For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ యూ? (అందులో మీకేముంది?): పుస్తక సమీక్ష

By B N Sharma
|

వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ యూ? పుస్తకం ప్రచురణ కర్తలు మేక్మిలన్ కంపెనీ వారు దాని కవరుపై కొన్ని పాచికలు మరియు ప్రశ్నార్ధకాలు వేసి దానికి ఒక మేనేజ్ మెంట్ టెక్స్ట్ బుక్ గా తయారు చేశారు. మీరు దానిని చూడగానే అది ‘సిక్స్ సిగ్మా’ లేదా ‘ఫైనాన్స్ ఫర్ నాన్ ఫైనాన్స్’ వంటి పాఠ్య పుస్తకాలని భావిస్తారు. కాని, మీరు పుస్తకం చదవటంలోకి వెళితే, అది మీకు ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. మీ హాబీని దేనినైనా సరే ఒక కెరీర్ గా మలచుకోటానికి ఈ పుస్తకం ఒక మార్గదర్శి.

పుస్తకంలోని విషయాలు సమీక్షిస్తే, దానిని ఒక బయోగ్రఫీ గాను మరియు స్వంత అభివృధ్ధిగాను వర్ణించవచ్చు. ఒక మధ్యతరగతి పంజాబి కుటుంబంనుండి వచ్చిన రవి కె.మెహరోత్రా అసాధారణ కెరీర్ ఎంపిక చేసుకుంటాడు. అతను ఒక మెరైన్ ఇంజనీర్. ప్రపంచమంతా ప్రయాణిస్తాడు. ఇరాన్ లో ఇస్లామిక్ రివల్యూషన్ ముందర, తర్వాత అతని కధ చాలా ఆసక్తికరంగా వుంటుంది. మెరైనర్ స్ధాయి నుండి ఒక పెద్ద షిప్పింగ్ కార్పోరేషన్ కంపెనీకి యజమాని అవటం కధలో ఆసక్తి కలిగిస్తుంది. ఈ భారతీయ గ్రంధకర్త చెప్పాలనుకునేదల్లా ఒక హాబీని కెరీర్ గా ఎలా మలచుకోవచ్చు అనేది.

 What's In It For You: Book Review

గ్రంధకర్త రవి కె. మెహరోత్రా, యాజమాన్య నైపుణ్యాలు మరియు వ్యాపార వ్యూహాలు తన జీవిత కధలో భాగంగా చేసుకున్నాడు. అది ఒక సాధారణ పేదరికం నుండి ధనవంతులయ్యే కధ కాదు. గ్రంధకర్త వ్యక్తిగత విజయాలు వున్నాయి. వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ యూ లోని అంశాలు జీవితాన్ని ప్రతిబింబిస్తూ నమ్మశక్యంగానే వున్నాయి.

పుస్తకం బాగానే ఎడిట్ చేయబడింది. చాలా సామాన్యంగాను, ఆసక్తికరంగాను వుంది. ఉదాహరణకు, మీ సంస్ధలోకి కుటుంబ విలువలు ఎలా తీసుకురావాలనేది. వీటిని అదివరకు వివిధ రకాలుగా తెలిపారు. కాని రచయిత చెప్పినట్లు ‘‘ప్రపంచంలో ఒత్తిడి ఎంత ఉన్నప్పటికి చక్కగా సాగే వ్యవస్ధ ఏమంటే కుటుంబమే ’’ అంటాడు. ఈ అంశం మీకు తెలిసిన వాస్తవమే అయినప్పటికి ఎప్పటికి అర్ధం చేసుకోనిదిగానే వుంటుంది.

వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్యూ పుస్తకంలో ప్రతి ఒక్కరికి ఎంతోకొంత మంచి మార్గదర్శకత తప్పక దొరుకుతుంది. కనుక మీ హాబీలను మంచి కెరీర్ లు గా మలచుకోటానికిగాను ఈపుస్తకం తప్పక కొనాలి.

English summary

What's In It For You: Book Review | వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ యూ? (అందులో మీకేముంది?): పుస్తక సమీక్ష


 The book is very well edited, incredibly simple and lucid. For example, the point about bringing family values into your organisation. It has been said in various complicated ways before. But when the author says, “With all the tension in the world, the best survival system is that of the family.” It suddenly hits you as the truth you have known all along but never understood.
Story first published: Saturday, April 28, 2012, 9:40 [IST]
Desktop Bottom Promotion