For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టూత్ పేస్టుతో మీరు ఈ ట్రిక్కులను ఉపయోగించి మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి !

|

ప్రతీ మహిళ తన ఇంటిని ఒక దేవాలయంగా భావిస్తుంది, అలా ఆమె తన ఇంటిలోని ప్రతీమూలను పరిశుభ్రంగా ఉంచుకునే పనిలో ఆమె ఎల్లప్పుడూ నిమగ్నమై ఉంటుంది.

మీ ఇంటి చుట్టూ ఉన్న మరకలు మిమ్మల్ని మరింతగా ఇబ్బందిపెడుతున్నాయా ? గోడమీద చాక్పీస్తో రాసిన మరకలు, మీకు ఇష్టమైన తెల్లని టీషర్టు పై ఉన్న లిప్స్టిక్ మరకలు, మీ అందమైన సెంటర్ టేబుల్ మీద ఉన్న కాఫీ మరకలు (లేదా) కెట్చప్ మరకలు వంటి ఇతరములు మీకు రాత్రిళ్లు నిద్రలేకుండా చేస్తాయి.

మీ ఇంటిని మరకలు లేకుండా, పరిశుభ్రంగా ఉంచేందుకు మిమ్మల్ని అనిత్యము వెంటాడే సమస్యల గురించి మాకు పూర్తిగా తెలుసు. మీ ఇంటిని పరిశుభ్రం చేయడంలో మీకు సహాయపడే సులభమైన విధానాల గురించి మేము ఇక్కడ మీకు తెలియ చేయబోతున్నాము.

మీ ఇల్లు అపరిశుభ్రంగా ఉండటానికి కారణమైన మరకలను తొలగించడానికి, టూత్పేస్ట్ అనే ఒకే ఒక్క ఆయుధంతో తిరిగి మీ ఇంటిని పరిశుభ్రపరుచుకోవచ్చు. టూత్పేస్ట్ అనేది ప్రతి ఇంట్లోనూ అందుబాటులో ఉంటుంది.

ఈ టూత్పేస్ట్ మీ పళ్ళను తెల్లగా చేయడమే కాకుండా, అనేక ఇతర సందర్భాల్లోనూ ఉపయోగపడుతుంది. వాస్తవానికి ఈ టూత్పేస్టును, వంటగది నుంచి లివింగ్ రూమ్ వరకు గల ఇంట్లోని ప్రతి భాగానికి ఉపయోగించవచ్చు, ఆశ్చర్యపోతున్నారు కదా మీరు ?

ఈ టూత్పేస్ట్లో బేకింగ్ సోడా అనే మూలపదార్థం ఉన్నందువల్ల, ఇది వస్తువులను ఏ విధంగా నష్టపరచుకుండా వాటిపై గల దుమ్మూ, ధూళీ, మచ్చలను తొలగించి, శుభ్రం చేసే లక్షణాలను కేవలం తేలికపాటి రాపిడితోనే కలిగి ఉంటుంది.

కొన్ని అత్యవసర పరిస్థితులలో మరకలను తొలగించడానికి, మీరు రెగ్యులర్గా వైట్ టూత్పేస్ట్ను ఉపయోగిస్తారు. వంటగదిని శుభ్రం చేయటానికి మీ స్నేహితుల్లో కొందరు టూత్పేస్ట్ ఉపయోగించడాన్ని మీరు చూసే ఉంటారు.

ఈరోజు ఈ వ్యాసం ద్వారా, మీ బోల్ట్-స్కై టూత్పేస్ట్ వల్ల కలిగే ఇతర ఉపయోగాల జాబితాను మీ ముందుకు తీసుకువచ్చింది. అవేమిటో తెలుసుకుంటే, మీరు కూడా వెంటనే వాటిని ప్రయత్నించాలనుకుంటారు.

టూత్పేస్టు వల్ల కలిగే మరికొన్ని ఉపయోగాలన్నీ కూడా, రోజులో మీరు శుభ్రపరిచేందుకు వినియోగించే మీ శారీరక శక్తిని తక్కువ చేస్తుంది.

1. మీ వైట్ టీషర్ట్ మీద మరకలను తొలగిస్తుంది :

1. మీ వైట్ టీషర్ట్ మీద మరకలను తొలగిస్తుంది :

లిప్స్టిక్, ఇంకు మరకలు వంటివి తరచుగా మీ వైట్ షర్ట్ను బాధిస్తున్నాయి. బీరువాలో అట్టడుగున దాచబడిన మీ తెల్లని బట్టలపై ఉన్న మరకలను నివారించడంలో టూత్పేస్టు బాగా ఉపయోగపడుతుంది. లిప్స్టిక్, ఇంకు మరకలను కలిగిన ప్రదేశాలలో తగినంత టూత్ పేస్ట్ను అప్లై చేసి, నమ్మదుగా రుద్దుతూ వాష్ చేయండి. ఇలా తెల్లని వస్త్రాలపై ఉన్న మరకలు పూర్తిగా పోయే వరకు ఇదే పద్ధతిని రిపీట్ చేయండి.

2. కీటకాల కాటు నుంచి ఉపశమనం పొందండి :

2. కీటకాల కాటు నుంచి ఉపశమనం పొందండి :

కీటకాల సంఖ్య పెరిగే సీజన్లో మనము ఉన్నాము. అలాంటి కీటకాలు మనల్ని కాటు వేసిన సమయంలో మన శరీరము దురద సంచలనాన్ని కలిగి చర్మం విసుగు చెందేలా చేస్తోంది. కాబట్టి మీరు ఇలాంటి సమస్యల నుంచి బయటపడటం కోసం పురుగులు కాటు వేసిన చోట కొద్దిగా టూత్ పేస్ట్ను అప్లై చేయండి. ఇది వెంటనే మీకు ఉపశమనాన్ని కలిగించడమే కాక, మీ చర్మం ఎరుపెక్కడాన్ని కూడా తగ్గిస్తుంది.

3. మీ ఫోన్ స్క్రీన్ పై గీతలను నివారిస్తుంది :

3. మీ ఫోన్ స్క్రీన్ పై గీతలను నివారిస్తుంది :

మనం వాడే ఫోన్లు మన జీవితంలో ఒక భాగమయిపోయాయి. ఫోన్లను మీరు నిరంతరంగా ఉపయోగించిన కారణంగా మీ ఫోన్ను స్క్రీన్ పై గీతలు ఏర్పడవచ్చు. ఇది మీ ఫోన్ డిస్ప్లేను కనబడనియ్యకుండా చేయవచ్చు. అలా మీ ఫోన్ స్క్రీన్ పై ఏర్పడిన పగుళ్లను పూర్తిగా మరమ్మత్తులు చేయలేకపోయినా వాటిని కచ్చితంగా తక్కువ చేయవచ్చు. ఫోన్ స్క్రీన్ పగుళ్లపై టూత్ పేస్ట్ను కొద్ది మొత్తంలో అప్లై చేసి నెమ్మదగ్గ రుద్దడం వల్ల ఫోన్ డిస్ప్లే పై ఉన్న గీతలు నెమ్మదిగా తాగ్గుతాయి. మెత్తని బట్టతో ఫోన్ స్క్రీన్ను శుభ్రపరుచుకోండి. ఇలా చేయడంవల్ల మీ ఫోను పై అందవికారంగా ఉన్న గీతలు చాలామటుకు తగ్గినట్లుగా కనబడతాయి.

4. చేతిలో నుంచి వచ్చే దుర్వాసనను దూరం చేస్తుంది :

4. చేతిలో నుంచి వచ్చే దుర్వాసనను దూరం చేస్తుంది :

మీరు మీ కుటుంబానికి భోజనాన్ని సిద్ధం చేసిన తర్వాత మీ చేతుల నుండి వచ్చే దుర్వాసన ఎంతో దారుణంగా ఉంటాయి ? భారతీయ వంటకాలలో ఎక్కువగా ఉపయోగించే ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటివి మీ చేతిల నుంచి దుర్వాసనను వెదజల్లేదిగా ఉంటాయి కాబట్టి, ఆ దుర్వాసనను నివారించడం చాలా కష్టతరంగా ఉంటుంది. మీ చేతులను సువాసనభరితంగా మార్చే ఉత్పత్తులు ఏమీ లేనప్పటికీ, టూత్పేస్ట్లు ఈ విషయంలో మీకు ఎంతో కొంత సహాయపడగలదు. మీ చేతులను సబ్బుతో శుభ్రపరుచుకుని ముందు కొంచెం టూత్పేస్ట్తో మీ చేతులను రుద్దడం వల్ల సత్వరమే నివారించడంలో దుర్వాసనను సహాయపడుతుంది.

5. రంగు పెన్సిళ్ళతో పాడైన ఇంటి గోడలను శుభ్రపరచడం :

5. రంగు పెన్సిళ్ళతో పాడైన ఇంటి గోడలను శుభ్రపరచడం :

ఇది పిల్లలు ఉన్న ప్రతీ ఇంటిలో జరిగే సాధారణమైన విషయము. మీరు మీ పిల్లలకు కాగితాలను అందిస్తున్నప్పటికీ, వారు గోడలపై గందరగోళాన్ని సృష్టించడానికే ఇష్టపడతారు. ఈ మాత్రానికే మీరు కోపగించుకోకండి ! గోడలపై ఏర్పడిన ఇలాంటి మరకలను పోగొట్టడానికి టూత్పేస్టు సహాయం తీసుకోండి. ఇది తిరిగి మీ గోడలను అందంగా మార్చటంలో తప్పక సహాయపడుతుంది.

English summary

DIY Toothpaste Tricks To Clean Your House

Toothpastes can be used to clean anything. Dab a white toothpaste on the area of the shirt that is smudged with ink to remove the stain. And then you see the results all by yourself. Rubbing some tooth paste on to your smelly hands before washing will also help you get rid of any odourDIY Toothpaste Tricks For Clean House
Desktop Bottom Promotion