మరకలు ఉన్న ప్రాంతంపై ఈ పేస్ట్ను అప్లై చేసి, చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. ఈ విధమైన పద్ధతిలో బట్టలపై ఉన్న మరకలను సులభంగా తొలగించుకోవచ్చు.

5. ఆస్ప్రిన్ మాత్ర :
ఈ చిట్కా కేవలం మీ తెల్లబట్టల కోసం మాత్రమే! కొంచెం నీటిలో 2 ఆస్పిరిన్ మాత్రలను కరిగించండి. బట్టల పై ఉన్న మరకల మీద ఈ మిశ్రమాన్ని పోసి, 2 గంటలపాటు అలానే నానబెట్టాలి. ఒక డిటర్జెంట్తో బాగా కడిగిన తరువాత నీటితో కూడా శుభ్రంగా కడగాలి.

6. బోరాక్స్ పౌడర్ :
మీ బట్టలను ఉతికే సాధారణ రీతిలోనే బొరాక్స్ పేస్ట్ను (లేదా) పౌడర్ను కూడా ఉపయోగించండి. ఇది మీ చంకల భాగంలో సాధారణంగా చోటుచేసుకునే మరకలను తొలగించడానికి ఈ పద్ధతిని అప్లయ్ చేసుకోవచ్చు.