For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీకు వచ్చే కలలు ఏమని సూచిస్తాయో తెలుసా ?

  By R Vishnu Vardhan Reddy
  |

  సాధారణంగా ప్రతి ఒక్కరు కలలు కంటారు. కానీ ఆ కలలన్నీ మీకు గుర్తుంటాయా ? లేక మీరు లేచిన మరుక్షణమే వాటిని మర్చిపోతారా ? లేక ఆ కలలు మీరు అరిచేలా చేసి మీ నిద్రకు భంగం కలిగిస్తాయా లేదా మీకు చమటలు పట్టిస్తాయా ?

  శాస్త్రవేత్తలు మరియు నిపుణులు ప్రకారం వారు చెబుతున్నదేమిటంటే, కలలు అనేటివి మీరు ఉంటున్న పరిసరాల చుట్టూ నుండి మాత్రమే అవి ఉద్భవిస్తాయని అనుకోకండి. అవి మరో కొత్త కోణం నుండి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవి మీ మెదడుని తన ఆధీనంలోకి తెచ్చుకోగలవు కానీ, మీరు ఆ కలలను మీ ఆధీనంలోకి తెచ్చుకోలేరు.

  నిద్రలో వచ్చే కలలు.. రియాలిటీకి దగ్గరగా ఉంటాయా ?

  మీకు ఒకవేళ వికారమైన కలలు గనుక తరచూ వస్తూ ఉంటే, ఆ కళల వెనుక రహస్యంగా దాచబడిన సమాచారం ఒకటి ఉందని భావించాలి.

  వికారమైన కలల రకాల గురించి, వాటి వెనుక దాగిఉన్న అసలైన అర్ధాల, గురించి మీ అధీనంలో లేని మీ యొక్క ఉపచేతన మెదడు యొక్క శక్తి గురించి మరింత లోతుగా తెలుసుకుందాం.

  మీరు చీమల గురించి కలగన్నారా ?

  మీరు చీమల గురించి కలగన్నారా ?

  మీ శరీరం పై చీమలు పాకుతున్నట్లు మీకు ఎప్పుడైనా కల వచ్చిందా ? ఆలా గనుక అయితే మీరు చేయూతనిస్తారని, కష్టబడిపనిచేస్తారని లేదా చిరాకుపడుతుంటారనే విషయాను తెలియజేస్తుంది. మీ కుటుంబ సభ్యులతో మీకున్న సంబంధ బాంధవ్యాలను చీమలు తెలియజేస్తాయి. అంతేకాకుండా మీరు ప్రేమించే వ్యక్తులతో మరింత దృఢమైన సంబంధబాంధవ్యాలు ఏర్పరుచుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తాయి.

  మీరు డబ్బాల గురించి ఎప్పుడైనా కలలు కన్నారా ?

  మీరు డబ్బాల గురించి ఎప్పుడైనా కలలు కన్నారా ?

  మీరు ఎప్పుడైనా గుట్టలు గుట్టలుగా పేర్చబడ్డ డబ్బాల గురించి కల కన్నారా ? అంతేకాకుండా ఆ డబ్బాలలో ఎదో ఒకదానిని మీరు తెరవాలని విపరీతంగా మీరు ప్రయత్నించారా ? ఇలాంటి కలలు గనుక మీకు వచ్చినట్లైతే, త్వరలో మీరు ఎన్నో అంతుబట్టని విషయాలు, రహస్య విషయాలతో పాటు మరెన్నో నిరాశ కలిగించే సంఘటనలు ఎదురుకాబోతున్నాయని గుర్తించండి. ఆ డబ్బాలు మూసి లేదా తెరచి గనుక ఉంటే మీ యొక్క అసంకల్పిత స్థితిలో ఉన్న మెదడు మీకు ఎదో సమాచారాన్ని తెలపడానికి విపరీతంగా ప్రయత్నిస్తుంది అని అర్ధం. ఆ విషయాన్ని చాలా త్వరగా మీకు చేరవేయాలని భావిస్తున్నట్లు అర్థం.

  వర్షించే పిల్లులు గురించి మీరు కలలు కన్నారా ?

  వర్షించే పిల్లులు గురించి మీరు కలలు కన్నారా ?

  మీరు గనుక ఇటువంటి వర్షించే పిల్లుల గురించి కలలు గనుక కన్నట్లైతే, ముఖ్యంగా స్త్రీలు వారిలో యొక్క శక్తిని గుర్తించినట్లు అర్ధం. అంతేకాకుండా ఇది వారి లోపల ఉన్న దైవచింతన శక్తితో అనుసంధానం కావడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా వాళ్ళ చుట్టుప్రక్కల ఉన్న వేరేవారి యొక్క శక్తి మరియు మరింత లోతుగా ఉపచేతన స్థితితో అనుసంధానం అవ్వడానికి ఉపయోగపడుతుంది.

  క్రిందపడిపోతున్నట్లు ఎప్పుడైనా కలకన్నారా ?

  క్రిందపడిపోతున్నట్లు ఎప్పుడైనా కలకన్నారా ?

  ఎప్పుడో ఒకసారి లేదా చాలా సందర్భాల్లో సాధారణంగా తరచూ వచ్చే కలలో ఇవి కూడా ఒకటి. ఏదైనా మెట్ల పై నుండి జారిపడిపోవడం లేదా ఎత్తైన కొండ నుండి క్రిందపడిపోవడం లాంటి కలలు గనుక వస్తూ ఉంటే తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన మరియు మీ పై మీకు స్వీయ నియంత్రణ లేదు అని అర్ధం. అంతేకాకుండా, మీ జీవితంలో అనేక ముఖ్యమైన సంఘటనలకు హాని చేకూరే అవకాశం ఉంది. మీ యొక్క వైఫల్యాల గురించి తరచూ ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు మరియు జీవితంలో అనేక విషయాల పై మీ యొక్క నియంత్రణను కోల్పోతారు.

  పచ్చటి బైళ్ల గురించి మీరు ఎప్పుడైనా కలలు కన్నారా ?

  పచ్చటి బైళ్ల గురించి మీరు ఎప్పుడైనా కలలు కన్నారా ?

  బాగా పచ్చటి రంగులో ఉన్న బైళ్ల గురించి కానీ లేదా అందమైన ప్రకృతి లేదా చుట్టూ ఉన్న అద్భుతమైన ప్రదేశాల గురించి కానీ మీరు ఎప్పుడైనా కలలు కన్నారా ? అలా కనుక అయితే ప్రేమ కోసం మీరు ఎక్కువగా పరితపిస్తున్నారని మరియు అవసరం ఉందని అర్ధం. అంతే కాకుండా మీలో అభిరుచితో పాటు ఏదైనా వైఫల్యం చెందినా మళ్ళీ మామూలు స్థితికి చేరుకొనే శక్తి మీలో అధికంగా ఉంటుంది, మీరు అంతటి బలవంతులు కూడా. మీకు మీ జీవితంలో ప్రస్తుతం లభించిన స్థితికి గాను మీరు పూర్తి ఆనందంతో ఉంటారు. ఒకవేళ స్త్రీలకు గనుక ఇటువంటి కలలు గనుక వస్తే వారి భవిష్యత్తు ఎంతో బాగుంటుందని అర్ధం.

  మీరు ఎప్పుడైనా రకరకాల జుట్టు కత్తిరించుకొనే విధానాల గురించి కలలు కన్నారా ?

  మీరు ఎప్పుడైనా రకరకాల జుట్టు కత్తిరించుకొనే విధానాల గురించి కలలు కన్నారా ?

  పొడవైన వెంట్రుకల చుట్టలను అందరికీ భాహ్యంగా చూపిస్తున్నట్లు లేదా వాటిని కత్తిరించేసినట్లు లేదా చిన్న చిన్న కొప్పులను అందరికి చూపిస్తున్నట్లు ఎప్పుడైనా కలలు కన్నారా ? అలాగనుక అయితే మీరు శృంగారం మరియు సంసార జీవితంలో స్వతంత్రులుగా వ్యవహరిస్తారని ఇది సూచిస్తుంది. దీనికితోడు ఆ యొక్క వ్యక్తి పెళ్ళైన తరువాత తమ భాగస్వామితో గడిపే జీవితం ఎలా కొనసాగబోతుంది అనే విషయాలకు సంబంధించిన అంతరార్దాల విషయాల గురించి తెలియజేస్తుంది.

  సెక్స్ సంబంధిత క‌ల‌లు వస్తుంటే దేనికి సంకేతం..!!

  మీ కలలో మీరు నగ్నంగా ఉన్నారా ?

  మీ కలలో మీరు నగ్నంగా ఉన్నారా ?

  మీ కలలో మీరు నగ్నంగా ఉన్నట్లు ఊహించుకున్నట్లైతే అది మీకు ఖచ్చితంగా పీడకల లాంటిది. కానీ, అది వారిని ఎంతో లోతుగా గాయపరిచింది అని సూచిస్తుంది. ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఎలా ఎదుటివారు స్వీకరిస్తారు అనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది. ఇటువంటి వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉంటుంది. ఎదుటి వ్యక్తులు ఏమి చెప్పినా చాలా త్వరగా నమ్మేస్తారు. దీనికి తోడు వారి పై చాలా ఎక్కువ నమ్మకాన్ని సులువుగా ఉంచేస్తుంటారు.

  బురదలో మురికి కావడం లాంటి కలలు ఎప్పుడైనా కన్నారా ?

  బురదలో మురికి కావడం లాంటి కలలు ఎప్పుడైనా కన్నారా ?

  బురదలో పొర్లాడుతున్నట్లు లేదా ఎక్కువ బురద మీరు చాలా దగ్గర నుండి చూస్తున్నట్లు మీరు ఎప్పుడైనా కలలు కన్నారా ? ఇలాంటి కలలు మీకు గనుక వస్తే మీరు కొద్దిగా అశాంతి కి లోనవుతున్నారని మరియు అచంచల స్థితి వల్ల ఏర్పడే సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నాయని తెలియజేస్తుంది. మరో ప్రక్క ఒకే విషయం గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తుంటారు అని కూడా ఇది తెలియజేస్తుంది. అందుచేత ఎవ్వరైనా సరే జీవితంలో తాము చేయాల్సిన పనులు చేసుకుంటూ జీవితంలో ముందుకు సాగిపోవడం చాలా ఉత్తమం.

  మీ పళ్ళను కోల్పోయినట్లు మీరు ఎప్పుడైనా కలలు కన్నారా ?

  మీ పళ్ళను కోల్పోయినట్లు మీరు ఎప్పుడైనా కలలు కన్నారా ?

  మీకు ఎప్పుడైనా మీ పళ్ళు ఊడిపోయినట్లు లేదా కోల్పోయినట్లు మీరు కలలు కన్నారా ? ఆలా అయితే మీరు ముసలి వాళ్ళు అయిపోతున్నందుకు భయపడుతున్నారని లేదా మీ యొక్క బాహ్య సౌందర్యం గురించి మరియు ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని అర్ధం. మీరు కొద్దిసేపు శాంతంగా కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి, వయస్సు పెరగటం అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, దీని గురించి మరీ ఎక్కువగా ఆలోచించకూడదు అని కృతనిశ్చయంతో గనుక ఉంటే, ఇటువంటి కలలు రావడం పూర్తిగా ఆగిపోతాయి.

  ఇటువంటి కలలు మీకు మీ జీవితంలో ఎప్పుడైనా వచ్చాయా ? అలా గనుక అయితే మీ యొక్క అభిప్రాయాలను మరియు ఆలోచనలను క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని కొత్త, వింత మరియు నిజమైన వార్తల కోసం మా వెబ్సైటు ని వీక్షిస్తూనే ఉండండి.

  English summary

  Different Dreams And Their Meanings

  These dreams have a hidden meaning behind them. So, check them out…
  Story first published: Tuesday, October 24, 2017, 20:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more