Just In
- 21 min ago
Planet Transit in June 2022 :జూన్ నెలలో 5 గ్రహాల రవాణా.. ఏయే తేదీల్లో మారనున్నాయంటే...
- 1 hr ago
మాంసాహారం కంటే ఈ పప్పుధాన్యాల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉండొచ్చు... దృఢమైన శరీరానికి ఇవి చాలు!
- 3 hrs ago
రొయ్యలతో చెట్టినాడ్ స్టైల్ పెప్పర్ ఫ్రైని ప్రయత్నించండి
- 4 hrs ago
Shani Jayanti 2022 Daan: శని మహాదశ కష్టాల నుండి ఉపశమనం కావాలంటే ఇవి దానం చేయండి...
Don't Miss
- Movies
Bhool Bhulaiyaa 2 Collections.. 100 కోట్లకు చేరువగా కియారా అద్వానీ మూవీ.. 5 రోజుల్లో ఎంతంటే?
- News
Vastu tips: నిద్రకూ వాస్తు డైరెక్షన్: ఉత్తర దిక్కుకు తలపెట్టి పడుకుంటే ఏమవుతుందో తెలుసా?
- Sports
IPl Qualifier 1 : మనది కాని టైంలో కొన్నిసార్లు మింగేయాలి.. తప్పదు అన్న జోస్ బట్లర్
- Finance
Digit Insurance IPO: విరాట్ కోహ్లీ కంపెనీ పబ్లిక్ ఇష్యూ: 500 మిలియన్ డాలర్లు టార్గెట్
- Automobiles
Honda City e:HEV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే
- Technology
Spicejet విమానాలపై Ransomware తో హ్యాకర్ల దాడి ! పూర్తి వివరాలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇంటి నుంచి వచ్చే దుర్వాసనను వదిలించుకోవడానికి ఉన్న సహజ మార్గాలు !
మీ ఇంటికి అన్ని రకాల హంగులను అద్దడం వల్ల, మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడమే కాకుండా దాని యొక్క విలువ మొత్తాన్ని కూడా పెంచుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా, మీ ఇంటిని దుర్వాసనకు దూరంగా ఉంచడం వల్ల మీరు నివసించడానికి మరింత నివాసయోగ్యంగా మారుతుంది.
మీలో
చాలామంది
తమ
స్నేహితులను
ఇంటికి
ఆహ్వానించడానికి
బాగా
ఇబ్బంది
పడతారు
ఎందుకంటే,
ఆ
ఇంటి
నుంచి
వెలువడే
చెడు
వాసన
కారణంగా.
ఇంట్లో
ఉండే
పెంపుడు
జంతువులు
&
తివాచీల
నుంచి
వచ్చే
దుర్వాసన
చాలా
బాధాకరంగా
ఉంటుంది.
ఇలాంటి
దుర్వాసనలను
నుండి
మీ
ఇల్లును
స్వేచ్ఛ
పూరితంగా
ఉంచడానికి
మీరు
చాలా
రకాలుగా
కష్టపడవలసి
వస్తుంది,
అలా
మీ
శక్తిని
చాలా
మటుకు
కోల్పోతారు.
మీ ఇంటి నుంచి వెలువడే దుర్వాసనను పోగొట్టడానికి అనుసరించవలసిన సమర్థవంతమైన, సులభమైన చిట్కాలను గూర్చి మేము మీకు తెలియజేస్తాము. ఈ చిట్కాలను అమలుపరచడం వల్ల మీ ఇంటి నుంచి వెలువడే దుర్వాసనను పోగొట్టి, మీ ఇంటిని మరింత శుభ్రంగా & తాజాగా ఉండేలా చేయడంలో ఇవి బాగా సహాయపడుతాయి కాబట్టి మీరు వీటిని ఒకసారి ప్రయత్నించి చూడండి.

1. మీ చెత్తబుట్టను ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచుకోండి :-
మనలో చాలామంది తడిగా ఉన్న వ్యర్ధాలను & పొడిగా ఉన్న వ్యర్ధాలను కలిపి ఒకే చెత్తబుట్టలో వేయడమే అతి పెద్ద తప్పు. ఇలాంటివి వ్యర్థాల వల్ల మీ ఇల్లు అంతటికి దుర్వాసన వ్యాపిస్తుంది. ఇటువంటి దుర్వాసన నుండి మీఇంటిని దూరంగా ఉంచేందుకు మీ చెత్తబుట్టును ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకునేలా నిర్ధారించుకోండి. అందుకోసం మీరు ఒక నిమ్మకాయను / నారింజను / సిట్రస్ పండును కట్చేసి చెత్తబుట్ట చుట్టూ ఉంచండి. ఒక కప్పు నీళ్లలో వైట్ వెనిగర్ ను కలిపి ఆ డస్ట్-బిన్ను శుభ్రంగా కడగాలి. సిట్రస్ పండ్లు దుర్వాసనను గ్రహించే శోషకాలుగా పనిచేస్తాయి, అందువల్ల మీ ఇల్లు మరింత తాజాగా ఉంచబడుతుంది.

2. కార్పెట్ల నుంచి వచ్చే దుర్వాసనను తొలగించండి :-
కార్పెట్లు, మీఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దుతాయి. ఇవి మరింత సౌకర్యంగా ఉన్నప్పుడు మనతోపాటు మన పెంపుడు జంతువులు కూడా వీటిపై ఎక్కువగా సేద తీరుతాయి. ఇప్పుడు, మీరు మీ పెంపుడు జంతువులకు సరైన శిక్షణను ఇవ్వకపోతే ఈ కార్పెట్లపైనే మూత్రమును పోసి మురికిగా చేయడంతోపాటు, మీ ఇంటి నిండా చెడు వాసనను వెదజల్లుతాయి. మీ పెంపుడు జంతువుల కారణంగా కార్పెట్లను నుండి వెలువడే ఈ దుర్వాసనను పోగొట్టడానికి, 3 వంతుల నీటిలో - 1 వంతు నీటికి వెనిగర్ను కలపాలి. ఈ నీటితోనే మీ కార్పెట్ను బాగా రుద్ది శుభ్రంగా వాష్ చేయాలి. ఆ తర్వాత మంచి నీటితో మీ కార్పెట్ను శుభ్రంగా కడిగి, గాలి తగిలే చోట ఉంచడం వల్ల మీ కార్పెట్ను పొడిగా మార్చుకోవాలి. ఈ చిట్కాను పాటించడంవల్ల మీ ఇంటి నుండి వెలువడే దుర్వాసన సమర్ధవంతంగా తొలగించడంలో మీకు బాగా సహాయపడుతుంది.

3. మీ రిఫ్రిజిరేటర్ను తరచుగా తనిఖీ చేయాలి :-
మనలో చాలామంది రిఫ్రిజరేటర్లో చాలా రకాల ఆహార వస్తువులను నిల్వ చేస్తారు. అలా మనము రిఫ్రిజరేటర్లో నిల్వచేసిన కిరణా & ఆహార పదార్థాలను గూర్చి ఒక్కొక్కసారి పూర్తిగా మర్చిపోతాము. అలా మరచిపోయిన కూరగాయలను, మాంసము, పండ్లు వంటి ఆహార పదార్ధాలను ఎక్కువకాలం వినియోగించకపోవడం వల్ల చెడు వాసనకు కలిగిస్తాయి. ఇలా ఉత్పత్తి అయ్యే చెడు వాసనను తొలగించడానికి బేకింగ్ సోడాను మరియు సోడియం బైకార్బొనేట్ను కలిపి ఉపయోగించండి. ఈ రెండు మిశ్రమాలను కలిపి ఉపయోగించడం వల్ల దుర్వాసనను సంగ్రహించేదిగా పనిచేస్తుంది. మీ రిఫ్రిజరేటర్లో ఏర్పడే చెడు వాసనను దూరం చేసేందుకు ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ యొక్క అల్మరాలో ఉంచండి.

4. మసాలా దినుసుల వల్ల వచ్చే ఘాటు వాసనను వదిలించుకోండి :-
మీ వంటశాలలో తయారు చేసే ఆహార పదార్ధాలలో ఉపయోగించే మసాలా దినుసులు వల్ల మీ ఇంటి గదులు & క్యాబినెట్ మూలల్లోకి ఘాటయిన వాసన వెదజల్లబడుతుంది. మీ ఇంటినంతటినీ శుబ్రపరిచినప్పటికీ ఈ వాసన ఇంట్లోనే ఉంటుంది. ఈ వాసనను వదిలించుకోవడానికి, గ్యాస్-స్టవ్ మీద ఒక కప్పు వెనిగర్ను బాగా మరగనివ్వాలి. దాని నుంచి విడుదలయ్యే ఆవిర్లు గాలిలోకి చేరి ఘాటైన వాసనను తగ్గిస్తాయి. ఇలా వెనిగర్ ద్వారా వచ్చే పొగ ఎక్కువసేపు ఉండనప్పటికీ, తొందరగా మీఇంటిని తాజాగా ఉంచుతుంది.