పిచ్చికి పరాకాష్ట: తన వేసిన మర్డర్ ప్లాన్ తో ప్రియుడికి షాక్ ఇచ్చిన ప్రియురాలు

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

చాలామంది వ్యక్తులు సోషల్ మీడియా సైట్లలో "లైక్స్ & షేర్లు" కోసం ఎలాంటి పని చేయ్యడానికైన సిద్ధపడతారు. అలాంటి సంఘటనల్లో - ఇది కూడా ఒకటి.

ఒక అమ్మాయి తన ప్రియుడిని ఫూల్ చెయ్యడం కోసం, తనని తానే హత్య చేసుకున్న ఉదంతం, తారా స్థాయికి చేరింది. ఆమె ఏం చేసిందో తెలుసుకునే ముందు, ఈ విధంగా ఎవరూ ప్రయత్నించవద్దని "మా మనవి" .

వివరాల్లోకి వెళ్తే...

"ఆ జంట గూర్చి"...

ఈ జంట ఒకరి ని ఒకరు బాగా ఆటపట్టించుకుంటూ చేసుకునే ఆకతాయి చేష్టలను వీడియోలుగా తీసి, వారి YouTube (యూ ట్యూబ్) లో ఉన్న సొంత ఛానెల్లో పెట్టగా అవన్నీ బాగా పాపులర్ అయ్యి మంచి ప్రజాదరణ పొందారు. అందులో ఈ సంఘటన మాత్రం రక్తసిక్తంగా ఉండి, కొంచెం భయానకంగా ఉండటంతో ఇంకా బాగా పాపులర్ అయ్యింది.

మిమ్మల్ని.. మీరే చంపుకోవద్దు???

"ఆమె హేయమైన చర్య"...

ఆమె (డెర్రా), తన ప్రియుడు దూరంగా ఉన్నప్పుడు, తన హత్యకు తానే ప్రణాళిక చేసే చెడ్డ ఆలోచనను నిజం చేసేందుకు - ఆ సమయంలో నకిలీ రక్తం తో ఆ ఇంటిని మొత్తాన్ని రక్తమయం చేసేసింది. ఇలా ఆ ఇంటి వాతావరణాన్ని, నిజంగానే హత్య జరిగిందని నమ్మెవిథంగా భ్రాంతిని కలిగించేలా మార్చేసింది.

"ఆమె వెర్రి పరిధిని దాటింది"....

ఎవరో తన మీద దాడి చేసి, తీవ్రంగా గాయపరచారు అనే రీతిలో ఆమె తన శరీరాన్ని మరియు ఆ ఇంటి ప్రాంగణం మొత్తాన్ని కూడా ఈ నకిలీ రక్తం తో భయంకరంగా మార్చేసుకుని, నేల మీద పడుకుని - చనిపోయిన విధంగా నటించడం మొదలు పెట్టింది. ఇది ఆమె వెర్రికి పరాకాష్ట.

"ప్రియుడు ఇంటికి వచ్చినప్పుడు" ...

అతను ఇంట్లోకి వచ్చిన మరుక్షణం, అక్కడ నేలపై ఉన్న రక్తాన్ని చూసిన అతను, ఆమె వద్దకి పరుగులు తీశాడు. అచేతనంగా నేల మీద పడి - చనిపోయినట్లు నటిస్తున్న ఆమె వద్దకు వచ్చి ఏడుస్తూ, ఆమెను కదుపుతూ లేపే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన ద్వారా అతను నిజంగా ఆమెను ఎంతగా ప్రేమించాడో అర్థమవుతుంది..

స్త్రీలు ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు..

"చివరికి ఆమె మేల్కొంది" ...

ప్రియుడి ప్రతిచర్యని చూసి ఆమె తన నవ్వుని ఆపుకోలేక పోయింది, కాని అతను రోదిస్తున్నప్పుడు మాత్రం ఆమె నవ్వలేదు. ఈ ఉద్దంతం మొత్తాన్ని ఆమె కెమెరా లో బంథించింది..

ఇక్కడే ఆ వీడియో లింక్ ని ఇవ్వబడింది.

ఆ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో ఈ క్రింద వ్యాఖ్య విభాగంలో మీ ఆలోచనలను భాగస్వామ్యం చేయండి.

English summary

Extreme Murder Prank Girl Played On Her Boyfriend

A prank could not be worse than this, check out the extreme prank a girlfriend planned on her guy.
Story first published: Friday, July 21, 2017, 20:00 [IST]
Subscribe Newsletter