For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  సుఖ వ్యాధుల నుండి స్త్రీలు తమని తాము కాపాడుకోవడానికి తీసుకుకోవాల్సిన జాగ్రత్తలు

  By R Vishnu Vardhan Reddy
  |

  శృంగార జీవితం ద్వారా కలిగే ఆనందం మరియు సంతృప్తి ప్రతి ఒక్క స్త్రీ ఆరోగ్యానికి మంచిది. భావద్వేగ ఒత్తిడిని తగ్గించుకోవడానికి శృంగారం ఒక సాధనంగా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా సంబంధ బాంధవ్యాలను బలోపేతం చేయడానికి మరియు ఇద్దరి మధ్య మంచి బంధాన్ని దృఢపరచడానికి కూడా శృంగారం బాగా ఉపయోగపడుతుంది.

  దీనికి తోడు ఇది చాలా సరదాతో కూడుకున్న పని.

  అయినప్పటికీ శృంగారం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయ్. ఉదాహరణకు శృంగారం నుండి సంక్రమించే సుఖ వ్యాధుల వాళ్ళ మానసిక మరియు శారీరిక ఆందోళనకు లోనయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా వాటి వల్ల చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యలు మరియు సంతాన లేమి లాంటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది.

  STDs

  శృంగారం ద్వారా సంక్రమించే సుఖవ్యాధులు గురించి తెలుసుకోవాల్సిన విషయాలు :

  శృంగారం వల్ల సంక్రమించే సుఖ వ్యాధుల వల్ల మీ యోని భాగంలో విపరీతమైన నొప్పిరావడం వల్ల అది మీ శృంగార జీవితం పై అది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా మీ జీవితంలో సాధారణంగా మీరు అనుసరించే దైనందిక జీవితం పై కూడా దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

  ఎప్పుడైతే శృంగారాన్ని ఆస్వాదించలేరో, అప్పుడు ఆ ప్రక్రియను ఒక ఆనందించే మార్గంగా కాకుండా ఎదో ఒక పనిలా భావిస్తారు.

  ఆరోగ్యవంతమైన శృంగార జీవితం గడపాలి అంటే ఎంతో పని చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీ యొక్క శృంగార జీవితం ఆరోగ్యకరంగా ఉంటుందో అటువంటి సమయంలో మీరు పట్టే కృషికి తగ్గ ఫలితం మీకు లభిస్తుంది అని మీ మనస్సుకి అనిపిస్తుంది.

  మీరు గనుక శృంగారంలో ఉత్సాహంగా పాల్గొనే స్త్రీలు గనుక అయితే, శృంగారం ద్వారా మీకు సుఖ వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంది అనే విషయం గుర్తుపెట్టుకోండి.

  మీరు గనుక ఎక్కువ భాగస్వాములతో పాల్గొనట్లతే, అలాంటి సమయంలో మీకు పొంచి ఉన్న ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు ఎప్పుడో ఒక్కసారి మాత్రమే ఇతరులతో శృంగారంలో పాల్గొనే వారైనప్పటికీ మీకు అటువంటి సుఖ వ్యాధులు రావు అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే, మీరు మొదటిసారి పాల్గొన్నా అది సురక్షితం అని చెప్పలేము.

  ఒక శుభవార్త ఏమిటంటే, అనేక మార్గాల ద్వారా తమను తాము స్త్రీలు శృంగారం ద్వారా సంక్రమించే సుఖ వ్యాధుల భారీ నుండి కాపాడుకోవచ్చు. ఈ మార్గాల ద్వారా పూర్తిగా వ్యాధుల భారిన పడరు అని చెప్పలేము కానీ అవి సంక్రమించే ప్రమాదాన్ని చాలా వరకు అరికట్టవచ్చు....

  1. టీకాలు వేయించుకోవడం :

  1. టీకాలు వేయించుకోవడం :

  టీకాలు వేయించుకోవడం ద్వారా రెండు రకాల సుఖవ్యాధులు రాకుండా అరికట్టవచ్చు. ఆ సుఖవ్యాధులు ఏమిటంటే, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ మరియు హెపటైటిస్.

  హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ( ఎహ్ పి వి) అనే వైరస్ సంక్రమించ కుండా అరికట్టడానికి రెండు రకాల టీకాలు ఉన్నాయి :

  ఆ టీకాల పేర్లు ఏమిటంటే, సర్వారిస్ మరియు గార్దసిల్. సర్వారిస్ ఎహ్ పి వి 16 మరియు ఎహ్ పి వి 18 వైరస్ ల నుండి సంరక్షిస్తుంది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వల్ల సెర్వికల్ క్యాన్సర్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది.

  దీనికి తోడు గార్దసిల్ పైన చెప్పబడిన రెండు వైరస్ లు రాకుండా సంరక్షిస్తుంది మరియు జననాంగాల దగ్గర పులిపిర్లు రాకుండా అరికడుతుంది.

  ఏ స్త్రీలు అయితే శృంగారం చేయడం మొదలు పెట్టారో అటువంటి వారికీ ఈ టీకాలు ఉత్తమంగా పనిచేస్తాయి.

  మనం అందరం మరచిపోకూడని అంశం ఇంకొకటి ఉంది. అదేమిటంటే, హెపటైటిస్ బి సంబంధించిన టీకా.

   2. సురక్షితమైన శృంగారాన్ని అలవాటు చేసుకోవడం :

  2. సురక్షితమైన శృంగారాన్ని అలవాటు చేసుకోవడం :

  శృంగారం ద్వారా సంక్రమించే సుఖ వ్యాధుల భారిన పడకుండా ఉండాలంటే, అన్నింటి కంటే ఉత్తమైన మార్గం ఏమిటంటే, సురక్షితమైన శృంగారంలో పాల్గొనటం.సాధారణంగా సుఖ వ్యాధులు, వ్యాధులు సోకిన స్రావం మరియు ద్రవాల ద్వారానే వ్యాప్తి చెందుతాయి. చర్మాన్ని తాకడం ద్వారా సంక్రమించే వ్యాధులు అధికం అవుతున్న ఈ రోజుల్లో కండోమ్ వాడినా కూడా అది ప్రభావవంతంగా పనిచేయకపోవచ్చు. కానీ ప్రమాద తీవ్రతని కొద్దిగా తగ్గించవచ్చు.

  చివరిగా మీలో ఉన్న అపోహలను భయాలను పూర్తిగా మరచిపోండి మరియు అన్ని రకాల వైద్య పరీక్షలను చేయించుకోవడానికి సిగ్గుపడకండి. అది ఒక బాధ్యతగా భావించండి. అప్పుడు మాత్రమే మీరు మీ యొక్క శృంగార జీవితాన్ని బాగా ఆస్వాదించగలరు.

  సుఖ వ్యాధులు బారినపడకుండా ఎవ్వరూ మిమ్మల్ని కాపాడారు. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. అందుచేత మీ అంతట మీరే ఉత్తమమైన నిర్ణయాలను తీసుకోవడం అలవర్చుకోండి మరియు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి.

  చివరిగా చెప్పొచ్చేదేమిటంటే, సుఖవ్యాధులు భారిన పడకుండా నిరోధించడానికి తగు జాగ్రత్తలు తీసుకోవడం మరియు తరచూ పరీక్షలు చేయించుకోవడం ద్వారా శృంగారం ద్వారా వచ్చే సుఖ వ్యాధులు భారిన పడకుండా ఆనందంగా జీవించవచ్చు.

  మనల్ని మనం కాపాడుకోవడానికి సురక్షితమైన శృంగారం ఎప్పటికైనా ప్రయోజనకరమే. తరచూ శృంగారంలో పాల్గొనే సమయంలో కండోమ్స్ వంటి వాటిని వాడటం ద్వారా శృంగార ప్రక్రియలో పాల్గొనే సమయంలో వివిధ రకాల సుఖ వ్యాధులు మనకు సంక్రమించకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

  సిఫిలిస్, ఎహ్ పి వి మరియు హెర్పెస్ వంటి వ్యాధులు నోటి ద్వారా శృంగారం చేసినా సంక్రమిస్తాయని మీరు గుర్తుపెట్టుకోండి.

   3. పరీక్షలు చేసుకోవడం :

  3. పరీక్షలు చేసుకోవడం :

  శృంగారం ద్వారా సంక్రమించే సుఖవ్యాధులు భారిన పడకుండా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలంటే, తరచూ పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఉదాహరణకు సూక్ష్మ జీవుల వల్ల కలిగే గోనేరియా వ్యాధి సంతానలేమి వంటి తీవ్రపరిణామాలు దారితీసే అవకాశం ఉంది.

  మీరు ఎప్పుడైతే కొత్త భాగస్వామితో శృంగారం చేయాలని భావిస్తారో అటువంటి సమయంలో మీరు మీ భాగస్వామి ఇద్దరు కలిసి పరీక్షలు చేయించుకున్న తర్వాత శృంగార జీవితాన్ని మొదలు పెట్టడం మంచిది.

  ఈ మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా భాగస్వాములు ఇద్దరూ వేరొకరి జీవితాలను ప్రమాదం నెట్టివేయడం లేదు అనే స్పృహ మీలో కలుగుతుంది.

  ఎప్పటికప్పుడు తరచూ పరీక్షలు చేయించుకోవడం ద్వారా మీ పరిస్థితి ఏంటి, మీరు ఎలా నడుచుకోవాలి అనే విషయాలు మీకే అర్ధం అవుతాయి. అప్పుడు మీరు అందంగా, ఆరోగ్యంగా మరియు భయం లేకుండా మీ జీవితాన్ని గడపవచ్చు.

  ఏ వయస్సులో ఉన్న వ్యక్తులైనా సుఖ వ్యాధుల భారిన పడే అవకాశం ఉంది. మీరు ఒక్కరినే పెళ్లి చేసుకొని ఉండవచ్చు లేదా మీరు వయస్సు రీత్యా చాలా పెద్దవారు అయి ఉండవచ్చు. అయినప్పటికీ మీరు కొత్త భాగస్వామితో పాల్గొంటున్నారంటే, సుఖవ్యాధులు భారినపడే ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తించండి.

   4. తరచూ సుఖవ్యాధులు సంబంధించిన పరీక్షలు చేయించుకోండి :

  4. తరచూ సుఖవ్యాధులు సంబంధించిన పరీక్షలు చేయించుకోండి :

  ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు చేయించుకునేటప్పుడు, సుఖ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు తూచా తప్పకుండా చేయించుకోవాలి అనే నియమాన్ని పెట్టుకోండి. ఈ పరీక్షల ద్వారా సెర్వికల్ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని ముందుగానే పసిగట్టవచ్చు. క్యాన్సర్ భారిన పడే లక్షణాలు ముందే గనుక పసిగట్టగలిగితే తీవ్రమైన సమస్యల భారిన పడకముందే వాటికీ చికిత్సను అందించవచ్చు. చాలా సందర్భాల్లో హెచ్.పి.వి వల్లనే సెర్వికల్ క్యాన్సర్ వస్తుంది అనే విషయం నిరూపితమైంది. అందుచేత సురక్షితమైన శృంగారం మరియు ఎప్పటికప్పుడు టీకాలు వేయించుకోవడం ద్వారా ఇలాంటి ప్రమాదాల భారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

  వివిధ రకాల హెచ్.పి.వి లు వల్ల క్యాన్సర్ భారిన పడే అవకాశం ఉంది. టీకాల ద్వారా వాటన్నింటిని రాకుండా మనం అరికట్టలేము. అందుచేత ఎహ్.పి.వి కి సంబంధించిన టీకాలు వేయించుకున్నప్పటికీ ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవడం మరచిపోకండి.

  అంతేకాకుండా సెర్వికల్ క్యాన్సర్ భారిన పడితే, ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. దాని నుండి కాపాడటానికి చాలా తీవ్రమైన చికిత్స విధానాలను అవలంభిస్తారు. అది మీ పై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. మీ యొక్క శృంగార జీవితం మరియు సంతానోత్పత్తి పై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపవచ్చు.

  మీ శరీరంలో యోని భాగంలో చోటు చేసుకొనే మార్పులను ఎప్పటికప్పుడు సమయానుసారంగా తెలుసుకోవడం చాలా మంచిది అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తిరిగికొలుకోలేని నష్టం గురించి ఎదురుచూడటం ఎందుకు ?

   5. సుఖవ్యాధులు భారిన పడకుండా మనం నిజంగా అరికట్టవచ్చా ?

  5. సుఖవ్యాధులు భారిన పడకుండా మనం నిజంగా అరికట్టవచ్చా ?

  మనల్ని మనం సుఖవ్యాధులు భారిన పడకుండా కాపాడుకోవాలంటే చేయాల్సిన ఒకే ఒక పని శృంగారంలో పాల్గొనకుండా ఉండటం. అయితే జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించి ఆనందించాలంటే అందుకు శృంగారం ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి దానికి దూరంగా ఉండటం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు.

  అందుచేత ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శృంగార జీవితాన్ని ఆస్వాదిస్తూ ఎటువంటి సుఖ వ్యాధుల భారిన పడకుండా మరియు అది సంక్రమించే ప్రమాదాలను కూడా తగ్గించుకొని ఆనందకరమైన జీవితాన్ని గడపాలని సూచిస్తున్నారు.

  English summary

  How Can Women Protect Themselves from STDs?

  The pleasure and satisfaction that your sex life provides are good for every woman’s health. Sex is a great way to reduce levels of emotional stress and is often a bonding experience that helps to strengthen relationships.
  Story first published: Tuesday, December 12, 2017, 18:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more