మీ రాశి ప్రకారం మీరిలా ప్రవర్తిస్తారు

Written By:
Subscribe to Boldsky

భూమి, ఆకాశము, వాయువు, నీరు, నిప్పులను పంచభూతాంటారు. అయితే ఇందులో ఆకాశం తప్ప మిగతావన్నీ మనపై ప్రభావం చూపుతూనే ఉంటాయి. వాటి ఆధారంగా మన ప్రవర్తన ఉంటుందట. భూమి, గాలి, నీరు, అగ్నిలతో మన రాశులకు సంబంధం ఉంది. ఈ నాలుగు అంశాలు ప్రతి రాశిపై ప్రభావం చూపుతాయి. ఒక్కో రాశి ఒక్కో అంశానికి చెందినది అయి ఉంటుంది. దాన్ని బట్టి ఏ రాశి వ్యక్తి ఎలాంటి స్వభావం, పర్సనాలిటి కలిగి ఉంటారో తెలుసుకోవొచ్చు.

అగ్నికి సంబంధించిన రాశులు

అగ్నికి సంబంధించిన రాశులు

మేషం, సిహం, ధనుస్సు రాశులను అగ్నిక సంబంధించిన రాశులుగా పేర్కొంటారు. ఈ సంకేతాలు ఒకదానికొకటి అత్యంత అనుకూలమైనవని చెప్పబడుతున్నాయి, అవి ఒకే ఆవేశపూరిత ఆత్మ కలిగివుంటాయి.

మేషం - అగ్ని

మేషం - అగ్ని

మేషరాశివారిపై అగ్ని ప్రభావం ఉంటుంది. అందువల్ల వీరు ఎప్పుడూ ఉత్తేజంగా ఉంటారు. వీరు మంచి ఎనర్జీ కలిగి ఉంటారు. వీరు ఏమి ఆలోచించకుండా పనులు మొదలుపెడతారు. ఈ విషయంలో మాత్ర వీరు అప్పుడప్పుడు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సింహరాశి - అగ్ని

సింహరాశి - అగ్ని

సింహరాశిపై కూడా అగ్ని ప్రభావం ఉంటుంది. వీరికి సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధిస్తాం అనే భావన వీరిలో ఉంటుంది. వీరికి సంకల్ప బలం ఎక్కువ. తమ స్టాటస్ ను కాపాడుకోవడానికి వీరు పరితపిస్తుంటారు.

ధనస్సు - అగ్ని

ధనస్సు - అగ్ని

ధనస్సు రాశిపై కూడా అగ్ని ప్రభావం ఉంటుంది.

వీరు ఏదైనా పని ప్రారంభించే విషయంలో కాస్త ఆందోళన చెందుతుంటారు. అయితే తాము చేసే పనిని కచ్చితంగా సాధిస్తామనే నమ్మకం వీరిలో ఉంటుంది.

భూమికి సంబంధించిన రాశులు

భూమికి సంబంధించిన రాశులు

వృషభం, కన్య, మకర రాశి వారికి భూమికి సంకేతాలు.

వృషభం : భూమికి సంబంధించిన ఈ రాశి వారిలో కాస్త మొండితనం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఇతరులపై కాస్త అసూయ ఉంటుంది.

అయితే వీరు ఎవరినైనా నమ్మితే చాలా విశ్వాసంగా ఉంటారు.

కన్య - భూమి

కన్య - భూమి

వీరిలో కూడా కాస్త మొండితన ఉంటుంది. వీరు చాలా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అందరితో కలిసిపోయే గుణం వీరికి ఉంటుంది. వీళ్లు చాలా సెక్సీ ఆలోచనలు కలిగి ఉంటారు. వీరు చాలా రొమాంటిక్ గా ఉంటారు.

మకరం - భూమి

మకరం - భూమి

వీళ్లు తాము చేసే పనుల్ని నిబద్ధతతో చేస్తారు. వీరికి తెలివి కూడా చాలా ఎక్కువ. మంచి మెచ్యూరిటీ ఉంటుంది. ఇతరులపై వీరికి అసూయ కూడా చాలా తక్కువగా ఉంటుంది.

గాలికి సంబంధించిన రాశులు

గాలికి సంబంధించిన రాశులు

మిథునం, తుల, కుంభం రాశులు గాలికి సంబంధించినవి.

మిథునం : వీరు అందరికీ చాలా అనుకూలంగా ఉంటారు. వీరి ప్రతి విషయంలో మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వీరు కొత్త విషయాలను తెలుసుకోవాలని పరితపిస్తుంటారు. ఎక్కువగా పక్కవారితో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. వీరి చెప్పే మాటలను అవతలి వినాలని కోరుకుంటారు.

తుల - గాలి

తుల - గాలి

వీరు కాస్త సున్నిత మనస్సు కలిగి ఉంటారు. వీరు ప్రతికూల పరిస్థితులన కూడా ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉంటాు. వీరు తమకున్న మేధస్సును ఫ్రెండ్స్ దగ్గర చూపించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు.

కుంభం - గాలి

కుంభం - గాలి

వీరి ప్రతి విషయాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తారు. లాజికల్ గా ఆలోచిస్తారు. హేతుబద్ధంగా ముందుకెళ్తారు. వీళ్లు చాలా మేధావులు. ఈ రాశికి చెందిన చాలామంది వారి రంగాల్లో రాణిస్తారు. వీరి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగల శక్తి కలిగి ఉంటారు.

నీటికి సంబంధించి రాశులు

నీటికి సంబంధించి రాశులు

కర్కాటకం, వృశ్చికం, మీనం నీటికి సంబంధించి రాశులు.

కర్కాటకం : వీరు సాహసవంతులు. వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు.

వృశ్చికం - నీరు

వృశ్చికం - నీరు

వీరు ఎక్కువగా భావోద్వేగానికి గురవుతుంటారు. వీరి చాలాసున్నితమైన మనస్కులు. వీరి ఏ పనినైనా బాగా పట్టుదలతో చేస్తారు. వీరు వారికి నచ్చిన మార్గంలోనే జీవితాన్ని కొనసాగిస్తారు.

మీనం - నీరు

మీనం - నీరు

వీరు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. వీరిలో భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్లు ఇతరుల్ని త్వరగా అపార్థం చేసుకుంటారు. మళ్లీ అసలు విషయం తెలుసుకుని పశ్చాతాపపడతారు. వీరికి ఆవేశం కాస్త ఎక్కువ. భావోద్వేగం ఎక్కువ. ఏ విషయాన్ని అయినా ముక్కు సూటిగా చెబుతారు. వీరు చాలా సున్నితమనస్కులు.

English summary

everything about your zodiac element and your personality

The 12 zodiac signs are placed in their elementary zones, as these zones are divided into 4 categories, which are earth, wind, fire and water.Each of these four elements has characteristics that are independent to each of the twelve astrological signs.