మీ రాశిచక్రం ప్రకారం పెళ్లి చేసుకోవడానికి, ఇదే మంచి వయస్సు !

Subscribe to Boldsky

బహుశా, మీరు మీ రాశిచక్రం బట్టి మీ వ్యక్తిత్వానికి సంబంధించినది ఏమిటో మీరు చదివివుండవచ్చు, కానీ మీరు వివాహం చేసుకోవాల్సిన వయస్సు గురించి అది ఎప్పుడైనా చెప్పిందా అని ఆలోచిస్తున్నారా?

ఆసక్తికరంగా, మీ రాశిచక్రం బట్టి వివాహం చేసుకోవటానికి ఉత్తమ వయస్సుని అంచనా వేయవచ్చు, మరియు ఆసక్తిని రేకెత్తించే అంచనాలు చాలా ఉంటాయి. చదివి తెలుసుకోండి..

మేషం :

మేషం :

ఇందులో సూర్యుని ఆధిపత్యంలో జన్మించిన ప్రజలు ముందస్తు ఆలోచనలు లేకుండా ఉంటారు మరియు చాలా వరకు మీ ఆలోచనలో లేని చాలా విషయాలు - మీ ముందున ఉంటాయి. ఇరవైల చివరలో (లేదా) ముప్ఫైల ప్రారంభంలో బహుశా మీరు ఒక తొందరపాటు నిర్ణయం తీసుకోవడంతో ముగుస్తుంది. కాబట్టి మీకున్న మంచి సమయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యము.

వృషభం :

వృషభం :

మీ యొక్క వివాహ బంధంలో, మీరు నమ్మకమైన మరియు శృంగార వాంఛ గల వ్యక్తి. మీరు మానసికంగా మీతో కనెక్ట్ కాగల భాగస్వామి కోసం ఏదురు చూస్తారు, మరియు అతన్ని (లేదా) ఆమెను గుర్తించడానికి ఎలాంటి ఆతృతను కలిగి ఉండరు. మీరు కోరుకున్న వ్యక్తి కోసం - మీరు కట్టుబాట్లను కలిగివుంటారు. అలాగే మీకు కావల్సిన 'ఆ వ్యక్తి' మీకు ఎదురైనప్పుడు, వయస్సు అనేది మీకు కేవలం ఒక సంఖ్య మాత్రమే.

మిధునం :

మిధునం :

మీలోని 'ద్వంద్వ' వైఖరి - మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి కష్టతరం చేస్తుంది. మీరు ఒక బంధాన్ని కలిగి ఉండాలి అనే ఆలోచనను ఇష్టపడతారు, కానీ అందులో ఉన్న ఆనందం ఒక్కసారిగా వాడి పోయినట్లయితే మీరు ఆ బంధానికి దూరంగా పరిగెడతారు. మీరు ఎదురు చూసే వ్యక్తి గురించి సాధ్యమైనంతవరకు ప్రారంభ ముప్ఫై వరకూ ఎదురుచూసి, ఆ తర్వాత మీ ఛాయిస్ను మార్చుకుంటారు.

కర్కాటకం :

కర్కాటకం :

వివాహ బంధం గురించి మరియు మీకంటూ ఒక కుటుంబాన్ని కలిగి ఉండాలనే ఆలోచనను ఇష్టపడతారు. మీ బంధం చివరి వరకు నిలచి ఉండాలని చాలా ఎక్కువగా శ్రమ పడతారు మరియు ఎలాంటి అవగాహన లోపం లేకుండా చిత్తశుద్ధిగా వ్యవహరిస్తారు. మీ ఆదర్శ వివాహం మీ ఇరవయ్యో ప్రాయం మొదట్లోనే ప్రారంభమౌతుంది.

సింహం :

సింహం :

వివాహం గూర్చి మీరు వ్యక్తిగతంగా చాలా ఇష్టపడతారు మరియు మీరు కోరుకున్న వ్యక్తి గురించి ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే కమిట్మెంట్ ను ఇవ్వండి. మీరు సమర్థతమైన భాగస్వామితో స్థిరపడటానికి సరైన ఎంపికను చెయ్యకపోతే, మీరు ఒంటరిగా మిగిలిపోతారు. ఇరవైల చివరలో (లేదా) ముప్ఫైల ప్రారంభం వరకు మీ భాగస్వామి కోసం వేచి ఉండండి, కానీ ఒకసారి మీరు సరైన వ్యక్తిని కలిసేటప్పుడు, మీరు ఆవ్యక్తితో సంతోషంగా జీవితకాలం ప్రయాణం చేస్తారు.

కన్య :

కన్య :

మీరు ప్రతిచోటా పరిపూర్ణత కోసం చూస్తారు మరియు జీవితంలో సరైన బ్యాలెన్స్ను పొందటానికి ఇష్టపడతారు. మీరు మీ 'పరిపూర్ణ' భాగస్వామిని కనుగొని, వృత్తిపరంగా మీ భాగస్వామితో సంతోషంగా ఉండగలను అని అనుకున్నప్పుడు మాత్రమే వివాహానికి అంగీకరించగలరు. ఇరవైల చివరలో మీ వివాహానికి మంచి సమయముగా ఉన్నది.

తుల :

తుల :

"వివాహము" అనే భావన మిమ్మల్ని ఆకర్షిస్తుంది, మరియు దీర్ఘకాలిక నిబద్ధతను (కమిట్మెంట్) కలిగి ఉండటం మీకు సమస్య కానే కాదు. కానీ ఈ వైఖరి వల్ల మీరు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కొంత సమయం పాటు మీ నిజమైన ఆత్మ-బంధువు కోసం వేచి చూడండి. మీ వివాహానికి ఆదర్శమైన వయస్సు 20 వ యేట నుంచి మొదలవుతుంది.

వృశ్చికం :

వృశ్చికం :

మీరు ఒక అభిరుచిని (ఫ్యాషనేట్) కావాలనుకునే ప్రేమికుడు. మీ కోసం చెప్పాలంటే, మీకు సరైన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఉంది. మీరు మీ ఆత్మ-బంధువును కనుగొన్నట్లుగా మీరు భావించిన్నప్పుడే వివాహం గూర్చి ఆలోచించాలి. బహుశా ముప్ఫైల ప్రారంభంలో మీకు వివాహ యోగం ఉంది.

ధనుస్సు :

ధనుస్సు :

మీరు ఏ బంధాలలోనైన విసుగు చెందే లక్షణాలను కలిగి ఉంటారు కనుక వివాహ విషయములో కూడా మీకిది వివాదాస్పద అంశం కావచ్చు. మీరు ప్రతిచోటా సాహసమును మరియు థ్రిల్ కోసం వేచి చూస్తారు, మరియు ఆసక్తిని కోల్పోయిన విషయాలకు దూరంగా ఉండి తప్పించుకోవడానికి ఎదురుచూస్తారు. మీరు ఏ నిర్ణయం తీసుకోవడానికైన, అందుకు తగ్గా సమయాన్ని తీసుకోవాలి మరియు మీరు ముప్ఫైల మధ్యలో స్థిరపడతారు.

మకరం :

మకరం :

మీరు ధనుస్సురాశి వారి వలె కాకుండా, నిబద్ధత అనే ఆలోచన మిమ్మల్ని భయపెట్టదు. మీరు కెరీర్ పరమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు కానీ, ప్రొఫెషనల్ కెరీర్ని - వ్యక్తిగత జీవితంతో ముడి వెయ్యరు. మీరు నమ్మకమైన మరియు అంకితభావం గల భాగస్వామి, మరియు ఇరవైల చివరలో, మీరు ముడి కట్టడానికి అనుకూలమైన సమయము.

కుంభం :

కుంభం :

మీరు మీ స్వేచ్ఛను ప్రేమిస్తారు మరియు దానిని ఇక వేరేదాని కోసం సులభంగా వదులుకోరు. మిమ్మల్ని మీరుగా గౌరవించి, మీలాంటి అభిప్రాయ ధోరణిని కలిగి ఉన్న భాగస్వామి కోసం మీరు ఎదురు చూడాల్సి ఉంటుంది. దీనికి కొంత సమయం పట్టవచ్చు, కానీ మీరు కొన్ని విషయాలలో పరిగెత్తే మాట ఏమిటి మారి ? మీరు ఏ వయస్సులోనైనా మీ భాగస్వామిని కనుగొనవచ్చు.

మీనం :

మీనం :

మీరు పగటి కలలు కనేవారు మరియు ఆదర్శవంతమైన బంధం కోసం కలలను కనే వారిగా ఉంటారు. ఒక బంధం గురించి మీరు కలిగి ఉన్న అభిప్రాయాన్ని అర్థం చేసుకుని - వాస్తవంగా అలా వ్యవహరించే భాగస్వామి కోసం ఎదురుచూడాలి. అంతేకాకుండా, మీరు అధికమైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. కాబట్టి, మీ ప్రయత్నాలు సరైన రీతిలో సఫలీకృతం కాకపోతే, మీకు ఖచ్చితంగా కావలసిన జీవిత భాగస్వామిని కనుగొనడానికి కాస్త ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    This is the best age to get married, according to your zodiac sign

    You might have probably read what your zodiac sign says about your personality, but have you ever wondered what it has to say about the age you should get married? Interestingly, your zodiac sign can predict the ideal age to get married, and the predictions are quite interesting. Read on…
    Story first published: Thursday, November 16, 2017, 9:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more