దిన ఫలాలు: శనివారం 16 డిసెంబర్ 2017

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky
Daily Horoscope Telugu దిన ఫలాలు 16 -12-2017

భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.

ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..

ఓం శ్రీ గురుభ్యోనమః

అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.

ది.16-12-2017 తారీఖు, శనివారం నాటి దినఫలాలను ఒకసారి పరిశీలిద్దాం.

హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, మార్గశిర మాసం, బహుళ త్రయోదశి ఉదయం 7 గంటల 14 నిమిషాల వరకూ ఉంది. అనురాధా నక్షత్రం రాత్రి తెల్లవారితే 3 గంటల 23 నిమిషాల వరకూ ఉంది. అమృత సమయం సాయంత్రం 5 గంటల 4 నిమిషాల నుండి 6.48 నిమిషాల వరకూ ఉంది. వర్జ్యం ఉదయం 6 గంటల 38 నిమిషాల నుండి 8 గంటల 22 నిమిషాల వరకూ ఉంది. దుర్ముహర్తం ఉదయం 7 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 23 నిమిషాలు.

మేష రాశి వారికి ;

మేష రాశి వారికి ;

విందు భోజనం లభిస్తుంది. ఇంటికి సంబంధించిన పనులు బాధ్యతగా పూర్తి చేస్తారు. కొన్ని అవకాశాలు చేజారే అవకాశం ఉంది. తండ్రి గారి ఆశీర్వాదం పొందండి. శుభం జరగగలదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభ రాశి వారికి ;

వృషభ రాశి వారికి ;

భార్య సహకారం ఉంటుంది. అనుకున్న పనులు సులువుగా సాగుతాయి. పని వారి సహకారం ఉంటుంది. విదేశాల నుంచి మంచి వార్త వింటారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మిథున రాశి వారికి ;

మిథున రాశి వారికి ;

చేయు పనులలో ఆటంకాలు ఉంటాయి. ధన ఇబ్బందులు కలవు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. భార్య అనుకూలంగా ఉండగలదు. వృత్తి వ్యాపారాల్లో చిక్కులు కలవు.

కర్కాటక రాశి వారికి ;

కర్కాటక రాశి వారికి ;

చేయు పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ పూర్తి చేయగలుగుతారు. ఇంటికి సంబంధించిన పనులు ఆనందంగా జరగగలవు. పిల్లల సౌఖ్యం చూస్తారు, ఆనందంగా గడుపుతారు. భార్యతో అనుకూలంగా మసలవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.

సింహ రాశి వారికి ;

సింహ రాశి వారికి ;

అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మాతృ సుఖం చూస్తారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. దైవ దర్శన ప్రాప్తి కలదు.

కన్యా రాశి వారికి ;

కన్యా రాశి వారికి ;

దగ్గరి ప్రయాణాలు చేస్తారు. సోదరుల రాకపోకలు ఉంటాయి. ఇంటి పనులపై బాధ్యత చూపించవలసి ఉంటుంది. పిల్లల యెందు శ్రద్ధ అవసరం. పని వారి సహకారం ఉంటుంది.

తులా రాశి వారికి ;

తులా రాశి వారికి ;

మనస్సు ఆనందంగా ఉంటుంది. ధన ప్రణాళికలు వేస్తారు. సోదరులతో బాధ్యతగా వ్యవహరించవలసిన సమయం. భార్యతో అనుకూలంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

వృశ్చిక రాశి వారికి ;

వృశ్చిక రాశి వారికి ;

మనస్సు ఆనందంగా ఉంటుంది. మంచి ఆలోచనలు చేస్తారు. అనుకున్నది అనుకున్నట్టు జరపటానికి ప్రయత్నం చేస్తారు. దైవ దర్శన ప్రాప్తి కలదు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా నడుస్తాయి.

ధనస్సు రాశి వారికి ;

ధనస్సు రాశి వారికి ;

చేయు పనులలో ఆటంకాలు ఉంటాయి. ధనం కోసం అప్పు చేయవలసి వస్తుంది. అనుకోని చిక్కులు ఉంటాయి. దుర్గా ఆరాధన చేయండి. అంతా మంచిగా జరగగలదు.

మకర రాశి వారికి ;

మకర రాశి వారికి ;

చేయు పనులలో ఆటంకాలు ఉంటాయి. అధికారులు ప్రసన్నం అవుతారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. దుర్గా దేవి పూజ చేయండి. అంతా మంచే జరగగలదు.

కుంభ రాశి వారికి ;

కుంభ రాశి వారికి ;

అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. భూ సంబంధ పనులకు మంచి రోజు. సహచరుల సహకారం ఉంటుంది. చేయు పనులందు లాభాలు వస్తాయి. తండ్రి గారి ఆశీర్వాదం పొందండి. అంతా విజయవంతం అవ్వగలదు.

మీన రాశి వారికి ;

మీన రాశి వారికి ;

చేయు పనులందు ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. తండ్రి గారి ఆశీర్వాదంతో అంతా మంచే జరగగలదు. పిల్లల యెందు ప్రేమ చూపించండి. దైవ దర్శనం చేయండి.

ఇప్పటి వరకూ ఈ నాటి దినఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు.

సర్వేజనా సుఖినోఃభవంతు

సమస్త సన్మంగళానిభవంతు

అందరికీ నా నమస్కారం.

English summary

horoscope for 16th December 2017 | daily horoscope | astrology

Did you know that all the 12 horoscopes are assigned with any of the four elements- Fire, Air, Earth and Water? There are three zodiac signs assigned to each element and hence they are called as Triplices. All the zodiac signs which come under each of these elements have few common characteristics.