గర్వంగా చెప్పుకోవడానికి అద్భుత శక్తులున్న భారతీయులు..

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

యాక్షన్ కలిగి ఉన్న సూపర్ హీరోల సినిమాలను చూసిన తర్వాత మనం పొందే అనుభూతిని బట్టి మనలో చాలామంది అద్భుత శక్తులు కలిగి ఉండాలని కోరుకుంటారు. ఏదో ఒక రోజు మనం బాట్మాన్, లేదా, సూపర్ మ్యాన్ లా అవ్వాలని కోరుకోవడంలేదా ?

కానీ ఇక్కడ చాలామంది వ్యక్తులు అద్భుతమైన శక్తులతో ఆశీర్వదించబడ్డారని మీకు తెలుసా ?

వీరు గాలిలో ఎగిరేటటువంటి శక్తిని మాత్రం కలిగి ఉండరు. ఇక్కడ మేము అలాంటి ప్రజల వాస్తవాలను గురించి మాట్లాడుతున్నాము.

ఇండియా గొప్పతనాన్ని వివరించే ఆసక్తికర విషయాలు

మనదేశంలో లక్కీగా కొంతమంది సూపర్ హీరోలుగా అద్భుత శక్తులతో ఆశీర్వదించబడ్డారు. అలాంటి వ్యక్తులు గూర్చి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మనోజ్ చోప్రా:

మనోజ్ చోప్రా:

అతనిని 'భారతదేశం యొక్క బలమైన వ్యక్తి' గా పిలుస్తారు అలాగే ప్రపంచంలో 14 వ అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అతనిని "ఛత్తీస్గఢ్ జెయింట్", "బెంగుళూర్ భీమా" అని కూడా పిలుస్తారు. మనోజ్ బలమైన వ్యక్తే కాకుండా, స్ఫూర్తిదాయకంగా మాట్లాడే అద్భుతమైన వ్యక్తి కూడా. అతను ప్రపంచవ్యాప్తంగా 3000 వేర్వేరు పాఠశాలల్లో ప్రసంగించారు అలాగే 40 కి పైగా వివిధ దేశాలలో స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలను నిర్వహించారు!

ప్రియన్షి సోమానీ :

ప్రియన్షి సోమానీ :

18 సంవత్సరాలు వయస్సు కలిగిన ఈమెను "మెంటల్ కాలిక్యులేటర్గా" కూడా పిలుస్తారు. ఆమె 2010 లో మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ కప్ లో పాల్గొని 100% కచ్చితత్వంతో ఉన్న ప్రదర్శనను ఇచ్చింది. ఆమె పేరు 'లిమ్కా వరల్డ్ రికార్డ్స్' లోనూ, 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్' లో కూడా నమోదు చేయబడింది. ఈమె 'మెంటల్ స్క్వేర్ రూట్స్' లో ప్రపంచ రికార్డ్ను కూడా కలిగి ఉంది.

జ్యోతి రాజ్ :

జ్యోతి రాజ్ :

అతను కొండలు, గోడలను అధిరోహించే వ్యక్తి. అతనిని "కోతి రాజు", "మంకీ కింగ్" అని పిలుస్తారు. అతడు మొత్తం చిత్రపర్చ కోటను స్పష్టంగా కొలిచాడు, ఎలాంటి కవచాన్ని ధరించకుండా ! సంపూర్ణమైన చేతిపట్టుని కలిగి ఉండటానికి, అతను ఎల్లప్పుడూ తన అరచేతుల్లో మెగ్నీషియం కార్బోనేట్ పొడిని రుద్దుతాడు.

రాజ్ మోహన్ నాయర్ :

రాజ్ మోహన్ నాయర్ :

అతను 'ఎలక్ట్రిక్ మాన్ అఫ్ ఇండియా'గా కూడా పిలువబడ్డాడు. అతను, తన శరీరంలోకి అధిక వోల్టేజ్ ఉన్న కరెంట్ ని ప్రసరింపజేయడం ద్వారా ఏ విధంగానూ ప్రభావితం కాకుండా ప్రత్యేకమైన రోగనిరోధక వ్యవస్థను కలిగివున్న అసాధారణమైన వ్యక్తి గా అందరికీ తెలుసు. స్పష్టంగా చెప్పాలంటే, అతని శరీరం ఒక బల్బ్ని వెలిగించినంత చేసే శక్తిని ఉత్పత్తి చేస్తుంది. బల్బులకు, ఇనుప కడ్డీలకు విద్యుత్ సరఫరా చేసేటటువంటిగా అతని శరీరం ప్రధాన ప్లగ్ గా ఉండే మానవ సూత్రధారుడు అతను.

అకృత్ జశ్వాల్ :

అకృత్ జశ్వాల్ :

అతను కేవలం 5 సంవత్సరాల వయసులోనే షేక్స్పియర్ నవలలు చదవడం మొదలుపెట్టాడు. అతను 7 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, ఆరోగ్య సదుపాయాలు లేని కుటుంబానికి చెందిన వాళ్ళ పాపాయికి శస్త్రచికిత్స చేసాడు. అతను 12-సంవత్సరాల వయస్సుకే భారతదేశ వైద్య కళాశాలలో చేరిన మొట్టమొదటిగా పిల్లవానిగా రికార్డు సృష్టించాడు. స్పష్టంగా చెప్పాలంటే, అతను ప్రస్తుతం అప్లైడ్ కెమిస్ట్రీ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు.

నందనా ఉన్నికృష్ణన్ :

నందనా ఉన్నికృష్ణన్ :

ఆమెకి ఆటిస్టిక్ స్పెక్ట్రం డిజార్డర్ (ASD), అటెన్షన్ డెఫిషిట్ హైపర్యాక్టివిటీ సిండ్రోమ్ (ADHD) అనే వ్యాధి ఉన్నందువల్ల - అధిక పనితీరును కలిగి ఉంది. స్పష్టంగా చెప్పాలంటే, ఈమె తన తల్లి ఆలోచనలను, భావాలను గమనించగలదు. మిత్రులారా, ఇది జోక్ కాదు.

ఇండియన్స్ మాత్రమే నమ్మే బూటకపు విషయాలు..!!

వేలు రాధాకృష్ణన్ :

వేలు రాధాకృష్ణన్ :

వేలు రాధాకృష్ణన్ నిజంగా శక్తివంతమైన వ్యక్తి, అతను తన పళ్ళను ఉపయోగించి వందల టన్నుల బరువున్న రైళ్లను లాగేటంత ఒక అద్భుత శక్తి కలదు ! అవును, మీరు ఆ చదువుతారు! స్పష్టంగా, అతను తన శరీరంలో గల మొత్తం శక్తిని - శరీరంలో ఒక భాగానికి మాత్రమే పూర్తి దృష్టిని కేంద్రీకరించాలని బోధించిన తన గురువు నుండి ఈ అద్భుతశక్తి అతనికి వచ్చింది. అతను 2003లో, కౌలాలంపూర్ రైల్వే స్టేషన్లోని 260.8 టన్నుల బరువున్న 2 KTM రైళ్లను పట్టాల వెంట 13 అడుగుల 9 అంగుళాల దూరం వరకు తన పంటితో లాగాడు.

English summary

People Who Are Blessed With Super Powers

These humans have super natural powers that can leave you completely shocked…
Subscribe Newsletter