For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ రాశిని బట్టీ మీలో రెండు రకాల మనుషులుంటారు

By Y BHARATH KUMAR REDY
|

ప్రతి రాశివారికి అనుగుణంగా కొన్ని సానుకూల విషయాలుంటాయి. అలాగే ప్రతికూల పరిస్థితులుంటాయి. మన బలాలతో పాటు బలహీనతలు కూడా తెలుసుకుంటేనే మంచిది. ప్రతి రాశివారు వారికి కలిగే ప్రయోజనాలతో పాటు నష్టాలను కూడా తెలుసుకుంటే జీవితంలో వారు ఈజీగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే రాశిని బట్టి వ్యక్తిత్వం ఉంటుంది. కొందరు వారి రాశి ప్రకారం మంచి వ్యక్తిత్వాలు కలగి ఉంటారు. ఎవరికీ తెలియని ఇంకో వ్యక్తిత్వం కూడా కలిగి ఉంటారు. మేషరాశి, వృషభరాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్య రాశి, తులరాశి, వృశ్చికరాశి, ధనుస్సు రాశి, మకర రాశి, కుంభం, మీన రాశి ఇలా ఇందులో ఏదో ఒక రాశి మీది ఉంటుంది కదా. ఈరాశులను బట్టి మీ వ్యక్తిత్వం ఏమిటి.. అలాగే మీలో ఉండే మరో కోణం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చదవండి మరి. మీ గురించి మీకే చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.

1. మేషరాశి

1. మేషరాశి

ఈ రాశి వారు చాలా పవర్ ఫుల్ గా ఉంటారు. ఎక్కడ శక్తి అంతా వీరి వద్దే ఉంటుంది. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందిస్తుంటారు. అయితే వీరు కాస్త ఉద్వేగభరితంగా ఉంటారు. ప్రేరణతో పని చేస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. జీవితంలో వీరు వెళ్తున్న దారిని అలా పూలమయం చేసుకుని నడుస్తూ ఉంటారన్నమాట. ఒకరిపై ఆధారపడకుండా ఉంటారు. ఏ సవాలునైనా ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉంటారు. అదే భరోసాతో జీవితంలో పయనిస్తుంటారు.

2. మేష రాశి వారి మరో కోణం

2. మేష రాశి వారి మరో కోణం

వీరికి ఎన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయో అన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఈ రాశి వారు ఉంటుంటూనే విసుగు చెందుతారు. మూడిగా ఉంటారు. వీరికి దూకుడు కూడా ఎక్కువేనండోయ్. వీరికి అనుగుణంగా పనులు కాకపోతే ఇక కోపం కట్టలు తెచ్చుకుంటుంది. ఇక వీరు అనుకున్నదే కావాలనుకుంటారు. వారు ఎంచుకున్న మార్గంలోనే ముందుకెళ్తుంటారు.

3. వృషభరాశి

3. వృషభరాశి

వీరు వారి జీవితంలో స్థిరత్వం పొందడానికి బాగానే కష్టపడుతుంటారు. ఇక వీరు వారి జీవితాన్ని మొత్తం తమకిష్టమైన వ్యక్తులకే అంకితం చేసి ఉంటారు. ఇక వీరు ఎవరితోటైతే రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నారో వారి వెంటే జీవితాంతం ఎంతో విశ్వాసంగా ఉంటారు. వీళ్లు అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయడానికి నిత్యం కష్టపడుతుంటారు. వీరు మంచి హార్డ్ వర్కర్స్. వీరు జీవితంలో చాలా కష్టాను ఎదుర్కొని ఉంటారు. చాలా చిన్నస్థాయి నుంచి మంచి స్థాయికి ఎదిగి ఉంటారు.

4. వృషభ రాశి వారి మరో కోణం

4. వృషభ రాశి వారి మరో కోణం

ఈ రాశి వారు చాలా మొండివారు. వీరు ఏది అనుకుంటే అది కావాలనుకుంటారు. ఇక ప్రతి ఒక్కరూ తమ ఆధీనంలోనే ఉండాలనుకునే స్వభావం కలిగి ఉంటారు. చిన్నచిన్న విషయాలకు కూడా వీరు కాస్త ఎక్కువగా స్పందిస్తుంటారు.

5. మిథున రాశి

5. మిథున రాశి

ఈ రాశి వారు ఇతరులతో ఈజీగా కలిసి పోతారు. ఫ్రెండ్లీగా ఉంటారు. మనసులో ఏది ఉంటే అది చెబతారు. ఓపెన్-మైండెడ్ గా ఉంటారు. అంతేకాదండోయో వీరు ఎక్కువగా తిరగడానికి ఇష్టపడతారు. స్వేచ్ఛగా విహరించాలనుకుంటారు. లైఫ్ మొత్తం ఎంజాయ్ గా ఉండాలనుకుంటారు. ఏమాత్రం ఇబ్బందులు ఎదురైనా తట్టుకోలేరు. ఇక వీరికి లెక్కలేనంతమంది స్నేహితులుంటారు. అలాగే వీరు ఎలాంటి సాహసానికైనా రెడీ అనే గుణం కలిగి ఉంటారు.

6. మిథున రాశి వారి మరో కోణం

6. మిథున రాశి వారి మరో కోణం

ఇక ఈ రాశి వారిలో ఉండే మరో కోణం ఏమిటో తెలుసుకుందామా. ఇక వీరు తీసుకునే నిర్ణయాలు కూడా అలానే ఉంటాయి. ఇష్టానుసారంగా ఏమి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇక వీరు ఒత్తిడికి గురైనా లేదంటే నిరుత్సాహంగా, ఆందోళనగా ఉన్నప్పుడు వారి అసలు వ్యక్తిత్వం ఏమిటో తెలుస్తుంది.

7. కర్కాటక రాశి

7. కర్కాటక రాశి

ఈ రాశి వారు చాలా పాజిటివ్ గా ఉంటారు. వీరికి అనేక మంచి లక్షణాలుంటాయి. అయితే వీరిపై వీరికి కాస్త నమ్మకం, గౌరవం తక్కువగా ఉంటుంది. కానీ వీరు చాలా ఉన్నతస్థాయికి ఎదుగుతారు. అంకిత భావంతో పని చేస్తారు. అనుకున్నది సాధించే వరకు పోరాడుతూనే ఉంటారు. చాలా నిజాయితీగా ఉంటారు. నమ్మకమైన మనస్సు కలిగి ఉంటారు. నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. ఎదుటివారిపై ఎక్కువ విశ్వాసం కలిగి ఉంటారు. ఇక వీరు ఎదుటి వ్యక్తులు చెప్పే ప్రతి విషయాన్ని ఓపికతో వింటారు. వీరిలో సృజనాత్మకత ఎక్కువ ఉంటుంది. చాలా దయగల వ్యక్తులు. సున్నితమైన మనస్కులు. వీరి మనస్సు చాలా నిష్కమలంగా ఉంటుంది.

8. కర్కాటక రాశి వారిలో ఉండే మరో కోణం ఇదే

8. కర్కాటక రాశి వారిలో ఉండే మరో కోణం ఇదే

వీరు ఎలాంటి వారినైనా ఎదుర్కొనే శక్తి కలగి ఉంటారనే విషయం చాలామందికి తెలియదు. అయితే వీరు చిన్న విషయాలకే కాస్త ఇబ్బందిపడిపోతుంటారు. ఆందోళనకు గురవుతారు. నిరాశ చెందుతారు. మానసికంగా కుంగిపోతారు.

9. సింహరాశి

9. సింహరాశి

వీరూ పుట్టుకతోనే మంచి వ్యక్తిత్తం కలిగి ఉంటారు. గ్రేట్ లీడర్స్ మాదిరిగా ఉంటారు. వీరు ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తారు. అలాగే బాగా తిరగాలని భావిస్తుంటారు. వీరు కాస్త ఫన్నీగా ఉంటారు. మంచి చార్మింగ్ వీరిలో ఉంటుంది.

10. సింహరాశి వారిలో ఉండే మరో కోణం

10. సింహరాశి వారిలో ఉండే మరో కోణం

ఇక వీరిలో ఉండే మరోకోణం గురించి తెలుసుకుంటే కాస్త ఆశ్చర్యంగా అనిపించొచ్చు. వీరికి ఇతరులతో కలిసి పని చేయడం అంటే అంతగా ఇష్టం ఉండదు. అలాగే ఎవరి ద్వారానైనా పని నేర్చుకోవాలంటే చాలా ఇబ్బందులుపడుతారు. ఆ సమయంలో వీరు తమను తాము ఎక్కువగా అంచనా వేసుకుంటారు.

11. కన్యరాశి

11. కన్యరాశి

కన్యరాశివారు ప్రతి విషయంలో కాస్త ఎక్కువగా అవగాహన కలిగి ఉంటారు. వీరు ప్రతి సమస్యకు పరిష్కారమార్గాన్ని అన్వేషిస్తారు. ప్రతిదానిపై విశ్లేషణాత్మక అవగాహన వీరికి ఉంటుంది. సమస్యల్ని పరిష్కరించడంలో వీరు ప్రతిభ అమోఘం. అలాగే వీరు ఎదుటువారు చెప్పే ప్రతి మాటను ఓపికగా వింటారు.

12. కన్య రాశి వారిలో మరో కోణం

12. కన్య రాశి వారిలో మరో కోణం

వీరు ప్రతి విషయాన్ని కాస్త ఎక్కువగా చేసి చూస్తారు. అలాగే వీరు జీవితాన్ని కూడా బాగా సీరియస్ గా తీసుకుంటారు. వీరు ప్రతి విషయంలోనూ ఒక ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. అంతేకాదండోయ్.. వీరు ప్రతి ఒక్కరినీ విమర్శిస్తూ ఉంటారు.

13. తులరాశి

13. తులరాశి

ఈ రాశి వారు ప్రతి ఒక్కరితో ఈజీగా కలిపిపోతారు. ప్రతి ఒక్కరినీ బాగా ప్రేమిస్తారు. ప్రతి ఒక్కరి పట్ల దయతో ఉంటారు. మంచి నేర్పును కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో వీరికి వీరే సాటి. గొప్ప మానవతావాదులు. ఎల్లప్పుడూ తమ జీవితాలు బాగుండాలని కోరుకుంటారు. జీవితాన్ని బ్యాలెన్స్ గా కొనసాగిస్తుంటారు.

14. తుల రాశి వారి మరో కోణం

14. తుల రాశి వారి మరో కోణం

వీరు ఏ విషయాన్ని కూడా విస్మరించరు. అయితే కొన్ని సందర్భాల్లో ఇదే వారికి ఆటంకాలు తెచ్చే అవకాశం ఉంది. జీవితానికి సంబంధించిన చాలా విషయాలపై వీరు అవగాహన పెంచుకోవాలి.

15. వృశ్చికరాశి

15. వృశ్చికరాశి

వీరు బాగా తెలివిగల వారు. వీరిలో సెన్సాఫ్ హ్యుమర్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా ఉద్వేగంగా ఉంటారు. చాలా ఎమోషనల్ గా ఉంటారు. వీరి తమ ఫీలింగ్స్ ను బయటపడనివ్వరు. వీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. వీరు తమకు తాము స్వతంత్రంగా ఉండాలని భావిస్తుంటారు.

16. వృశ్చిక రాశి వారి మరో కోణం

16. వృశ్చిక రాశి వారి మరో కోణం

వీరిలో మరో కోణం చాలా భయంకరంగా ఉంటుంది. వీరిని ఎవరైనా సవాలు చేస్తే ఒక రేంజ్ లో ద్వేషిస్తారు. వీరికి కూడా కోపము కూడా ఎక్కువే. చాలా సందర్భాల్లో అసహనం వ్యక్తం చేస్తుంటారు.

17. ధనుస్సు రాశి

17. ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు తమలో తాము కాస్త సతమతమవుతుంటారు. వీరు ఇతరులను ఈజీగా అట్రాక్ట్ చేస్తారు. అయస్కాంతం మాదిరిగా ఇతరులను అట్టే ఆకట్టుకుంటారు. వీరు అన్ని విషయాల్లో సానుకూలంగా ఉంటారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇతరులకు స్ఫూర్తినిస్తూ ఉంటారు. బాగా తిరగాలనే మనసత్వం కలిగి ఉంటారు.

18. ధనుస్సు రాశి వారి మరో కోణం

18. ధనుస్సు రాశి వారి మరో కోణం

వీరు వారి లక్ష్యాన్ని చేరుకునేందుకు, అలాగే తమకు అప్పగించిన పనిని పూర్తి చేయడంపైనే ఎక్కువగా దృష్టి సారించడానికి ఇష్టపడరు. ఇక వీరికి కోపం కూడా ఎక్కువే. నిగ్రహం తక్కువే. వీరికి ఒక స్పష్టమైన లక్ష్యం అంటూ ఉండదు. వీరు ఎక్కువగా బోర్ గా ఫీలవుతుంటారు.

19. మకర రాశి

19. మకర రాశి

ఈ రాశివారు బాగా హార్డ్ వర్కర్స్. అలాగే వీరికి సంపద కూడా ఎక్కువే ఉంటుంది. అలాగే ఎప్పుడు విజయపథంలో పయనిస్తుంటారు. వీరు మంచి తెలివైన వారు కూడా. ఇతరులకు ప్రేరణ ఇస్తుంటారు. వీరు ఎక్కువ వారు చేసే పనినే నమ్ముతారు.

20. మకర రాశి వారిలో మరో కోణం

20. మకర రాశి వారిలో మరో కోణం

వీరు కాస్త మొండి పట్టుదల కలిగి ఉంటారు. సమస్యాత్మక సమయాల్లో వీరు బాగా నిరుత్సాహపడతారు. ఇతరులు వారి ఐడియాస్ చెబుతుంటే వీరు వినడానికి ఇష్టపడరు. వీరికి నిగ్రహం కూడా ఎక్కువగా ఉండదు. ఎక్కువ చిరాకు పడుతుంటారు.

21. కుంభం

21. కుంభం

ఈ రాశివారు అత్యంత ఆసక్తికరమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరికి ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం. కొత్త వ్యక్తులతో ఇట్టే కలిసిపోతారు. దేనినైనా ఎదుర్కొంటామనే ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరికి భిన్నమైన ఆసక్తులుంటాయి. గంటల తరబడి నాన్ స్టాప్ గా మాట్లాడగల నైపుణ్యం వీరికి ఉంటుంది. వీరు మంచి లీడర్ షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. వీరికి మంచి మనసు ఉంటుంది.

22. కుంభం రాశి వారి మరో కోణం

22. కుంభం రాశి వారి మరో కోణం

కొన్నిసార్లు ఎక్కువగా భావోద్వేగానికి గురువుతుంటారు. ఇది అంత చెడ్డ విషయం కాకపోవొచ్చు. కానీ ఈ భావోద్వేగమే వీరితో సన్నిహితులుగా ఉండే వారిని కాస్త ఇబ్బందిపెడుతుంది. ఎమోషన్ విషయాలను ఎలా కంట్రోలు చేసుకోవాలనే విషయం వీరికి ఎక్కువగా తెలియదు.

23. మీన రాశి

23. మీన రాశి

వీరు చాలా సున్నితమనస్కులు. వీరికి భావోద్వేగం కూడా ఎక్కువే ఉంటుంది. వీరి చాలా సానుభూతిపరులుగా ఉంటారు. వీరు మంచి స్నేహితులుగా ఉంటారు. అలాగే మంచి భాగస్వాములు కూడా. స్నేహితులు, వీరిని ప్రేమించే వారి ఎక్కువ నమ్మకంతో ఉంటారు. వారి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు.

24. మీన రాశి వారి మరో కోణం

24. మీన రాశి వారి మరో కోణం

వీరు ఏవైనా కష్టాలు వస్తే వాటిని తప్పించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తారు. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. అంతేకాదు ప్రతి చిన్న విషయానికి ఆందోళనపడుతుంటారు. వీరి చాలా ఆందోళనపరులు. వీరితో పాటు వీరి పక్కన ఉన్నవారిని కూడా ఆందోళనపెడుతుంటారు.

English summary

The Two Sides Of Each Zodiac Sign Explained

We all possess both positive and negative qualities in ourselves, and we need to learn on how we will use both our strengths and weaknesses to grow and prosper in life. Each zodiac sign has a flip side to it and the details about the flip side of each zodiac sign is surprising to know, as this is totally opposite of the typical characteristic traits of the zodiac signs.
Story first published:Saturday, November 11, 2017, 10:24 [IST]
Desktop Bottom Promotion