For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచంలో 8 అత్యద్భుతమైన ఆలయాలు

|

ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైన మతాలు మరియు మతపరమైన చిహ్నాలు కలిగి ఉన్నాయి. ఉదాహరణకు హిందూ మతం, బౌద్దమతం, టావోయిజం, మరియు సిక్కు మతం, జైన మతం, ఇలా ఒక్కో దేశంలో వివిధ మతాలు కనుగొనవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా మనకు తెలియను కొన్ని దేవాస్థానాలు చాలా అద్భుతంగా రూపకల్పం గావించబడ్డాలి. కొన్ని వేళ సంవత్సరాల క్రితమే వాటికి అద్భుతమైన రూపకల్పన చేయబడినది. ప్రపంచంలో ఉన్న ప్రజలు ఆయా దేశాల్లో వివిధ మతాలు వారు వారి మతానుచారంగా వివిధ దేవతలను ఆరాధిస్తారు. అయితే దేవాలయాలు మాత్రం ఎల్లప్పుడు అన్ని రకాల ప్రజల కోసం, భక్తుల కోసం, మరియు పర్యాటకులకు కోసం ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.

అనేక మంది ప్రయాణికులు తూర్పు దేశాల్లో ఉన్నటువంటి అద్భుతమైన దేవాలయాలను సందర్శించడానికి... దేవాలయాల నిర్మాణ నమూనాలు చూడటానికి.. పొందడానికి. అక్కడ వున్న దేవుళ్ళకు కానుకలు చెల్లించడానికి అనేక కారణాలతో దూరదేశాల దేవాలయాలను సందర్శిస్తుంటారు.

మీరు కూడా ఇలా విహార యాత్ర చేయాలనుకొనే వారిలో ఒకరైతే మరియు ఆధ్యత్మిక ప్రదేశాల్లో చూడాలనే విశ్వాసం కలిగి ఉంటే కనుక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అద్భుతమైన మరియు అందమైన దేవాలయాలు జాబితా కొన్ని మీకోసం. మీరు ఎప్పుడైనా ఇలా దూరదేశాల సందర్శనార్తం వెళ్ళాలనుకొన్నప్పుడు ఇటువంటి వాటిని మీ మనస్సులో ఉంచుకోండి...

ప్రపంచంలో 8 అద్భుతమైన దేవాలయాలు

వాట్ ఫ్రా కేవో, బ్యాంకాక్: పర్యాటక ఆకర్షణల్లో ప్రధానమైనది బ్యాంకాక్. వాటర్ సిటి. బ్యాంకాక్ భారతీయ మూలాలు ఉన్న నగరం. దాంతో ఇక్కడ చాలా పేర్లు మన దేశ భాషలకు దగ్గరగా ఉంటాయి. ప్రధానంగా మన ప్రాచీన భాషలు పాళి, సంస్కృత భాషల ఆధారంగా వచ్చిన పేర్లు చాలా ఉన్నాయి. ఇక్కడ ఎయిర్‌పోర్టు పేరు సువర్ణభూమి. చారిత్రక ఆలయం వాట్ ఫ్రా కేవో. బ్యాంకాక్‌లో గ్రాండ్ ప్యాలెస్, ఎమరాల్డ్ బుద్ధ ఆలయం(వాట్ ఫ్రా కెవో) ఆవరణలోని విగ్రహాలను చూస్తుంటే జానపద చిత్రాన్ని చూస్తున్న భావన కలుగుతుంది. చారిత్రక ఆనవాళ్ల ప్రకారం ఈ ప్రదేశం 15వ శతాబ్దంలో అయుత్తయ వంశ పాలకుల ఆధీనంలో ఉండేది. అప్పుడు దీని మొదటి పేరు సియాం. నగరం మధ్య నుంచి ‘చో ఫ్రాయా' నది ప్రవహిస్తుంది. ఇది అప్పట్లో చిన్న జలరవాణా కేంద్రం. తర్వాత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది ఆసియాలో పొడవైన నది. ఇది బ్యాంకాక్ నగరం మీదుగా గల్ఫ్ ఆఫ్ థాయ్‌ల్యాండ్ సముద్రంలో కలుస్తుంది. ఈ నదిలో క్రూయిజ్‌లో ప్రయాణించడం మెమొరబుల్ ఫీలింగ్.

ప్రపంచంలో 8 అద్భుతమైన దేవాలయాలు

ష్వేడగాన్ పగోడా మయన్మార్: మయన్మార్ అనాగేనే డగాన్ పగోడా గ్రేట్ ఫేమస్. బర్మా మరియు మయన్మార్ అనే పేర్లు అధికంగా ఉన్న బర్మీయులు మరియు బామర్ సాంస్కృతిక ప్రజల వలన వలన వచ్చినవే. మాయన్మార్ సంప్రదాయ సమూహాల వ్రాత రూపం పేరు వలన మయన్మార్ అనే పేరు వచ్చింది. బర్మా గ్రామాలలో అత్యంత స్పష్టంగా, బర్మీస్ సంస్కృతి ప్రతిబింబిస్తుది. ఇక్కడ స్థానిక పండుగలు చాలా ఏడాది పొడవునా జరుగుతాయి. వీటిలో ముఖ్యమైన పండుగ పగోడా పండుగ. ప్రపంచ పురాతన చారిత్రక కట్టడాలో పగోడాస్ ఒకటి. ఈ స్థంబాన్ని నిజమైన బంగారు ప్లేట్లతో తయారు చేయబడినది. ఇది పగలు, రాత్రి చాలా అద్భుతంగా ప్రకాశిస్తూ కనిపిస్తుంది.

ప్రపంచంలో 8 అద్భుతమైన దేవాలయాలు

తత్కషంఘ్ మోనాస్ట్రీ, భూటాన్: భూటాన్ ఒకప్పుడు ప్రంచానికంతటికీ దూరంగా ఏకాంతంగా ఉండే దేశాలలో ఒకటి. కానీ ప్రస్తుతం దేశంలో సాంకేతిక మరియు ఇతర అభివృద్ది కారణంగా ప్రపంచానికి భూటాన్ ద్వారాలు తెరువబడ్డాయి. క్లిఫ్ వైపు ఉన్న పారో లోయ అద్భుతమైనది. ఇక్కడ ఉన్న మఠం1692లో ధ్యానం కోసం నిర్మించబడినది.ఇక్కడికి గురు రింపోచే(రెండవ బుద్ద)హిమాలయాల నుండి వచ్చి ఆదపులి అని వారి విశ్వాసం.

ప్రపంచంలో 8 అద్భుతమైన దేవాలయాలు

గోల్డెన్ టెంపుల్, ఇండియా: ఇండియాలో ఉన్న ఈ గోల్డెన్ టెంపుల్ హర్మందీర్ సాహిబ్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోని అద్భుతమైర పవిత్రమైన దేవాలయాల్లో ఇది ఒకటి. శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ యొక్క గ్రంధాలయం బంగారు పూతతో పూసిన ఆలయం ఉంది. ప్రకాశించే ఈ గోల్డెన్ టెంపుల్ చుట్టు వైట్ భవనాలు మరియు ఒక పవిత్రమైన సరస్సు కలిగి ఉన్నాయి.

ప్రపంచంలో 8 అద్భుతమైన దేవాలయాలు

ప్రాంబనాన్, ఇండోనేషియా: ప్రపంచంలో ఇది మరొక అద్భుతమైన ఆలయం. ఈ హిందూ ఆలయంలో త్రిమూర్తి (బ్రహ్మ, విష్ణు, శివ)రూపాలతో కట్టబడినది. ఇది ఇండోనేషియా అతి పెద్ద హిందూమత దేవాలయం.

ప్రపంచంలో 8 అద్భుతమైన దేవాలయాలు

వాట్ రాంగ్ ఖూన్, థాయిలాండ్: ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన దేవాలయాల్లో బాగా ప్రసిద్ది చెందిన దేవాలయం బౌద్ద దేవాలయం. పూర్తి తెలుపు వర్ణంలో ఈ దేవాలయం మొజాయిక్ అద్దాలతో అద్భుతంగా నిర్మించారు. ఈ దేవాలయం ఇంకా రూపకల్పన నిర్మాణంలో ఉంది.

ప్రపంచంలో 8 అద్భుతమైన దేవాలయాలు

బోరోబుదుర్, ఇండోనేషియా: బోరోబుదుర్ 2672 ప్యానెల్స్ తో మరియు 504బుద్దుని విగ్రహాలతో అలంకరించబడినటువంటి అద్భుతమైన దేవాలయం . ప్రధాన గోపురానికి చుట్టూ 72బుద్ద విగ్రహాలు నిర్మించడబడి అద్భుతంగా ఉన్నాయి.

ప్రపంచంలో 8 అద్భుతమైన దేవాలయాలు

శ్రీ రంఘనాథ స్వామి దేవాలయం, ఇండియా: ప్రపంచంలో అద్భుతమైనా దేవాలయాల్లో ఒక్కటి మాత్రమే కాదు. ఇది భారతదేశంలో ఉన్న ఆలయాలన్నింటిలోకి అతి పెద్ద హిందూ దేవాలయం. ఈ విష్ణు దేవాలయం దాని గోపురాలు చాలా ప్రసిద్ది చెందింది.

English summary

8 Most Amazing Temples In The World | ప్రపంచంలో 8 అత్యద్భుతమైన ఆలయాలు

There are many religions and religious symbols around the world. You can find different religions in the countries which include Hinduism, Buddhism, Taoism and Sikhism. Architecturally designed temples around the world are built up in years. People worship different Gods in various religions. However, temples have always been another major attraction for the devotees and tourists.
Story first published: Monday, December 17, 2012, 14:35 [IST]
Desktop Bottom Promotion