ఒక క్లాస్ రూమ్ ని - డాన్స్ బార్ గా మార్చేశారు

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

గడిచిన కాలంలో, స్కూల్ లో జరిగిన వింత సంఘటనలను గూర్చి తెలుసుకోవడం కోసం న్యూస్ లో చాలా విషయాలను చదువుతాము. విద్యార్థినులతో సన్నిహితంగా మెలిగిన ఫోటోలను షేర్ చేసిన ఉపాధ్యాయుడి భాగోతం గూర్చి మరచిపోకముందే, మరొక సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఉత్తరప్రదేశ్ లో పుట్టినరోజు జరుపుకోవడం కోసం పాఠశాలను డాన్స్ బార్ గా మార్చేసిన ఉదంతం ఇది.

భారత్ లో ఉత్తరప్రదేశ్ లోని మిర్జాపూర్ లో గల, ఒక ప్రభుత్వపాఠశాలలో ఈ సంఘటన జరిగింది.

అలాగే దానికి సంబంధించిన వీడియో ఒకటి బయటపడగా, అది ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయింది.

పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థులతో ఎలా వ్యవహరించాడో తెలిసి అందరూ షాక్!

ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు, మనం ఎలాంటి వ్యవస్థలో ఉన్నామని ఆశ్చర్యమేస్తోంది !

ఇటువంటి వాటికి ముగింపు చెప్పాలంటే, ప్రజలు వారి నడవడికను (నడిచే మార్గాలను) చక్కదిద్దుకోవాలి.

ఈ వింత సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను పరిశీలిద్దాం.

mirzapur

విద్యార్థుల బెంచీలే - స్టేజ్ గా మారింది :

వీడియోలో చూపించిన విధంగా, తాత్కాలిక వేదికపై (బల్లల మీద) మహిళలు నృత్యాలు చేస్తూ ఉంటే, మరొకవైపు మగవాళ్లు వారిపై డబ్బులను వెదజల్లుతున్న దృశ్యాలను చూడవచ్చు. వెనకవైపు నుంచి పెద్దఎత్తున వస్తున్న సంగీతానికి అనుగుణంగా, ఆ మహిళలు బెంచీలపై నృత్యాలను చేస్తున్నారు.

మీరు కూర్చొనే విధానాన్ని బట్టి మీ వ్యక్తిత్వం రివీల్ అవుతుంది!

mirzapur

పాఠశాలను 3 రోజులు మూసివేశారు :

తెలిసిన ఆధారాల ప్రకారం, వారాంతంలోని రక్షా-బంధన్ సందర్భంగా పాఠశాలను మూడు రోజులు మూసివేశారు. ఇలాంటి సమయంలో, ఆ గ్రామపెద్ద ఒకరు ఆ బడి తాళాలను తీసుకుని తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు రాత్రి పార్టీని జరుపుకున్నారు.

mirzapur

ఇది చాలా పెద్ద వేడకగా కనిపించింది :

ఈ వేడుకలకు సమీపప్రాంతాల నుంచి గ్రామపెద్దలుగా హాజరయ్యారని స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ వారంతా, భోజ్పూరి పాటలకు నృత్యం చేస్తున్న మహిళల పై డబ్బును వెదజల్లుతున్నారు. ఆ డాన్సర్ల కదలికలను ఆ గ్రామపెద్ద అనుసరించడాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    When A School Was Turned Into A Dance Bar!

    A government-run primary school in Mirzapur district turned into a 'dance bar' on the occasion of Raksha Bandhan as shown in a video that went viral on soc
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more