ప్రజలు ఇప్పటికిప్పుడు తెలుసుకోవాలనుకుంటున్న షాకింగ్ సైంటిఫిక్ ఎక్స్‌పర్మెంట్స్ !

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఒక కొత్త ఆవిష్కరణ జరుగుతూనే ఉంటుందనటంలో సందేహం లేదు. అనేక మిలియన్ల కొత్త ఆవిష్కరణలు, శాస్త్ర ప్రయోగాల నుంచి జీవితాన్ని సులభతరం చేసేవి కొన్నే ఉంటాయి.

జీవనవిధానాన్ని సరళతరం చేసే విషయాలపై పరిశోధన నిరంతరం జరుగుతూనే వస్తోంది.

ఈ వ్యాసంలో, ప్రజలు తమ జీవితాలలో సౌకర్యం కోసం పాటిస్తున్న కొన్ని ఆశ్చర్యకరమైన, ఊహకి కష్టమైన, అద్భుతమైన ప్రయోగాలను పొందుపరిచాం. చదివి, ఆశ్చర్యంలో మునిగిపోండి....

మీ భాగస్వామితో అస్సలు చెప్పకూడని 8 షాకింగ్ విషయాలు

science experiments

3డి ప్రింటు అవయవాలు

మానవాళి కనుగొన్న మేటి సాంకేతికతలో 3డి ప్రింటింగ్ టెక్నాలజీ ఒకటి. అది ఎలా పెరుగుతూ, వ్యాపిస్తోందంటే, శాస్త్రవేత్తలు ఆహారం, యంత్రాలు వంటి అనేక వస్తువులను 3డి ప్రింటర్లను వాడి తయారుచేయగలుగుతున్నారు. ప్రపంచంలో కొన్నిచోట్ల శాస్త్రవేత్తలు, అవయవదాతలు కరువుగా ఉన్న ఈరోజుల్లో ఆ సమస్యను ఈ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కొత్త అవయాలను సృష్టించి అవసరమైన వారి శరీరంలో అమర్చటానికి ప్రయోగాలు చేస్తున్నారు!

science experiments

స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్ లు

పెద్ద సంస్థలు స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్ ల అభివృద్ధి మరియు వాడకానికి శాస్త్రవేత్తలను నియమిస్తున్నాయి. పరిశోధకుల ప్రకారం స్మార్ట్ కాంటాక్ట్ లెన్సులు చిత్రాలను, సమాచారాన్ని లెన్సుల నుండి నేరుగా కళ్ళలోకే ప్రొజెక్ట్ చేస్తాయి. ఆరోగ్యలోపాలను, స్థితులను కూడా గమనించవచ్చు. అద్భుతంగా ఉంది కదా?

ఇండియన్స్ పాటిస్తున్న భయంకరమైన ఆచారాలు

science experiments

కణజాలాన్ని నియంత్రించే ప్రోగ్రామింగ్

ఒక శాస్త్రవేత్తల బృందం డిఎన్ ఎ మరియు జీవకణజాలాన్ని నియంత్రించే పద్ధతిని కనుగొనటానికి ప్రయత్నిస్తోంది. వివిధరకాల కణాలకి వివిధ ప్రోగ్రామింగ్ ప్రత్యేక భాషలు తయారుచేస్తూ, ఈ కణాలు వివిధ వ్యాధులను తగ్గించేవిధంగా మరియు కొత్త రోగాలు రాకుండా ఆపే విధంగా నియంత్రించే విధానాలను తయారుచేయటానికి ప్రయత్నిస్తున్నారు.

science experiments

రోబోలతో లైంగిక సంబంధం

ప్రపంచంలో అనేక సంస్థలకి చెందిన శాస్త్రవేత్తలు మనుషులతో రోబోలు లైంగిక బంధం ఏర్పర్చుకునే సాంకేతికతను తయారుచేస్తున్నారు. మనుషులు రోబోలను లైంగికంగా ముట్టుకోడానికి ఇష్టపడతారా లేదా అని ఒక పరిశోధన కూడా అప్పుడే జరుగుతోంది కూడా.

English summary

Bizarre Science Experiments That People Are Trying!

These scientific experiments can take you to a different level! Here, in this article, we have listed down some of the WOW and bizarre set of experiments that people are following to make their lives simpler.
Subscribe Newsletter