Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
మరణశిక్షకు ముందు వీళ్లు అన్న మాటలు నవ్వు తెప్పించినా....
అప్పట్లో మరణ శిక్షలు అమలుపరిచేటప్పుడు చాలా మందికి అది బాధను కలిగించేది. మరి కొంత మంది జీవితాలనే మార్చివేసేది. మరణశిక్ష అమలుపరిచేవారు చాలా డిస్ట్రబ్డ్‌గా ఉండిపోతారు. చనిపోయే ముందు వారు పడే యాతనను కళ్లారా చూసినవారికి నిద్రలేని రాత్రులెన్నో గడుపుతారు.

కొందరు ఖైదీలు తమ మరణశిక్ష పొందేముందు కొన్ని జోక్స్ వేశారు. అవి ఎలా ప్రభావవంతం చూపించాయో తెలుసుకుందాం.

ఓ ఖైదీని ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చంపేముందు...
జెంటిల్‌మ్యాన్ .. కాసేపట్లో మీరు బేక్ చేసిన యాపిల్‌ను చూస్తారు అని జార్జ్ యాపిల్ అనే వ్యక్తి చమత్కరించాడు. 1928లో పోలీసు అధికారిని హత్యచేసినందుకు ఆయనకు మరణ శిక్షను విధించారు.

తొందరగా ఉరితీయండి
అవును తొందరగా ఉరి తీయి బాస్టర్డ్ ! మీ మనుషులు తిరుగుతుండగానే డజను మందిని చంపేయగలను. ఇది కార్ల్ పాన్‌జ్రామ్ అనే వ్యక్తి అన్నాడు. అతడు 22 మర్డర్లు చేశాడు. అంతేకాదు 1000 మంది స్త్రీలను దారుణంగా అత్యాచారం చేశాడన్న అభియోగాల మీద అతడికి 1930లో ఉరిశిక్ష ఖరారుచేశారు.

ఫ్రెంచ్ ఫ్రైస్!
రేపటి దినపత్రికలో ఫ్రెంచ్ ఫ్రైస్ అనే పతాక శీర్షిక ఎలా ఉంటుంది? ఈ మాటా అన్నది డి. ఫ్రెంచ్ అనే వ్యక్తి. అది దారుణంగా హత్యచేసిన కారణంగా అతడ్ని 1966లో ఉరితీశారు.

దేవుడికి ఇంకొకరు దొరికారు...
మరణ శిక్ష పొందే ముందు ఇది చెబుతూ వెళ్లాడు జాన్ స్మిత్ అనే వ్యక్తి. అతడు తన భార్యతో కలిసి ఓ జంటను హత్య చేశారు. అదీ ఇన్సూరెన్స్ డబ్బు కోసం. ఇది జరిగింది 1983లో.

నా స్టంట్ డబుల్ ఎక్కడ?
విన్‌సెంట్ గిట్రెజ్ అనే వ్యక్తి మరణశిక్షకు కొన్ని నిమిషాల ముందు ఇది అన్నాడు. అతడు ఒక బాధితుడి కారును దొంగిలించి పారిపోతుంటే వెంటపడిన యాజమానిని కాల్చిచంపేశాడు. దోషిని 2007లో విషపూరితమైన ఇంజెక్షన్ ఇచ్చి మరణ శిక్ష అమలుపరిచారు.

నాకు ఇది తగినది..
మరణం నన్ను స్వతంత్రుడిని చేస్తుంది. ఇదే అతిపెద్ద జోక్. నాకు మరణశిక్షే తగినది. మరో జోక్ ఏమిటంటే అందరూ నన్ను ప్యాట్రిక్ బ్రయాన్ నైట్ అని పిలుస్తున్నారు. కానీ మరణశిక్షను మాత్రం ఆపలేరు. ప్యాట్రిక్ ఒక జంటను హత్యచేసినందుకుగాను ఈ శిక్షను ఖరారు చేశారు. 2007లో అతడికి విషపూరితమైన ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్షను అమలుపరిచారు.



Click it and Unblock the Notifications