హిజ్రాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన వాస్తవాలు

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

హిజ్రాల గురించి తెలుసుకోవాలని సాధారణ మనుష్యులకు ఎక్కువ ఆతురతగా ఉంటుంది. వాళ్ళు కూడా అందరిలానే మనుష్యులు అనే విషయాన్ని ఎందుకు గుర్తించరు ?

హిజ్రాల గురించి ఆలోచిస్తున్నప్పుడు లేదా వారి గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతాయి. ఈరోజు మనం హిజ్రా యొక్క చరిత్ర గురించి మరియు వారి యొక్క నిజాల గురించి తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన స్వలింగ దేశాలు..!!

ప్రతి ఒక్కరికి హిజ్రాల గురించి ఎన్నో అనుమానాలు. అలాంటి వాటన్నింటిని నివృత్తి చేసుకోవాలంటే ఈ వ్యాసాన్ని క్షుణ్ణంగా చదవండి.

వాళ్ళు చరిత్రలో ఎప్పటి నుండో ఉన్నారు :

వాళ్ళు చరిత్రలో ఎప్పటి నుండో ఉన్నారు :

ఒకసారి చరిత్రను గనుక పరిశీలించినట్లయితే మహాభారతంలో ఉన్నట్లు మరియు కొన్ని ఇస్లాం గ్రంధములలో వీళ్ళు మొగల్ రాజులకు సేవలు చేసినట్లు రాయబడి ఉంది. ముఖ్యంగా హిందువుల నుండి వీళ్ళు ఆవిర్భవించినట్లు చాలా స్పష్టంగా చెబుతున్నా కానీ చరిత్ర ప్రకారం ముస్లింలలో కూడా వీళ్ళు ఉండే వారు, ఈ ఆచారాన్ని పాటించే వారు.

వీళ్ళు చాలా కష్టపడి డబ్బులు సంపాదించేవారు :

వీళ్ళు చాలా కష్టపడి డబ్బులు సంపాదించేవారు :

ప్రస్తుతం ఉన్న సమాజంలో హిజ్రాలు మనుష్యులను లేదా ఏవైనా సంస్థలను బెదిరించి లేదా భయపెట్టి ఒత్తిడి చేసి డబ్బులు లాక్కుంటున్న సందర్భాలు అనేకం కనపడతాయి. కానీ గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఎంతో కష్టపడి పనిచేసేవారు, అందుకు అనుగుణంగా డబ్బులు తీసుకునేవారు. ఒకసారి గతాన్ని గమనించినట్లయితే బాగా డబ్బున్న కుటుంబాల్లో ఉన్న మహిళలకు సంరక్షకులుగా వ్యవహరించేవారు. వారి క్రింద సేవకులుగా పనిచేసేవారు. దీంతో ఆ కాలంలో పాలకులు కూడా వీరిని ఎంతో నమ్మేవారు మరియు వీరి పై ఎంతో నమ్మకం ఉంచేవారు.

వారి యొక్క పునర్జన్మని ఒక గొప్ప వేడుకగా నిర్వహించేవారు :

వారి యొక్క పునర్జన్మని ఒక గొప్ప వేడుకగా నిర్వహించేవారు :

నపుంసకులుగా పుట్టిన తరువాత మళ్ళీ పునర్జన్మ వేడుక చేసేవారు. దీనినే నిర్వాణ అని కూడా అంటారు. ఈ వేడుకలో భాగంగా వారి యొక్క శరీరం నుండి పురుషాంగాన్ని మరియు వృషణాలను తొలగిస్తారు. దీంతో అసమర్థుడైన పురుషుడు కాస్త సమర్ధవంతమైన లేదా శక్తివంతమైన నపుంసకుడు గా మారుతాడు.

ప్రత్యేకమైన ఆహార నియమాన్ని పాటిస్తారు :

ప్రత్యేకమైన ఆహార నియమాన్ని పాటిస్తారు :

నపుంసకులు శక్తివంతమైన నపుంసకులుగా మారే వేడుకకు వెళ్లే ముందు వారు ఒక ప్రత్యేకమైన ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. అందుకు కొన్ని నియమ నిబంధనలు కూడా ఉన్నాయి. ఎలా అయితే ఒక స్త్రీ అమ్మతనాన్ని అప్పుడే పొందినప్పుడు ఒంటరికాలం ఎలా అయితే అనుభవిస్తుందో, అలానే ఒక హిజ్రా కూడా ఈ యొక్క చికిత్స జరిగే 40 రోజుల ముందు నుండి ఈ యొక్క నియమ నిబంధనలను మరియు ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది.

ఓరి దేవుడా! కొలంబియాలో ముగ్గురి (స్వలింగ సంపర్కుల) పెళ్ళి చట్టబద్ధం అయిందట!

వాళ్లకు మానవాతీతమైన సామర్థ్యం ఉందని నమ్మకం :

వాళ్లకు మానవాతీతమైన సామర్థ్యం ఉందని నమ్మకం :

వాళ్ళు భవిష్యత్తులో జరిగే విషయాలు చెప్పగలరు. వాళ్లకు మానవాతీతమైన సామర్థ్యం ఉంది. వీళ్ళు భవిష్యత్తులో జరగబోయే విషయాలను ఊహించి ముందే వాటిని అవగతం చేసుకుంటుంటారు. వీళ్ళు వీరి యొక్క మరణాన్ని ముందే ఊహించగలరని చెబుతారు.

వీళ్ళ మరణం ఒక చీకటి వ్యవహారం :

వీళ్ళ మరణం ఒక చీకటి వ్యవహారం :

వీళ్ళు మరణించిన తర్వాత చాలా తక్కువ మంది మాత్రమే అంత్యక్రియలకు హాజరు అవుతారు. అంతేకాకుండా ఆ అంత్యక్రియల తంతుని కూడా చాలా రహస్యంగా జరుపుతారు. వీళ్ళ అంత్యక్రియలను రాత్రిపూట జరుపుతారని చాలా మంది నమ్ముతారు.

English summary

Everything That You Need To Know About The Origin Of Hijras

They were worshipped at one point and now the world fears about their powers!
Story first published: Wednesday, October 4, 2017, 20:00 [IST]
Subscribe Newsletter