For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ధ్యాన పద్ధతిలో మెళుకువలు!

By B N Sharma
|

Technique For Meditation!
జెన్ మాస్టర్లు తమ కత్తిని ధ్యానానికి ఒక మెళుకువగా వాడేవారు. ఇద్దరు జెన్ మాస్టర్లు కనుక అంటే ఇద్దరు ధ్యానం చేసే వ్యక్తులు ఆ కత్తులతో పారాడుతే, దానికి అంతం వుండదనే సామెత జపాన్ లో వాడుకలో వుండేది. వారిద్దరిలో ఎవరూ ఓడరు...ఎవరూ గెలువరు. దానికి కారణం ఇద్దరూ కూడా ఆలోచన చేయకుండా పోరాడుతూనే వుంటారు. కత్తులు వారి చేతులలో వుండవు. ఆ కత్తులు వారి అంతరాత్మలలో వుంటాయి. అంతరాత్మకు ఆలోచన వుండదు. మరొకరు కత్తి ఎత్తితే చాలు ఎదుటి మాస్టర్ తనను తాను వేగంగా కత్తితీసి రక్షించుకుంటాడు. ఆ సమయంలో అతను ఆలోచించడు, దానికి సమయం కూడా వుండదు. ఏ మాత్రం ఆలోచించినా కత్తి శరీరంలోకి దిగబడిపోతుంది. అదే వేగంతో వారి ఆలోచన కూడా వుంటుంది. లేకుంటే వారు రక్షించబడలేరు.

కనుక వారు కత్తిసాము ఒక ధ్యానంగా చేస్తారు. మీ అంతరాత్మతో ప్రతిక్షణం వుండండి, ఆలోచించకండి. ఏం జరిగినా అంతరాత్మకు వదిలేయండి. మైండ్ ని మధ్యలో పెట్టకండి. ఇది చాలా కష్టమైనదే. ఎందుకంటే మన స్కూళ్ళు , కాలేజీలు, యూనివర్శిటీలు, అన్నీ కూడా మన మైండ్ ఉపయోగించటం ఎలా అన్నదే మనకు నేర్పాయి. మన అంతరాత్మతో మనం సంబంధం కోల్పోయాం. దానిని మరచిపోయం. అందరిలోను అంతరాత్మ వుంటుంది. కాని అది పనిచేయదు. అది పూర్తిగా పనిలేక స్తంభించింది. దానిని మరల పైకి తీయాలి.

మీరు మీ మైండ్ లేదా తలతో ఆలోచించకండి. ఆలోచన లేకనే ముందుకు సాగిపోండి. కొన్ని అంశాలలో ఇది కష్టమే. ఎందుకంటే మన పాత అలవాటు ఆలోచించే అడుగుముందుకు వేయటం. ఆలోచించకుండా వుండేందుకు మెళుకువతో వుండాలి. అయితే మీకు వచ్చే సందేశాలు మీ అంతరాత్మనుండి వస్తున్నాయా లేక మైండ్ నుండి వస్తున్నాయా? అనేది గ్రహించగలగాలి. అదే ధ్యానం చేసే వారి ప్రధాన లక్షణం. ధ్యానంలో మీరు నిపుణులైపోతే, ఈ వ్యత్యాసం మీకు బాగా అవగతమవుతుంది.

English summary

Technique For Meditation! | ధ్యాన పద్ధతిలో మెళుకువలు!

This sutra is for that inner guide. This consciousness is the spirit of guidance of each one. Be this one. Don't think with the head. Really, don't think at all. Just move. Try it is some situations. It will be difficult, because the old habit will be to start thinking. You will have to be alert: not to think, but to feel inwardly what is coming to the mind.
Story first published:Thursday, June 14, 2012, 14:50 [IST]
Desktop Bottom Promotion