మీ చేతిపై ఉండే హృదయ రేఖ చాలా విషయాలు చెబుతుంది

Written By:
Subscribe to Boldsky

మన అరచేతిపై ఉండే రేఖలు మనకు ఎన్నో విషయాలు తెలుపుతాయి. మన భవిష్యత్తు ఎలాగుండనుంది.. మన జీవితం ఎలా కొనసాగనుందనే విషయాలు మొత్తం మన చేతి రేఖలపైనే ఆధారపడి ఉంటుందని చాలా మంది నమ్మకం. అయితే చేతిపై హార్ట్ లైన్ అనేది ఒకటి ఉంటుంది. దీన్నే హృదయ రేఖ అంటారు. ఈ రేఖ చాలా విషయాలు తెలుపుతుంది. హృద‌య రేఖ మ‌న‌ భావాల‌ను, శారీర‌క, మాన‌సిక సంబంధ‌, బాంధ‌వ్యాలనూ తెలుపుతుంది.

హృదయ రేఖ

హృదయ రేఖ

మొదట మీ అరచేతిలో హృదయ రేఖ ఎక్కడుందో మీరు గుర్తించండి. మీ కుడి అరచేతిలో చూపుడు వేలుకు సమీపంలో ఇది ఉంటుంది. ఇక్కడ చిత్రంలో చూపించినట్లుగా హృదయ రేఖ ఉంటుంది.

జీవన రేఖ

జీవన రేఖ

హృదయ రేఖను జీవన రేఖ అని కూడా అంటారు. మీ ప్రేమ జీవితానికి సంబంధించిన ప్రతిదీ అంతా ఇక్కడ పూర్తిగా మ్యాప్ చేయబడింది. మీ వైఖరి నుండి, మీ సంబంధాలకు, మరియు మీ భావోద్వేగాలు కూడా మీ హృదయ రేఖలో కనిపిస్తాయి.

సైజ్ ను బట్టీ

సైజ్ ను బట్టీ

మీ హృదయ రేఖ సైజ్ ను బట్టీ కూడా మీకు సంబంధించి చాలా విషయాలు చెప్పవచ్చు. మీరు ఎంత కాలం జీవించబోతున్నారనే విషయం ఈ రేఖ పొడవు ద్వారా తెలుస్తుంది. అలాగే మీ జీవితానికి సంబంధించిన చాలా విషయాల్ని ఈ రేఖ తెలుపుతుంది. హృదయ రేఖ చిన్నగా ఉంటే మీరు మీరు కాస్త దురుసుగా వ్యవహరిస్తారని అర్థం.

పొడువుగా ఉంటే

పొడువుగా ఉంటే

హృదయ రేఖ ఎక్కువ పొడువున్న వ్యక్తులు ముక్కు సూటిగా ఉంటారు. వీరు ముందు ఒక మాట వెనకా ఒక మాట చెప్పే మనుషులు కాదు. వీరు చాలా విశ్వాసంగా ఉంటారు.

మధ్య వేలు దగ్గర వరకు ఉంటే

మధ్య వేలు దగ్గర వరకు ఉంటే

ఈ రేఖ మీ మధ్య వేలు దగ్గరి వరకు ఉంటే అలాంటి వాళ్లు చాలా తెలివైన వారని అర్థం. అంతేకాదు వీరు ఒకరి మాట వినాలని అనుకోరు. స్వతంత్ర్యంగా ఉండాలని భావిస్తారు. అలాగే వీరిలో సెల్పిష్ అనేది ఉండదు.

మధ్యవేలు, చూపుడివేలికి మధ్యలో ఉంటే

మధ్యవేలు, చూపుడివేలికి మధ్యలో ఉంటే

హృదయ రేఖ మీ మధ్య వేలు, బొటన వేలికి మధ్యలో ఉంటే మీరు శాంతియుతంగా ఉంటారని అర్థం. వీరికి దయా గుణం ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా నమ్మకస్తులుగా ఉంటారు.

చూపుడివేలికి దగ్గరి వరకు ఉంటే

చూపుడివేలికి దగ్గరి వరకు ఉంటే

హృదయ రేఖ చూపుడివేలి దగ్గరి వరకు ఉంటే వీళ్లు ప్రతి విషయంలో ఆనందంగా ఉంటారని అర్థం. ఎప్పుడూ సంతోషంగా ఉంటారని సూచన. వీరు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తారు. ఎప్పుడూ ఆనందగానే ఉంటారు.

ప్రధాన రేఖను కలిస్తే

ప్రధాన రేఖను కలిస్తే

హృదయ రేఖ ప్రధాన రేఖను కలిస్తే.. అలాంటి వ్యక్తులు చాలా సైలెంట్ గా ఉంటారని అర్థం. ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోకుండా తమ పని తాము చేసుకుంటారంట.

English summary

what your heart line tells you about your love life

Everything That You Need To Know About Your Heart Line
Story first published: Monday, December 18, 2017, 9:00 [IST]