For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Maternal Mortality Ratio Drops: దేశంలో 130 నుండి 97కు తగ్గిన మాతాశిశు మరణాల నిష్పత్తి

భారత దేశంలో మాతాశిశు మరణాల నిష్పత్తి తగ్గింది. ఈ మరణాల నిష్పత్తి 130 నుండి 97కు పడిపోయింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్ 2018-2020లో మాతాశిశు మరణాల నిష్పత్తి 97కు పడిపోయింది.

|

Maternal Mortality Ratio Drops: భారత దేశంలో మాతాశిశు మరణాల నిష్పత్తి తగ్గింది. ఈ మరణాల నిష్పత్తి 130 నుండి 97కు పడిపోయింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్ 2018-2020లో మాతాశిశు మరణాల నిష్పత్తి 97కు పడిపోయింది. ఈ నిష్పత్తి 2014-2016 లో లక్షకు 130 ఉండగా.. అది ఇప్పుడు 97కు తగ్గడం విశేషం. 2018-2020 మధ్య కాలంలో దేశంలోని ప్రసూతి మరణాల స్థాయిని పేర్కొంది.

Indias maternal mortallity ratio drop from 130 to 97 in 2018-2020 know the details in Tellugu

నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన వివిధ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల వల్లే మాతా శిశు మరణాలు తగ్గాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.

ఒక ప్రాంతంలో మాతా శిశు మరణాలు ఆ ప్రాంతంలోని స్త్రీల పునరుత్పత్తి ఆరోగ్యానికి కొలమానంగా భావిస్తారు. పునరుత్పత్తి వయస్సు గల చాలా మంది మహిళలు గర్భం, ప్రసవం లేదా అబార్షన్ సమయంలో అలాగే తర్వాత సమస్యల కారణంగా మరణాలు సంభవిస్తాయి. ప్రసూతి మరణం అనేది గర్భవతిగా ఉన్నప్పుడు లేదా ప్రసవం అయినా 42 రోజుల్లోపు, గర్భం, దాని నిర్వహణలో లోపాల వల్ల జరిగే మరణాన్ని ప్రసూతి మరణంగా నమోదు చేస్తారు. అయితే ప్రమాదవశాత్తు లేదా యాదృచ్ఛిక కారణాల వల్ల సంభవించే మరణాన్ని ప్రసూతి మరణంగా పేర్కొనడం లేదు.

Indias maternal mortallity ratio drop from 130 to 97 in 2018-2020 know the details in Tellugu

ఐక్యరాజ్య సమితి నిర్దేశించి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో 3.1 ప్రపంచ ప్రసూతి మరణాల నిష్పత్తిని లక్షా సజీవ జననాలకు 70 కంటే తక్కువకు తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం, జనాభా గణనను నిర్వహించడం, దేశంలో జనన మరణాల నమోదు చట్టం అములును పర్యవేక్షించడంతో పాటు, నమూనా నమోదు వ్యవస్థను ఉపయోగించి సంతానోత్పత్తి మరియు మరణాలపై అంచనాలను అందిస్తోంది.

English summary

Indias maternal mortallity ratio drop from 130 to 97 in 2018-2020 know the details in Tellugu

read on to know Indias maternal mortallity ratio drop from 130 to 97 in 2018-2020 know the details in Tellugu
Story first published:Wednesday, November 30, 2022, 10:19 [IST]
Desktop Bottom Promotion