ఆడవారు పుట్టిన నెలను బట్టీ వారి వ్యక్తిత్వం తెలుసుకోవొచ్చు !

By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

ఆడవాళ్లు ఎవరికీ అంత ఈజీగా అర్థంకారు. వాళ్లు ఒక్కో క్షణంలో ఒక్కో విధంగా ప్రవర్తిస్తుంటారు. ఒక్కోసారి చాలా సంతోషంగా ఉంటారు. చాలా బాగా మాట్లాడుతారు. మరొక్కసారి ఎలాంటి కారణం లేకుండానే అనవసరంగా కోపం తెచ్చుకుంటారు. అలకపడక వేస్తారు.

ఈజీగా హర్ట్ అవుతారు. మరి ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ ను చూపించే ఆడవాళ్లను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక చాలామంది మగవారు సతమతమవుతుంటారు. అయితే అమ్మాయిలు పుట్టిన నెల బట్టీ వారు ఎలా ప్రవరిస్తారో తెలుసుకోవొచ్చు.

ఒక్కో నెలలో జన్మించిన వారు ఒక్కో క్యారక్టర్ ను కలిగి ఉంటారు. మరి మీరు ప్రేమించే అమ్మాయి.. లేదా మీ భార్య ఏ నెలలో పుట్టిందో తెలుసుకుంటే చాలు. వారు ఏమిటో మీరు ఈజీగా తెలుసుకోవొచ్చు.

1. జనవరి

1. జనవరి

జనవరిలో పుట్టిన ఆడవారు చాలా నిజాయితీగా ఉంటారు. వీరిలో అసాధారణ ప్రతిభ ఉంటుంది. వీరి వారి పొంత విషయాల గురించి ఎవరైన చర్చిస్తుంటే చాలా కోపానికి గురువుతారు. అలాంటి వారిని ఎక్కువగా ద్వేషిస్తారు. అలాగే వీరు ఎక్కువగా ఇండిపెండెంట్‌గా ఉంటారు. నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు కూడా వీరిలో ఎక్కువ‌గానే ఉంటాయి.

2. ఫిబ్రవరి

2. ఫిబ్రవరి

వీరు చాలా రొమాంటిక్ గా ఉంటారండోయ్. వీరిలో సహనం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇతరులపై ఎక్కువ ఆప్యాయతను కలిగి ఉంటారు. అయితే వీరిని అర్థంచేసుకోవడం మాత్రం అంత సులభం కాదు. ఎందుకంటే వీరి మూడ్ ఒక్కోసారి ఒక్కోరకంగా ఉంటుంది. అందువల్ల ఎవరూ అంత త్వరగా అర్థం చేసుకోలేరు. వీరిని ఎవరైనా మోసగించారనుకో లైఫ్ లో వారిని మళ్లీ నమ్మరు. వీరు చాలా ఎట్రాక్టివ్‌గా ఉంటారు.

3. మార్చి

3. మార్చి

మార్చిలో పుట్టిన అమ్మాయిల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీరిలో నిజాయితీ కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా విశ్వాసంగా ఉంటారు. అలాగే వీరిని నమ్మిన వారి విషయంలో వీరు కూడా ఎంతో ప్రేమగా, నమ్మకంగా ఉంటారు. వీరిని ప్రేమలో దింపాలంటే మాత్రం చాలా కష్టం. ఒక్కసారి వీరు మీ ప్రేమలో పడ్డారనుకో మీరు అదృష్టవంతులే. ఎందుకంటే జీవితాంతం మీతోనే ఉండాలని పిక్స్ అయిపోతారు వీరు. మీరు ఎన్ని కష్టాల్లో ఉన్న మీ నుంచి దూరంకారు. మీకు అండగా ఉంటారు.

4. ఏప్రిల్

4. ఏప్రిల్

వీరు మంచి తెలివిగవారు. వీరు ఎవరినైనా ఇట్టే డీల్ చేయగలరు. ప్రతి ఒక్కరి మనస్సును సులభంగా దోచుకుంటారు. ఇక వీరు ప్రేమించిన వ్యక్తులు వీరిని కాకుండా ఇతరుల్ని ప్రేమిస్తే వీరు తట్టుకోలేరు. చాలా బాధపడుతారు. అసూయపడతారు. వీరు చాలా డైనమిక్ గా, యాక్టివ్‌గా ఉంటారు. వీళ్లు చాలా ఎట్రాక్టివ్‌గా ఉంటారు.

5. మే

5. మే

వీరు చాలా అట్రాక్టివ్ గా ఉంటారు. వీరితో ప్రేమలో పడ్డారంటే ఇంకా అంతేసంగతులు. మీరు కచ్చితంగా డేంజర్ జోన్ లోకి వెళ్లినట్లే. వీళ్లు సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసుకోలేదు. వీరిలో హార్డ్ వర్క్ చేసే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు కాస్త నిజాయితీగా ఉంటారు.

6. జూన్

6. జూన్

జూన్ లో పుట్టిన వారిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు బాగా కమ్యూనికేటెడ్ పీపుల్స్. వీరు ఏం మాట్లాడిని దానికి ముందు బాగా ఆలోచించే మాట్లాడుతారు. వీరు ఏ విషయాన్ని అయినా ముఖం మీదే చెప్పేస్తారు. మనుషుల వెనక మాట్లాడడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. వీరిలో మరో కోణం కూడా ఉంది. వీరు కాస్త ప్రమాదకరమైన వ్యక్తులు.

7. జూలై

7. జూలై

ఈ నెలలో పుట్టిన మహిళలు చాలా నిజాయితీగా ఉంటారు. అంతేకాదు చాలా అందంగా ఉంటారు. మంచి తెలివి గల వారు అయి ఉంటారు. వీరు విభేదాలకు దూరంగా ఉంటారు. వీరు వారి చుట్టే వారి పట్ల చాలా మర్యాదగా ఉంటారు. వీరు చాలా జాలి కలిగి ఉంటారు. రిలేషన్స్ ను బాగా కాపాడుకుంటారు. వీళ్లు ఒక్కసారి హర్ట్ అయ్యారంటే అంతేసంగతి. మళ్లీ వీళ్లు మామాలు మనుషులు కావడానికి చాలా టైమ్ పడుతుంది.

8. ఆగస్టు

8. ఆగస్టు

ఆగస్ట్ నెలలో పుట్టినవారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. వీరికి మంచి మనస్సు ఉంటుంది. వీరిలో మంచి హాస్యం ఉంటుంది. సెన్సార్ హ్యుమర్ కాస్త ఎక్కువే ఉంటుంది. ఇక అందరి దృష్టి ఎప్పుడూ వీరిపైనే ఉండాలని భావిస్తారు. వీరు చాలా ఎట్రాక్టివ్‌గా ఉంటారు. అలాగే రొమాంటిక్ గా ఉంటారు.

9. సెప్టెంబర్

9. సెప్టెంబర్

వీరు ఎక్కువగా జాలి, దయ కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా ఎక్కువే. అలాగే వీరు చాలా అందంగా ఉంటారు. వీరిని మోసగించిన వారిని వీరు అస్సలు క్షమించరు. కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారు. వీరికి ఎప్పటి కూడా ఇబ్బంది కలిగించకూడదు. వీరి కాబోయే భర్త విషయంలో చాలా ఎక్స్ పెక్టేషన్స్ కలిగి ఉంటారు. వీరు చాలా నిజాయితీగా, సెన్సిటివ్‌గా ఉంటారు. వీరి ఫీలింగ్స్‌ని బయటకు చెప్పరు.

10. అక్టోబర్

10. అక్టోబర్

అక్టోబర్ లో జన్మించిన మహిళలకు చిన్నచిన్న విషయాలకు బయపడే మనసత్వం ఉండదు. వీరు చాలా భావోద్వేగంతో ఉంటారు. వీరు చాలా స్మార్ట్ గా ఉంటారు. అయితే వీరి ఫీలింగ్స్ ను అందరితో చెప్పుకోవడానికి ఇష్టపడరు. వీరు ఇతర మహిళలకు అంతగా నచ్చరు. ఎందుకంటే వీరంటే వారికి అసూయ ఉంటుంది. వీరుకొన్నిసార్లు కాన్ఫిడెన్స్ కోల్పోతారు.

11. నవంబర్

11. నవంబర్

వీరు ఇతరులతో పోల్చుకుంటే ప్రతి విషయంలో ఒక అడుగు ముందే ఉంటారు. వీరి దగ్గర ఏదైనా అబద్దం చెబతే వెంటనే వీరు గుర్తుపడతారు. అందువల్ల వీరితో ఎప్పుడు కూడా అబద్దం చెప్పకూడదు. వీరు అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉంటారు. వీళ్లు చాలా తెలివైనవాళ్లు, చాలా షార్ప్‌గా ఆలోచిస్తారు.

12. డిసెంబరు

12. డిసెంబరు

డిసెంబర్ లో జన్మించిన స్త్రీలు ఎప్పుడూ అసహనానికి గురువుతూ ఉంటారు. వీరు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే బలాన్ని కలగి ఉంటారు. ఇక మూడ్ బాగా లేకుంటే వెంటనే మళ్లీ మామూలు స్థితికి రాగల నేర్పు కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. వీళ్లు ఓపెన్ మైండెడ్ గా ఉంటారు. చాలా తేలికగా లక్, వెల్త్ పొందుతారు.

Read more about: life, world, astrology, లైఫ్
English summary

kind of woman you are according to birth month

This is an article for men to understand the characteristics of women based on their birth month!
Story first published: Monday, November 20, 2017, 13:30 [IST]
Subscribe Newsletter