తొమ్మిదేళ్ళ నుంచి గర్భవతిగా ఉన్న ఈ మహిళ!

By: Deepti
Subscribe to Boldsky

ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు, ఆమె జీవితానికి కొత్త అర్థం దొరుకుతుంది. ఒక చిన్న జీవి తనలో పెరుగుతున్నదన్న విషయం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. తొమ్మిది నెలల ప్రయాణం సులభమైనది ఏం కాదు, కానీ చివరన మీ ముందుండే పసిబిడ్డ మొహం అన్ని బాధలనూ తొలగించివేస్తుంది.

కానీ గత తొమ్మిదేళ్ల నుంచి ఒక మహిళ కడుపుతో ఉన్నదని, ఆమె ఇంకా బిడ్డను కూడా కనలేదని చెప్తే ఎలా ఆశ్చర్యపోకుండా ఉంగలరు? ఇది నమ్మటం చాలా కష్టం. కానీ ఒక మహిళ గర్భవతిలా కన్పిస్తూ ఏళ్ళ నుంచి అలానే ఉండటం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

నకిలీ చనుమొనలా? అంటే...

తొమ్మిదేళ్ళ పాటు ఇలా ఉన్న ఆ స్త్రీ గూర్చి మరిన్ని వివరాలు తెలుసుకోండి.

ఆమెవరంటే…

ఆమెవరంటే…

ఈ యువతి పేరు బెరిల్ రొమైన్. ఇంగ్లాండ్ కి చెందిన ఈమె గత తొమ్మిదేళ్ల నుంచి ఎనిమిది నెలల గర్భవతిగా కన్పిస్తున్నా నిజానికి ఆమె గర్భవతి కాదు! మరి ఐతే ఆమె ఇలా కన్పించటానికి కారణం ఏంటి?

దానికి జవాబు ఇదిగో…

దానికి జవాబు ఇదిగో…

ఆమె ఇలా కన్పించటానికి కారణం ఆమెకున్న భయంకర వ్యాధి. రిపోర్టుల ప్రకారం ఆమెకు యుటెరిన్ ఫైబ్రాయిడ్ వల్ల ఆమె పొట్ట 18 అంగుళాలు ఉబ్బిపోయింది !

ప్రేమకోసం కొంతమంది వ్యక్తులు చేసిన పిచ్చిపనులు

ఆమె అనేకమంది వైద్యులను సంప్రదించింది…

ఆమె అనేకమంది వైద్యులను సంప్రదించింది…

ఆమె ప్రపంచమంతా తిరిగి అనేకమంది వైద్యులను సంప్రదించినా, ఆమె వ్యాధికి చికిత్స లేదు. చాలామంది వైద్యులు ఆమె గర్భసంచీని తీయించుకోమని సలహా ఇచ్చారు.

ఆమె అలా చేయాలనుకోలేదు!

ఆమె అలా చేయాలనుకోలేదు!

గర్భసంచీ తీయించుకోమన్నా ఆమె వినకుండా వివిధ మూలికా వైద్యాలను ప్రయత్నించింది. పశ్చిమ ఆఫ్రికాలో ఘనాలోని సంప్రదాయ వైద్యుడిని కూడా సంప్రదించింది.

ఫలితాలు దారుణం!

ఫలితాలు దారుణం!

తన స్థితి చికిత్సకై మూలికా వైద్యం కూడా ప్రయత్నించాక, ఆమెకి తను ఎప్పటికీ తల్లి కాలేననే దారుణ నిజం తెలుసుకుని ఇక సర్జరీయే శరణ్యం అని తెలుసుకుంది!

ఆమె ఆపరేషన్ ను ఎంచుకుంది

ఆమె ఆపరేషన్ ను ఎంచుకుంది

బెరిల్ తన గర్భాశయంలోని ఫైబ్రాయిడ్లను తొలగించుకోడానికి ఆపరేషన్ ను చేయించుకుంది. కానీ ఇతర మహిళలల్లాగా తనకి ఇక వేరే అవకాశాలు లేనందుకు చాలా దారుణంగా బాధపడ్డానని తెలిపింది.

మీ చిటికెన వేలు మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్తుందా?

చాలామంది స్త్రీలు ఈ పరిస్థితి ఎదుర్కొంటారు

చాలామంది స్త్రీలు ఈ పరిస్థితి ఎదుర్కొంటారు

శాస్త్రవేత్తల ప్రకారం ప్రతి 100 మంది మహిళల్లో 50మందికి ఏభై ఏళ్ల వయస్సు వచ్చేసరికి ఫైభ్రాయిడ్లు వస్తాయి. ఈ స్థితి ఊబకాయం ఉన్నవారికి ఎక్కువ వస్తుంది మరియు దీని గూర్చి చాలామంది వైద్యపరీక్ష చేయించుకునేదాకా తెలుసుకోరు.

All Images Source

English summary

Meet The Woman Who Is Pregnant Since 9 Long Years!

Meet The Woman Who Is Pregnant Since 9 Long Years,Check out on the details of this bizarre incident where the woman looks heavily pregnant for the last 9 years.
Story first published: Sunday, June 25, 2017, 16:00 [IST]
Subscribe Newsletter