మీ ఇంటిలో సానుకూల నెలకొనాలంటే, ఈ వాస్తు చిట్కాలను పాటించండి !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ప్రపంచవ్యాప్తంగా అనేక మతాలవారు, సంస్కృతులవారు వాస్తుశాస్త్రమును అనుసరిస్తున్నారు. మన చుట్టూ ఉన్న పర్యావరణంలో నెలకొని ఉన్న అనేక శక్తులను ఒకే విధంగా సంతుల్యం చేసే అతిపురాతన సాంప్రదాయ పద్ధతుల్లో వాస్తుశాస్త్రము ఒకటి. ఇదిఇలా మానవులు చేపట్టే నిర్మాణాల ద్వారా మాత్రమే జరుగుతుంది. భవన స్వరూపము (లేదా) భవన నిర్మాణము, ఏ దిశ నుంచి మంచి శక్తిని పొందాలో & ఏ దిశలో మంచి శక్తి ప్రసరింపబడుతుందో అనే విషయాన్ని సూచిస్తుంది.

నివాసముకు ఆవాసయోగ్యమైన భవనం (లేదా) నిర్మాణంలో ఉన్న భవనం దాని చుట్టూ ఉన్న అనేక శక్తులను ప్రభావితం చేస్తుంది.

మనము నివాసముంటున్న భవనము చుట్టుపక్కల వాతావరణంలో వెలువడే శక్తులు మాత్రమే మన మానసిక పరిస్థితులను ప్రభావితం చేస్తుంది. ఈ మానసిక పరిస్థితులే మన మనసును, మన పనిని ప్రభావితం చేస్తాయి.

Follow These Simple Vastu Tips To Ensure The Flow Of Positive Energy In Your House

అందువలన, సానుకూల శక్తి మాత్రమే మన చుట్టూ ప్రవహిస్తుందని నిర్ధారించబడేలా, ఇంటి నిర్మాణం సమయంలో మనము కొన్ని వాస్తు చిట్కాలను పాటించాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.

ఇల్లు లోపల ఉండే వంటగది చాలా ముఖ్యమైనది. ఆహారం ప్రాథమిక అవసరంగా ఉండటం వలన, మనము తినే ఆహారం సానుకూల వికిరణాల (శక్తుల) ను కలిగి ఉండాలి.

మీ వంటగదిని నిర్మించేటప్పుడు మీరు తప్పక గుర్తుపెట్టుకోవలసిన కొన్ని విషయాల జాబితా ఇక్కడ ఉంది. అవేమిటో ఒకసారి మీరే చూడండి.

1. కిచెన్ నిర్మాణ శైలి :

1. కిచెన్ నిర్మాణ శైలి :

సానుకూల శక్తి ప్రవాహాన్ని నిర్ధారించడానికి వంటగది ఎల్లప్పుడూ సౌత్ ఈస్ట్ దిశలో నిర్మించబడాలి. ఈశాన్య దిశలో ఉంటే, ఇది ప్రతికూల శక్తులను ప్రసరించే అవకాశాన్ని కలిగించవచ్చు. అలా కాకుండా మీ వంటగది నైరుతి ప్రాంతంలో ఉంటే, అది కుటుంబ సభ్యుల మధ్య కలహాలు & అభిప్రాయ భేదాలను కలిగిస్తుంది. వాయవ్య దిశలో ఉండే వంటగది చాలా వ్యయాలకు ఒక కారణం అవుతుంది.

2. కిచెన్ పైన (లేదా) దిగువున రూములు ఉండటం :

2. కిచెన్ పైన (లేదా) దిగువున రూములు ఉండటం :

వంటగది ఎప్పుడు కూడా టాయిలెట్ కిందన (లేదా) పై భాగంలో ఉండకూడదు. అది ఆహారంలో ప్రతికూలతను & అపరిశుభ్రతకు కారణమవుతుంది. వంటగది, పూజగదికి కిందన (లేదా) పైన ఉన్నట్లయితే, ఇది పూజనీయమైనదిగా మారుతుంది. వంటగది, బెడ్-రూమ్ కిందన (లేదా) పైన ఉండకూడదు.

3. గోడల రంగు :

3. గోడల రంగు :

వంటగది గోడలకు బ్లాక్ రంగును వాడకూడదు. మీరు పసుపు, నారింజ, గులాబీ, చాక్లెట్ (లేదా) ఎరుపు రంగులను ఉపయోగించవచ్చు.

4. ఏ దిక్కున వంట చేయాలి :

4. ఏ దిక్కున వంట చేయాలి :

దక్షిణ దిశవైపుగా వంటలను చేయకూడదు. ఇది ద్రవ్యపరమైన నష్టాలకు దారి తీస్తుంది. పశ్చిమ దిశవైపుగా వంట చేసేవారు కుటుంబానికి చెందిన ఇతర సభ్యులకు ఆరోగ్య సమస్యలను కలిగజేస్తుంది. తూర్పు దిశలో మాత్రమే ఎప్పుడూ వంట చేయాలి.

5. కిచెన్ డోర్ :

5. కిచెన్ డోర్ :

వంటగది తలుపులు ఉత్తరం, తూర్పు (లేదా) పడమర దిశల వైపున ఉండాలి. అలా అని ఇది మూలల్లో ఉండకూడదు.

6. రిఫ్రిజిరేటర్ ఉంచడం :

6. రిఫ్రిజిరేటర్ ఉంచడం :

రిఫ్రిజిరేటర్ ఈశాన్య దిశలో ఉంచరాదు. దీనిని ఉత్తరము, ఆగ్నేయము (లేదా) నైరుతి దిశలో ఉంచవచ్చు.

7. గ్యాస్-స్టవ్ను ఉంచాల్సిన దిక్కు :

7. గ్యాస్-స్టవ్ను ఉంచాల్సిన దిక్కు :

గ్యాస్ బర్నర్ (లేదా) స్టవ్ను, ఇంటి ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఉంచరాదు. ఇది వంటగది యొక్క ఆగ్నేయ దిశలో పెట్టాలి, అలాగే గోడకు కొన్ని అంగుళాల దూరంలో స్టవ్ను ఉంచాలి.

8. ఇతర వస్తువులను ఈ దిశలో ఉంచాలి :

8. ఇతర వస్తువులను ఈ దిశలో ఉంచాలి :

దక్షిణ (లేదా) పడమర దిక్కున ధాన్యాలను, సుగంధ ద్రవ్యాలను, ఉప్పును & ఇతర వస్తువులను ఉంచుకోవాలి.త్రాగునీటికి నిల్వచేసే పాత్రలను దక్షిణాన ఉంచాలి. తేలికైన వస్తువులను ఉత్తరము (లేదా) తూర్పులో దిశలో ఉంచవచ్చు. ఈశాన్య ప్రాంతంలో సింక్ను ఏర్పాటు చేయాలి. తూర్పు & పశ్చిమ దిశలలో ఎగ్సాస్ట్ ఫ్యాన్ను ఉంచవచ్చు. తూర్పు & ఉత్తర దిశలలో తేలికపాటి వస్తువులను నిల్వ చేయవచ్చు.

9. డైనింగ్ టేబుల్ :

9. డైనింగ్ టేబుల్ :

వాయవ్య దిశలో (లేదా) పడమర దిశలో డైనింగ్ టేబుల్ను ఉంచడం చాలా ఉత్తమం.

10. పరిశుభ్రతను నిర్ధారించండి :

10. పరిశుభ్రతను నిర్ధారించండి :

మీరు ఎల్లప్పుడూ మీ వంటగదిని శుభ్రంగా ఉంచుకోండి. అపరిశుభ్రమైన పాత్రలతో మీ సింక్ను పూర్తిగా మూసి వేయకండి. ఇది మీ కుటుంబ సభ్యులకు శాపాలను తెస్తుంది, ప్రత్యేకంగా ఇంటిలో ఆహారాన్ని వండే వ్యక్తికి (స్త్రీలకు) !

English summary

Follow These Simple Vastu Tips To Ensure The Flow Of Positive Energy In Your House

The Vastu Shastra says that in order to ensure the flow of positive energy in the house, the kitchen should be in the South East direction. The stove should not be placed in front of the entrance. We must avoid painting the kitchen walls in black colour. Puja room, bedroom or the washroom should be neither above nor below the kitchen.