దిన ఫలాలు: గురువారం 14 డిసెంబర్ 2017

By: Deepthi
Subscribe to Boldsky
Daily Horoscope Telugu దిన ఫలాలు 14 -12-2017

భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.

ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..

Check out your daily horoscope for 14th December 2017

ఓం శ్రీ గురుభ్యోనమః

అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.

ది.14-12-2017 తారీఖు, గురువారం నాటి దినఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, మార్గశిర మాసం, బహుళ ద్వాదశి రాత్రి, తెల్లవారితే 5 గంటల 53 నిమిషాల వరకూ ఉన్నది. స్వాతి నక్షత్రం రాత్రి 10 గంటల 41 నిమిషాల వరకూ ఉంది. అమృత సమయం మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాల నుంచి 5 గంటల 6 నిమిషాల వరకూ ఉన్నది. వర్జ్యం ఉదయం 7 గంటల 20 నిమిషాల వరకూ. దుర్ముహర్తం ఉదయం 10 గంటల 4 నిమిషాల నుండి 10 గంటల 45 నిమిషాల వరకూ ఉన్నది. మరలా దుర్ముహర్తం మధ్యాహ్నం రెండుంపావు నుండి 3 గంటల వరకూ ఉన్నది. సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 23 నిమిషాలకు, సూర్యాస్తమయ సమయం 5 గంటల 23 నిమిషాల వరకూ

మేష రాశి వారికి ;

మేష రాశి వారికి ;

చేయు పనులు బాధ్యతగా చేస్తారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు. ఇంటికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల సుఖం కోసం చేయవలసినవన్నీ చేస్తారు. వృత్తి వ్యాపారాలు భాగ్యాన్ని ఇస్తాయి.

వృషభ రాశి వారికి ;

వృషభ రాశి వారికి ;

చేయు పనులు సఫలం అవుతాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. పనివారి సహకారం పూర్తిగా ఉంటుంది. పిల్లలు బాధ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మిథున రాశి వారికి ;

మిథున రాశి వారికి ;

సొంత పనులు పూర్తి చేయటానికి ఇబ్బందులు ఉంటాయి. ధనానికి చిక్కులు కలవు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. భార్య సహకారంగా మసులుకోగలదు. వృత్తి వ్యాపారాలు లాభాన్ని ఇస్తాయి.

కర్కాటక రాశి వారికి ;

కర్కాటక రాశి వారికి ;

తల్లిని మంచిగా చూసుకుంటారు. ఇంటి పనులను పూర్తి చేస్తారు. పిల్లలు వారి పనులు బాధ్యతగా పూర్తి చేసుకుంటారు. దూరపు బంధువుల సమాచారం వింటారు. వృత్తి వ్యాపారాలు పట్టుదలతో పూర్తి చేస్తారు.

సింహ రాశి వారికి ;

సింహ రాశి వారికి ;

ఇంటి గురించి ఆలోచిస్తారు. ధన ప్రణాళికలు వేస్తారు. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. దగ్గరి బంధువుల రాకపోకలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కన్యా రాశి వారికి ;

కన్యా రాశి వారికి ;

సోదర సహకారం ఉంటుంది. ధన ప్రణాళికలు కార్య రూపం దాలుస్తాయి. తల్లి గారి ఆశీర్వాదం పొందుతారు. పిల్లల యెడల ప్రత్యేక శ్రద్ధ అవసరం. బంధువుల సహకారంతో వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి.

తులా రాశి వారికి ;

తులా రాశి వారికి ;

తలచిన పనులు పూర్తి అవుతాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. భార్య సహకారంగా మసులుకోగలదు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

వృశ్చిక రాశి వారికి ;

వృశ్చిక రాశి వారికి ;

ఆధ్యాత్మికత వైపు మనసు మళ్ళుతుంది. మంచి కార్యక్రమాలకు చందా రూపంలో ఎంతో కొంత సహకారం అందిస్తారు. దైవ దర్శన ప్రాప్తి కలదు. భార్యను ప్రేమగా చూసుకొంటారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

ధనూ రాశి వారికి ;

ధనూ రాశి వారికి ;

అనుకున్న పనులు బాధ్యతగా చేయవలసి ఉంటుంది. ధనానికి ఇబ్బందులు ఉంటాయి. సోదరుల సహకారం ఉండగలదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. పిల్లలు బాధ్యతను ఎరిగి ప్రవర్తిస్తారు.

మకర రాశి వారికి ;

మకర రాశి వారికి ;

చేయు పనులు ఆలస్యమవుతాయి. ధనానికి కొరతగా ఉంటుంది. భూ సంబంధ కార్యక్రమాలకి అనుకూలమైన రోజు. అధికారులు ప్రసన్నంగా మసలుకొంటారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కుంభ రాశి వారికి ;

కుంభ రాశి వారికి ;

చేయు పనులు లాభాన్ని ఇస్తాయి. దూరపు బంధువుల సమాచారం వింటారు. తండ్రి గారి సహకారం ఉంటుంది. భార్య సహకారం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి.

మీన రాశి వారికి ;

మీన రాశి వారికి ;

చేయు పనులలో విఘ్నాలు ఉంటాయి. దైవ దర్శన ప్రాప్తి కలదు. వృత్తి వ్యాపారాలు బాధ్యతతో చేయవలసి ఉంటుంది. తండ్రి గారి ఆశీర్వాదం పొందండి. కొత్త అవకాశాలు చేజారకుండా ఉండగలవు.

ఇప్పటివరకూ ఈ నాటి దినఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు.

సర్వేజనా సుఖినోఃభవంతు

సమస్త సన్మంగళానిభవంతు

అందరికీ నా నమస్కారం.

English summary

horoscope for 14th December 2017 | daily horoscope | astrology

Astrology is that science which studies the effect of the stars and other celestial bodies have on our lives. They influence our past, present and future too. Studying their movement can help us predict the events happening in our future.
Subscribe Newsletter