పబ్లిక్ లో హస్తప్రయోగం చేస్తూ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన యువకుడు..!

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ఈ ప్రపంచంలో అత్యంత దారుణంగా, ఎదో ఒక రకంగా దాడులకు బాధితులుగా మారుతున్నారు, బలవుతూనే ఉన్నారు ఆడవాళ్లు. శిక్షించలేని చట్టాలు, పురుషుల్లో పెరిగిపోతున్న నేరప్రవృత్తి , మహిళలను ఎలాగైనా అనుభవించాలనే పురుష అహంకారం , ఆడవాళ్ళ భవిష్యత్తుని ప్రశ్నార్ధకం చేస్తోంది. తమ నిత్య జీవితంలో జరిగే సంఘటనలు తమను ఎంతో భాద పెట్టినా, ఆడవాళ్లు ఓర్పు, సహనంతో తమ పంటి బిగువున ఆ బాధను భరిస్తూ తమ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో తెలియ చెప్పే ఉదంతం ఇది.

Cha Vinuya harassment

ఫిలిపైన్స్ దేశంలో ఏమి జరిగిందంటే :

"చ వినుయా" అనే అమ్మాయి తన పని ముగుంచుకుని ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో ఒక జీపు ఎక్కింది . ఆ జీపులో తన తో పాటు ఇంకొంత మంది ప్రయాణిస్తున్నారు . తన ప్రక్కన ఒక అబ్బాయి కూర్చున్నాడు. కొద్దీ సేపు తదేకంగా "చు వినుయా" ని చూసిన అతడు అకస్మాత్తుగా తన పురుషాంగాన్ని బయటకు తీసి ఆ అమ్మాయిని చూస్తూ హస్త ప్రయోగం చేయడం ప్రారంభిచాడు. ఈ సంఘటన చూసి ఆ అమ్మాయి కొద్ది సేపు నివ్వెరపోయింది. షాక్ కు గురై , తన పక్కన అంత జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్న అతన్ని ఎలా ఖండించాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. గట్టిగా అరచి, జీపుని అక్కడే ఆపేయాలని అనుకుంది. కానీ భయంతో ఆ పని చేయలేకపోయింది. ఎందుకంటే ఆపడానికి ప్రయత్నిస్తే ఎక్కడ తన పై దాడి చేసి గాయ పరుస్తాడో అని భయపడింది.

హస్తప్రయోగం మీద అపోహలు తొలగించుకోండి...

Cha Vinuya harassment

ఆ జీపులో ఉన్న మనుషులు ఎందుకు అడ్డుకోలేదంటే ....

ఆ అమ్మాయి ప్రయాణిస్తున్న జీపులో ఎంతో మంది ఉన్నా ఆ చెండాలమైన పని చేస్తున్న వ్యక్తిని అడ్డుకోవడానికి ఎవరు సాహసించలేదు. అందుకు కారణం అడ్డుకుంటే ఆ అమ్మాయి పై ఎక్కడ దాడి చేస్తాడో అనే అనుమానంతో పాటు, తమను ఏమైనా చేస్తాడేమో అనే భయం వాళ్ళని వెంటాడింది.

Cha Vinuya harassment

హస్త ప్రయోగం మానేయటానికి 12 అద్భుతమైన మార్గాలు

ఇంత దారుణం జరిగింది అని చెప్పినా ఈ ప్రపంచం నన్నే నిందిస్తుంది....

తనకు జరిగిన ఈ అన్యాయాన్ని వివరిస్తూ "చ వినుయా" అనే అమ్మాయి సామాజిక మాధ్యమాల్లో తన బాధని , అసహనాన్ని వ్యక్తపరుస్తూ ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ చూసిన కొంత మంది ఆ అసభ్యకరమైన పని చేసిన వ్యక్తిని నిందించకుండా నువ్వు మంచి బట్టలు వేసుకొని ఉండవని ఆ అమ్మాయిని నిందించటం ప్రారంభించారు. దీంతో సహనం కోల్పోయిన ఆ అమ్మాయి తను ఆ సమయంలో యూనిఫామ్ వేసుకున్నానని, తన అందాలను ఆరబోసేలా ఫ్యాషన్ దుస్తులను వేసుకోలేదని హితవు పలికింది .

అబ్బాయిల చేసే తప్పులకు కూడా అమ్మయిల వైపు వేలెత్తి చూపించడం తప్పు. సమాజం అమ్మయిల్లో తప్పులను వెతకటం మానేసి అబ్బాయిల ప్రవర్తనను మార్చటానికి పూనుకంటె మంచిదని చెప్పక తప్పదు.

English summary

Man M*sturbated And Stared At A Girl Inside A Public Jeepney

Who would have thought that someone could be sexually abused in a crowded jeep? Check out the disgusting act of man who was seen masturbating in a moving jeep
Subscribe Newsletter