మీరు ఎంచుకున్న కన్ను యొక్క అర్థం ఏమిటో తెలుసుకోండి

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

చాలా సమయాల్లో, మీ దృష్టిని కొన్ని విషయాలు ఆకర్షించినప్పుడు, అనుకోని సమయంలో మీరు దాని సమీపానికి వెళ్ళిన కారణంగా (లేదా) మీలోని అసంకల్పిత స్థితి కారణంగా మీ చుట్టూ ఉన్న విషయాలను ఎలా చూస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది.

ఇక్కడ ఉన్న 7 విభిన్న రకాల చిత్రాలు ఉన్నాయి మరియు మీరు చేయవలసినది ఏమిటంటే, అందులో ఒక్క కన్నును ఎంచుకొని - అది ఏమి సూచిస్తుందో తెలుసుకోండి.

హగ్గింగ్ స్టైల్ బట్టి, ఎదుటివారి వ్యక్తిత్వాన్నితెలుసుకోవచ్చు..!!

ఇలా వేర్వేరు రకాలుగా ఉన్న కన్నులు - వాటితో (కన్నులతో) సంబంధం కలిగి ఉన్న వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గూర్చి ఒక ప్రత్యేకమైన అర్ధమును కలిగి ఉంటాయి, అలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఆ వ్యక్తికి కూడా సరిగ్గా తెలియకపోవచ్చు.

కాబట్టి, మీరు దేని కొరకు వేచి చూస్తున్నారు?

ఇక్కడ ఉన్న కొన్ని చిత్రాలలో ఒక దానిని ఎంచుకొని, మీకు తెలియని కొత్త విషయాలను గురించి తెలుసుకోండి !

1వ కన్ను : పూర్తిగా అభిరుచితో నిండిపోయినది

1వ కన్ను : పూర్తిగా అభిరుచితో నిండిపోయినది

మీరు ఈ కన్నును ఎన్నుకుంటే, మీ కన్నులో దాగి ఉన్న అగ్ని ప్రకాశవంతమైనదని మరియు మీ ప్రవృత్తి సజీవంగా మరియు ఆకలితో ఉన్నాయని అర్థం. మీరు సాహసోపేతంగా అనుభూతిని చెందిన్నప్పుడు, అది మీలోని ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. గతంలో మీకు జరిగిన దాని గురించి మీరు ఆగ్రహానికి గురయ్యారు మరియు మీరు దానిని అంత సులభంగా వదలలేరు.

2వ కన్ను : మీ విజయ రహస్యం

2వ కన్ను : మీ విజయ రహస్యం

ప్రస్తుతం మీరు కలిగివున్న మంచి-వ్యక్తిత్వం కోసం, మీరు చాలా త్యాగాలను చేసి ఉంటారు. మీ జీవితంలోని కొన్ని సొంత అనుభవాలు, మిమ్మల్ని తెలివైనవారిగా మరియు బలమైనవారిగా చేస్తాయి. మీ జీవితంలో చాలా సమయాల్లో సృజనాత్మకతను కలిగి ఉన్నారు. ఎందుకంటే, ప్రతిసారీ మీరు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నారు.

3వ కన్ను : ప్రకృతి ప్రసాదించిన బలము

3వ కన్ను : ప్రకృతి ప్రసాదించిన బలము

మీ శక్తి ఎల్లప్పుడూ ప్రకృతి ప్రసాదించినదిగా ఉంటూ, మీకు స్వస్థత చేకూరేందుకు గొప్ప శక్తులను అనుగ్రహిస్తుంది. ప్రజలకు మీ ద్వారా స్వస్థత చేకూరగలదని తెలుసుకొని మీ వైపు ఆకర్షితులవుతారు. మీకు నా శక్తులను ఉత్తమమైన మార్గం ఉపయోగించినప్పుడు కలిగే ఆనందము మరియు ప్రశాంతతను బట్టి, "లైట్ హౌస్" లా మీ సామర్థ్యము మరింతగా పెరుగుతుంది.

4వ కన్ను : సూక్ష్మంగా పరిశీలించుట

4వ కన్ను : సూక్ష్మంగా పరిశీలించుట

మీరు ఎల్లప్పుడూ మీ చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోవడం కోసం మరింతగా ప్రయత్నిస్తారు. మీరు ప్రతీ విషయాన్ని లోతుగా అర్ధం చేసుకోవడం కోసం ప్రయత్నించి చూడండి. మీరు వేర్వేరు గమ్యాలకు సంబంధించిన మార్గాలను ఎంపిక చేసుకున్నట్లయితే, మీ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకొని - మీరు ఆశ్చర్యపోతారు. అందువల్ల మీరు చేయవలసిన అనేక విషయాలలో మీరు పరిపూర్ణుడుగా తయారవుతారు.

అరచేతిలో హైలైట్ అయ్యే మూడు గీతలు చెప్పే సీక్రెట్స్..!!

5వ కన్ను : చిక్కుముడిని విడదీయటం

5వ కన్ను : చిక్కుముడిని విడదీయటం

మీరు ఒక ప్రమాదంలో ఉన్నట్లయితే, మీ చుట్టూ ఉన్న విషయాలను మార్చటానికి మీరు ఇష్టపడుతారు. అలాంటప్పుడు ఇతరుల వద్ద "ఏమి దాచాలో మరియు ఏమి చూపించాలో" మీకు తెలుసా ! ఇది మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా చేయని ఒక విషయము, కానీ ఇలా ఇప్పటికీ ఇంకా జరగవచ్చు.

6వ కన్ను : ఆకర్షవంతమైన వ్యక్తిత్వము

6వ కన్ను : ఆకర్షవంతమైన వ్యక్తిత్వము

మీ చురుకైన మరియు మర్మమైన వ్యక్తిత్వంతో, మీరు మీ చుట్టూ ఉన్న ఇతరులను వ్యక్తులను ఆకర్షిస్తారు. మీరు ఆకర్షవంతమైన వ్యక్తిత్వముతో చాలా ప్రభావవంతులుగా ఉంటారు కాబట్టి, మీరు ఎల్లప్పుడూ గుంపులో గమనించబడతారు. మీలోని మీకు తెలియని అనేక ప్రత్యేకమైన శక్తులు కలిగి ఉన్నారనే నిజాన్ని మీరు అర్థం చేసుకోవాలి.

7వ కన్ను : నిరంతరము జాగ్రత్తపడటం

7వ కన్ను : నిరంతరము జాగ్రత్తపడటం

మారువేషాలు వేయడంలో మీకు మీరే బాస్. మీరు గొప్ప జ్ఞానాన్ని మరియు సున్నితమైన సమాచారాన్ని సేకరించడంలో మీరు గొప్ప యోధులు. కొన్ని పరిస్థితులకు అనుగుణంగా ఇతరులు ఎలా స్పందిస్తారో గమనించడానికి మీరు ఇష్టపడతారు. మీరు చాలా నిజాయితీని కలిగి ఉన్నప్పటికీ, ఇతరులు మీ గురించి ప్రతిదీ తెలుసుకోవాలని మీరు మాత్రం కోరుకోరు.

కాబట్టి మీరు దేనిని ఎంచుకున్నారు? దిగువ వ్యాఖ్య విభాగంలో మాకు తెలియజేయండి.

English summary

Select An Eye And Know What It Means

These games enlighten us about our own unknown side…
Story first published: Sunday, November 12, 2017, 15:00 [IST]
Subscribe Newsletter