For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వంటగదిని త్వరగా శుభ్రం చేసేందుకు మీరు పాటించవలసిన చిట్కాలు !

|

ఒక ఇంటికి చిరునామా "వంటగది" అని చాలామంది చెప్తారు. వంటగది అనేది ఇంటికి చాలా ముఖ్యమైనది, వంటగది ఉన్న రీతిని బట్టే - ఇంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి మీరు మీ వంటగదిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

ఇక్కడ పరిగణించవలసిన మరో అంశం ఏమిటంటే, ఇంటిల్లిపాదికీ కావలసిన ఆహారము అనేది వంటగది నుంచి మాత్రమే వస్తుందని అందరూ గుర్తుంచుకోవాలి. అందువలన, వంటగదిలో పరిశుభ్రత నిర్వహించబడుతుందని నిర్ధారించడానికి సరైన జాగ్రత్తలను తీసుకోకపోతే మనం తీసుకొనే ఆహారాలను, మన ఆరోగ్యాలను కూడా ప్రతికూల పద్ధతిలో ప్రభావితం చేసి పూర్తిగా కలుషితం కావడానికి దారితీస్తుంది.

వంటగదిని శుభ్రం చేయడం అనేది భయపెట్టే పని అని చాలామంది భావిస్తున్నారని చెప్పబడుతున్నాయి. నిజానికి, ఈ రోజుల్లో వంట చేయడానికి సహాయపడే ఉపకరణాలు (అప్లియన్స్స్) చాలానే ఉన్నాయి, వంటగది తో పాటు ఇలాంటి ఉపకరణాలన్నింటినీ శుభ్రం చేయడం అనేది చాలా కఠినమైన పనిగా మహిళలు భావిస్తారు.

అయితే వాస్తవానికి, ఒకవేళ మీరు వంటకు సహాయపడే ఉపకరణాలను సరైన పద్ధతిలో అమర్చుకొని బాగా ఉపయోగించుకోగలిగిన ట్లయితే, కిచెన్ను శుభ్రపరచడం అనేది కేక్ తినేంత సులభంగా ఉంటుంది. నేటి మహిళలకు వంటగదిని శుభ్రపరచడం సవాళ్లుగా ఉన్నట్లయితే అలాంటి వారికోసం ఇక్కడ కొన్ని చిట్కాలను సూచించాము, వీటిని పాటిస్తే త్వరగా వంటగదిని శుభ్రం చేసుకోవచ్చు.

ప్రతిరోజూ మీరు ఈ 7 చిట్కాలను అనుసరిస్తూ ఉండటం వల్ల మీ ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది, మీ వంటగదిని చూసి మీ స్నేహితులు, బంధువులు అసూయ పడతారు.

1. టీ ఎక్కువ సార్లు తాగుట :

1. టీ ఎక్కువ సార్లు తాగుట :

అప్పుడే తయారుచేయబడిన వేడి టీను ఎవరు ఇష్టపడరు ? కానీ ఇతర ప్రయోజనాల కోసం టీ ఉపయోగిస్తారని మనకు తెలుసు ! దీనిని మీ స్టౌవ్ను శుభ్రపరిచే ఏజెంట్గా ఉపయోగించవచ్చు, ఈ తేనీరును సేవించడం వల్ల మరో 4 రెట్ల అధిక శారీరక బలాన్ని పొందగలరు.

అలా చేస్తున్నప్పుడు, తేయాకు ఆకులను మాత్రమే ఉపయోగించడానికి ప్రయత్నించండి, మార్కెట్లో లభ్యమయ్యే టీ బ్యాగ్లను మాత్రము ఉపయోగించకండి. తేయాకు చాలా టానిన్లు కలిగివుంటాయి, అందువల్ల ఇది జిడ్డుగా మారిన మొండి గ్రీజు, ఆహారపు మరకలను ఇది చాలా త్వరగా శుభ్రపరుస్తుంది. నిజానికి, మీరు మీ వంటగదిని చాలాకాలం పాటు శుభ్రం చేయకపోతే, మీ వంటగది చాలా మురికిగా ఉండటాన్ని మీరు గమనించవచ్చు కాబట్టి, మీరు ఈ చిట్కాని పాటించి, మీ వంటగదిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

2. తక్కువ వినియోగ సమయాన్ని కలిగి ఉండే ప్రొడక్ట్స్ :

2. తక్కువ వినియోగ సమయాన్ని కలిగి ఉండే ప్రొడక్ట్స్ :

బేకింగ్ పౌడర్ వంటి ఉత్పత్తుల జీవిత కాలం చాలా తక్కువగా ఉంటుందని మనందరికి తెలుసు. దీనిని ఫ్రిజ్లో నిల్వ ఉంచినప్పటికీ, 30 రోజులకు మించి దీనిని ఉపయోగించవచ్చని దానర్థం కాదు. మీరు బేకింగ్ పౌడర్ను పారవేయాల్సి వచ్చినప్పుడు, దానిని మీ డస్ట్ బిన్లో పడవేసి, ఆపై నీటిని జతచేయండి. ఇలా మీరు 2 నెలలకొకసారి చెయ్యడం వల్ల, మీ డస్ట్ బిన్ల నుంచి దుర్వాసన రాలేవు.

3. మైక్రోవేవ్ ను శుభ్రపరచడం :

3. మైక్రోవేవ్ ను శుభ్రపరచడం :

బేకింగ్ కేకుల కోసం మైక్రోవేవ్లో అన్ని రకాల పదార్ధాలను మిలితం చేసి తయారుచేయడం వల్ల, తిరిగి వాటిని శుభ్రపరిచేందుకు మీరు తరచుగా ఒక కఠినమైన వ్యాయామమును ఎదుర్కొంటారు. కేకు తయారీ ప్రక్రియలో భాగంగా, మైక్రోవేవ్లో వెదజల్లబడిన కొన్ని పదార్థాల సమ్మేళనాలు మరింత కఠినమైనదిగా మారి, మీ మైక్రోవేవ్ ఒక దుర్భరమైన పరిస్థితిని కలిగి ఉండేటందుకు కారణమవుతుంది (ముఖ్యంగా మైక్రోవేవ్ దిగువ భాగంలో సంబంధించి ప్రత్యేకంగా ఉంటుంది). అటువంటి పరిస్థితిలో, మీరు చేయాల్సింది ఏమిటంటే, కాస్తా ఉప్పును తీసుకొని కఠినమైన మొండి మరకలను కలిగివున్న మైక్రోవేవ్న్లో చల్లుకోవడమే. అలా కొన్ని నిమిషాలలోనే ఆ మరక గల ప్రదేశాలను, బూడిదగా మారుస్తుంది అలాగే మీ ఓవెన్ను చల్లబరుస్తుంది, చివరిగా మీ మైక్రోవేవ్న్ను ఒక తేలికపాటి వస్త్రంతో సులభంగా తుడిచివేయవచ్చు.

4. స్టెయిన్లెస్ స్టీల్ ను శుభ్రం చేస్తుంది :

4. స్టెయిన్లెస్ స్టీల్ ను శుభ్రం చేస్తుంది :

స్టెయిన్ లెస్ స్టీల్ శుభ్రం చేయడానికి అద్భుతమైన పనితీరును కలిగే ఎజెంట్ "వోడ్కా". వోడ్కాలో స్పాంజ్ను పెట్టి, స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లను (లేదా) పెద్ద పాత్రలను శుభ్రంగా తుడిచివేయండి. ఇందులో ప్రస్తావించిన స్టెయిన్లెస్ స్టీల్ అంశం అనేది నిజంగా మురికిగా లేకపోతే, ఒక పేపర్ టవల్ మీద కొన్ని వోడ్కా చుక్కలను చల్లి, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలను బాగా ఈ టవల్తో బాగా క్లీనింగ్ చెయ్యడం వల్ల మీ పాత్రలు మళ్ళీ కొత్తదానిలా మెరుస్తూ ఉండటాన్ని మీరు గమనించవచ్చు.

5. సింక్ ను శుభ్రపరచడం :

5. సింక్ ను శుభ్రపరచడం :

వంటగదిని శుభ్రం చేసే చాలామందికి సింక్ ప్రాంతం

బాగా విసుగు కలిగించేదిగా ఉండవచ్చు. అయితే, వంటగది శుభ్రపరిచే మొత్తములో, అతి ముఖ్యమైన భాగాలలో ఇది ఒకటి. ఇక్కడ మీరు పాటించవలసిన ట్రిక్ ఏమిటంటే, సాధారణ సబ్బుతో సింక్ను శుభ్రపరిచిన తర్వాత, ఆలివ్ ఆయిల్ (లేదా) బేబీ ఆయిల్ను కలిగిన గుడ్డతో సింక్ను బాగా శుభ్రంగా కడగాలి. మీ సింక్ బాగా పొడిగా ఆరేంత వరకూ అస్సలు ఉపయోగించకూడదు. మీ సింక్ ఎలాంటి ఆహారపు మరకలను కలిగి లేకుండా చాలా పరిశుభ్రంగా ఉన్నదని నిర్ధారిస్తుంది.

6. మంచి స్మెల్ కోసం :

6. మంచి స్మెల్ కోసం :

ఖరీదైన ఫ్రెషనర్లను వాడకుండానే మీ వంటగదిని సువాసనభరితంగా ఉంచగలిగే ఒక ట్రిక్ ఇది. అందుకు మీరు చేయాల్సినదల్లా ఒక సాధారణమైన నిమ్మకాయను, దానికి రంద్రాలను చేసి అందులో ఒక టూత్పిక్ను ఉంచాలి. అప్పుడు, ఆ నిమ్మకాయను 10 - 15 నిమిషాల వరకూ ఒక ఓవెన్లో ఉంచి 300 డిగ్రీల F వద్ద బాగా కాలేలా ఉంచాలి. అప్పుడు, ఓవెన్ తలుపును కొద్దిగా తెరచి అందులో ఈ నిమ్మకాయను ఉంచడం వల్ల, ఒక అద్భుతమైన సువాసన మొత్తం గదిలోకి వ్యాపించగలదు. మీరు ఓవెన్ను కలిగి లేకపోతే, ఇదే రకమైన ఫలితాలను పొందడానికి 20 - 25 నిముషాల వరకు కొంత నీటిలో టూత్పిక్ను గుచ్చిన ఈ నిమ్మకాయను బాగా మరిగించాలి.

7. లేజీగా ఉండొద్దు :

7. లేజీగా ఉండొద్దు :

ఈ గోల్డెన్ రూల్, మీ జీవితంలో దాదాపు అన్నింటికీ వర్తిస్తుంది, మీ వంటగదిని శుభ్రంగా ఉంచుకునే విషయంలో ఇది అక్షరాల నిజము కూడా. మీరు ఉపయోగించే ప్రతి ఉపకరణాన్ని శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. మీరు ఉపయోగించే సమయంలో ఈ ఉపకరణాలు ఎలాంటి మురికిని పొందలేదని భావిస్తే, ఒక పొడి బట్టతో ఆ వస్తువును శుభ్రంగా తుడవండి. ముఖ్యమైన ఉపకరణాలను శుభ్రంగా ఉంచటమనేది అత్యంత ప్రాముఖ్యతను కలిగి విషయము, అలా ఉంచడం వల్ల మీ వంటగది చాలా పరిశుభ్రంగా కనబడుతుంది.

English summary

Quick tips on keeping the kitchen clean

Women spend most time in cooking and cleaning stuff in the kitchen. No matter how much you clean your kitchen, it might still appear dirty. The next time you prepare tea, make sure not to throw away the tea powder, as you can actually clean your stove with the tea powder. These quick tips can certainly save some time.