For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోలీ పండుగ కోసం మీ ఇంటిని ఎలా సిద్ధం చేసుకోవాలి !

|

గాలిలో చేసుకొనే రంగుల పండుగలో పరిమితమైన పరిధిని కలిగి ఉండకుండా - అందరూ భాగస్వామ్యం కావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఈ పండుగ కోసం కొత్త బట్టలు వేసుకుని, రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేసుకొని, మీ సమీపంలో ఉన్న బంధువులను, స్నేహితులను కలిసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది.

ఇవన్నీ కూడా ఉత్సవంలో పాల్గొనడానికి ముందే పండగ వాతావరణాన్ని తలపిస్తుంది. ఇవన్నీ కూడా మరింత ఆసక్తిని పెంచే విషయాలే కాకుండా, ఆ రోజున మనకి ఇంకేదో సంతృప్తిని కలగజేస్తుందని అందరూ ఎదురుచూస్తుంటారు.

ఇప్పుడు ఇక్కడ గుర్తించ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, హోలీ అనేది రంగులతో చేసుకొని పండుగ కాబట్టి రంగులతో ఉత్సవాన్ని జరుపుకోవడానికి అనుమతిని ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇది అసలు నిజం కాదు. ఈ దేశీయ పండగ, శీతాకాలం తర్వాత ప్రారంభమైన వసంత కాలాన్ని సూచించే ఒక పండగగా భావిస్తారు.

అందువల్ల, ఈ పండగలో ప్రత్యక్షంగా కనిపించే విషయాలు మురికిని కలిగి ఉండరాదు మరియు హోలీ కోసం మీ ఇంటిని శుభ్రపరిచి మరింత అందంగా తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఈ రంగుల పండుగ కోసం మీ ఇంటిని సిద్ధం చేయడానికి అవసరమైన కొన్ని చిట్కాలను ఇక్కడ ఉంచబడ్డాయి. అవి

1. శుభ్రం చేయటం :

1. శుభ్రం చేయటం :

మీరు మొట్టమొదటగా, ముందుగా చెయ్యవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే; కాలం చెల్లిన మరియు పాత వస్తువులను వదిలివేయడం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఇది వసంత రుతువు ప్రారంభ సమయం కాబట్టి ఇంటిని ఖచ్చితంగా శుభ్రపరచాలి. ఇలా శుభ్రపరిచవలసిన విషయంలో ఇంటి దూలాల నుండి దుమ్ము, దూళిని శుభ్రం చేయడమే దగ్గర నుంచి ఇంట్లో వాడుతున్న కర్టెన్లను ఉన్న ప్రతీ దానిని కలిగి ఉంటుంది.

2. తెలుపుమయం :

2. తెలుపుమయం :

హోలీ పండుగనాడు ధరించే దుస్తులు తెల్లని రంగులో ఉంటాయి అని అందరికీ బాగా తెలుసు ఎందుకంటే, ఇది స్వచ్ఛతను సూచిస్తుంది. అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న కర్టెన్ తెరలను పూర్తిగా తెలని వాటితో నింపడం చాలా మంచిది. అదేవిధంగా, మురికిగా మరియు చెడుగా వున్నా అన్ని విషయాలను తొలగించి, మన జీవితం రంగులమయంగా ఉండాలని తెల్లని బట్టలతో ఆహ్వానిస్తాము. అయితే కుషన్ కవర్లను మరియు టేబుల్ కవర్లను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా మంచి ఆలోచన.

3. అందమైన రంగోలిని వేయండి :

3. అందమైన రంగోలిని వేయండి :

ఇది రంగుల పండుగ కాబట్టి, మన చుట్టూ ఉన్న పరిసరాలన్నీ చాలా రకాల రంగులతో పూర్తిగా నింపబడి ఉంటుందని స్పష్టమవుతోంది. వాటన్నిటికన్నా చాలా భిన్నంగా ఉండేందుకు, మీరు రంగులతో కూడిన రంగోలిని సిద్ధం చేయడానికి ప్రణాళికలు చేయండి. మీకు మన పాత ఆచార-సంప్రదాయాలను ప్రతిబింబించేలా కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనుకుంటే, బియ్యం పిండితో వేసే రంగోలిని సిద్ధం చేయవచ్చు.

4. సువాసనను వెదజల్లే కొవ్వొత్తులు :

4. సువాసనను వెదజల్లే కొవ్వొత్తులు :

ఈ పండుగ పూర్తిగా కొత్తదనంతో సంతరించుకున్న తర్వాత, మీరు అందంగా తయారయ్యి - మీకు ఇష్టమైన వ్యక్తితో టీ (లేదా) కాఫీ త్రాగలని కోరుకుంటారు. అలాంటి సందర్భంలో, సాయంత్ర వేళ్ళలో మీరు వ్యక్తిగతంగా వాడుకునే గదిని సువాసనను వెదజల్లే కొవ్వొత్తులతో అందంగా అలంకరించుకోవడం అనేది నిజంగా చాలా మంచి ఆలోచన. అలా మీ గదిలో పూర్తిగా పరిమళించిన సువాసనలతో కమ్ముకొని ఉండటం వల్ల, మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదపరచి, మిమ్మల్ని ఇంకా ఆనందపరచి, మిమ్మల్ని ఇంకా దగ్గర చేస్తుంది.

5. వ్రేలాడే గంటలను ఉంచండి :

5. వ్రేలాడే గంటలను ఉంచండి :

భారతీయ సాంప్రదాయాలను ప్రతిబింభించేలా మీ ఇంటిని పూర్తిగా అలంకరించండి, ఇలాంటి (వ్రేలాడే గంటలను) అలంకరణ వల్ల మీ ఇంటికి నూతన శోభను తీసుకువస్తుంది. వీటిని లివింగ్ రూమ్లో (లేదా) బెడ్ రూమ్లో (లేదా) పూజ గదిలో ఉంచాలా అనే నిర్ణయాన్ని మీరే తీసుకోండి. మన సాంప్రదాయాల ప్రకారం, వ్రేలాడే గంటలను ఇంట్లో ఉంచడం వల్ల మీకు అదృష్టాన్ని తేగలదు. హోలీ వంటి పండగ సమయాల్లోనే కాక, మిగతా సమయాల్లో కూడా మీకు మంచిని చేకూరుస్తుంది.

 6. పూలతో అంకరించండి :

6. పూలతో అంకరించండి :

అనేక భారతీయుల ఇళ్లల్లో, పూజగదిని తాజా పూలతోనూ మరియు పూజా దళములతో అలంకరించడం అనేది నేటికీ కొనసాగించబడుతోంది. అయితే, ఈ విధానాన్ని మీరు పూజా-మందిరానికే పరిమితం కాకుండా, లివింగ్ రూమ్లో మీకు ఇష్టమైన డిజైన్లలో పూలను అలంకరించవచ్చు. ఇదే పద్ధతిని మీ ఇంటి ప్రవేశద్వారం వద్ద కూడా ప్రయత్నించవచ్చు.

English summary

How to prepare your home for Holi

Two more days to go for the festival of colours, Holi. On this special occasion one can expect a lot of guests at home. And its very important to keep your house clean and prepared for Holi. Some of the quick ways to do so this holi is by throwing away the old and stale things, decorating the house with candles, wind chimes, etc.
Story first published:Thursday, March 1, 2018, 11:09 [IST]
Desktop Bottom Promotion