For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీ చేతి గీతలు.. మీ రాతను సూచిస్తాయా ?

  By Nutheti
  |

  కొంతమంది ఆస్ట్రాలజీని నమ్ముతారు.. మరికొంతమంది కొట్టిపారేస్తారు. అయితే.. అరచేతిలో ఉండే రేఖల సంగతులు తెలుసుకోవడానికి ఈ రెండు కేటగిరీలు అవసరం లేదు. అరచేతిలో దాగిన ఎన్నో ఆశ్చర్యకర విషయాలు తెలుసుకోవాలనుకునే వాళ్లు.. తప్పకుండా ఈ స్టోరీ చదవాల్సిందే.

  అరచేతిలో ఏం దాగుందో అన్న క్యూరియాసిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. రకరకాల వయ్యారాలు, వంపులు తిరిగిన గీతలతో నిండిన అరచేయి పలు ప్రశ్నలు సంధిస్తూ ఉంటుంది. అయితే.. మీ అరచేతిలో ఎలాంటి రేఖలున్నాయి.. ఏ గీత ఏం చెబుతోందో.. చేతి గీతలు.. మీ రాతను సూచిస్తున్నాయా ? అని తెలుసుకోవాలని ఉందా అయితే.. మీరే చూసి చెక్ చేసుకోండి..

  hand
  త్రిభుజాకారం

  త్రిభుజాకారం

  మీ అరచేతిలో సన్ లైన్ ద్వారా త్రిభుజం.. అంటే ఉంగరం వేలు నుంచి ఒక గీత.. మీ వైపుగా ఏర్పడితే దాన్ని సన్ లైన్ అంటారు. దాని ద్వారా త్రిభుజాకారం కనిపిస్తే.. మధ్య వయసులో మీరు కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారని ఆస్ట్రాలజీ చెబుతోంది. సన్ లైన్ ను అపోలో లైన్ ను డివైడ్ చేసే రేషియోని బట్టి కీర్తి గడించే వయసును కూడా చెప్పవచ్చు.

  వ్యతిరేక గుర్తులు

  వ్యతిరేక గుర్తులు

  అరచేతిలో వ్యతిరేక గుర్తులు, మార్క్స్ ఉంటే.. ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కష్టాలు జీవితకాలం ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని రకాల గుర్తులు ఇబ్బందుల నుంచి ఏ సమయంలో, ఎప్పుడు బయటపడతారు అని తెలుపుతాయి. ఇప్పుడు ఎలాంటి గుర్తులు ఏం సూచిస్తాయో చూద్దాం.

  MOST READ:ఎడమవైపు తిరిగిపడుకోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

  చీలికలు

  చీలికలు

  అరచేతిలో ఎక్కువగా పగుళ్లు కనిపిస్తూ ఉంటాయి. పెద్ద లైన్లు, చిన్న గీతలు రెండు అక్కడకక్కడ విడిపోతూ కలుస్తూ.. ఉంటాయి. ఇలా గీతల మధ్య కనిపించే బ్రేక్స్ వ్యతిరేక, అనుకూల మార్పులను సూచిస్తాయి. బొటనవేలు వైపుగా ఏర్పడే గీత వాళ్ల వృత్తిలో జరిగే మార్పును సూచిస్తుంది. అదే గీత పైకి అంటే బొటనవేలు వైపు వెళ్తూ.. అరచేతి చివరకు వెళ్తే.. అనుకోని ప్రయాణాన్ని తెలుపుతుంది. కిందివైపుకి గీత వెళ్తుంటే.. అనుకోని మలుపుకు సంకేతం.

  చైన్స్

  చైన్స్

  చైన్స్ మాదిరిగా.. చేతిలో రేఖలు ఉంటే... జీవితంలో చాలా అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తాయి. వీళ్ల జీవితంలో కఠినమైన చిన్నతనం.. లేదా కఠినమైన పెంపకం ఉంటుంది. వీరి జీవితంలో ప్రేమ వ్యవహారం ఉండొచ్చు. ఆరోగ్య సమస్యలను కూడా చైన్స్ రేఖలు సూచిస్తాయి. ఒకవేళ చైన్ మార్కింగ్స్ చేతిలో పొడవుగా ఉంటే.. సమస్యలు కూడా ఎక్కువ కాలం అంటిపెట్టుకుని ఉంటాయి.

  క్రాస్

  క్రాస్

  అరచేతిలో క్రాస్ గుర్తులున్నాయంటే.. మీకు ఇబ్బందులు ఉంటాయని ఆస్ట్రాలజీ చెబుతోంది. ఈ సంకేతాలు.. కొన్ని సందర్భాల్లో తీవ్రంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తున్నాయి.

  గ్రిల్స్

  గ్రిల్స్

  అరచేతిలో ఉండే ఈ గ్రిల్స్.. సమస్యలు, రాజీపడటాన్ని సూచిస్తాయి. ఈ గుర్తులు చేతిలో ఉండేవాళ్లు ఎక్కువగా తికమకపడుతుంటారు. అభద్రతా భావం ఫీలవుతుంటారు. దీనివల్ల వాళ్లు ఉద్యోగరీత్యా ఎదుగుదలకు అవరోధంగా మారుతుంది. గ్రిల్స్ గుర్తులు చేతిలో ఉన్న వాళ్లలో చిరాకు, ఆందోళన, అలసట ఎక్కువగా కనిపిస్తాయి.

  MOST READ:మలబద్దకం సమస్యకు అసలైన కారణం ఈ ఆహారాలే...

  ఐలాండ్స్

  ఐలాండ్స్

  చేతిలో ఐలాండ్స్ ని తలపించేలా గుర్తులుంటే.. వాళ్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా.. బంధాలు ఏర్పరచుకోలేరు. వీళ్లకు అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి. త్వరగా అలసిపోతారు.

  స్టార్స్

  స్టార్స్

  స్టార్స్ గుర్తులు మీ అరచేతిలో ఉంటే మీ జీవితం చాలా అద్భుతంగా ఉన్నట్లే. ఒకవేళ స్టార్ కుడివైపు ఉంటే.. వాళ్లకు పెద్ద సమస్య వస్తుందని.. ఒకవేళ స్టార్ గీత చివర్లో ఉంటే.. వాళ్లకు మంచి గుర్తింపు, గౌరవం దక్కుతుందని వివరిస్తుంది.

  చతురస్రాకారం

  చతురస్రాకారం

  చతురస్రాకారంలో గుర్తులు ఉంటే.. మంచిదే కానీ.. అవి.. రేఖల మధ్యలో ఉండాలి. ఇవి అదృష్టాన్ని సూచిస్తాయి. చేతిలో ఈ గుర్తులున్న వాళ్లు గురువులుగా మారుతారు. ఒకవేళ రేఖల మధ్యలో లేకుండా.. విడిగా ఉంటే.. మంచిదికాదని సూచిస్తోంది.

  English summary

  What secrets in your palm ?

  If you take a keen look at your palm, you will notice there are many markings and formations within the palm. These markings are symbols that are positive or negative interruptions or blockages within the flow of natural lines in the palm, fingers and mounts.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more