దినఫలాలు: శనివారం 2 డిసెంబర్ 2017

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

గ్రహాల స్థితులు, వాటి గమనాలు మన జీవితాలపై ఎలా ప్రభావం చూపిస్తాయో అధ్యయనం చేసే శాస్త్రమే జ్యోతిష్యం. జ్యోతిష్యశాస్త్రం మన మనస్సుకి విశ్వానికి సంబంధం ఉన్నదని చెప్తుంది. సూర్యుడు రోజు సమయంలో వివిధ నక్షత్ర సమూహాలగుండా ప్రయాణిస్తాడని, వాటినే జన్మరాశులని చెప్తుంది. అలా జ్యోతిష్యనిపుణులు ఒక మనిషి యొక్క నడత, భావాలు, భవిష్యత్తు అన్నీ వారు పుట్టిన నెల, నక్షత్రం, సమయంపై ఆధారపడి ఉంటాయని జాతకాలు చెప్తారు. ఈ జాతకాలు భవిష్యత్తు సంఘటనల అవకాశాలను ఊహించగలవు కానీ సరిగ్గా ఒక మనిషికి ఏం జరుగుతుందో చెప్పలేవు. అది వారి నియమానికి విరుద్ధం. కానీ మన గురించి మనకి తెలియనిది కొత్తది ఏదైనా తెలుసుకోవటం ఎప్పుడూ థ్రిల్ యే కదూ!

ఈ ప్రాచీన విజ్ఞానం ఇప్పుడు యువతలో కూడా మెల్లగా క్రేజ్ పెంచుకుంటోంది. మన దేశం దాటి పక్క దేశాలకు కూడా వ్యాప్తి చెందుతోంది. జ్యోతిష్యం జరిగే అవకాశాలున్న విషయాలు ఎన్ని చెప్పినా, స్వశక్తికి ఉన్న బలాన్ని ఎన్నడూ కాదనదు. జరగబోయే అవకాశాలున్న విషయాలు తెలుసుకుని వాటిల్లో సానుకూలంగా అడుగేయటం మంచిది కాబట్టే జ్యోతిష్యం అంటే అందరికీ గురి. అందుకని మీ చుట్టుపక్కల వారు తమ దినఫలాలను తెలుసుకుంటుంటే, మరెందుకు ఆలస్యం? మీరు కూడా తెలుసుకోండి.

అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన ప్రముఖ జ్యోతిష్యవేత్త బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారు, వివిధ రాశులకు ఈ నాటి దినఫలాలను అందిస్తున్నారు. వారి మాటలలోనే ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉండబోతోందో తెలుసుకోడానికి వ్యాసం మొత్తం చదవండి...

మేష రాశి వారికి :

మేష రాశి వారికి :

తలచిన పనులు నెరవేరగలవు. మీ తల్లిగారిని ప్రేమగా చూసుకోండి. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తండ్రిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

వృషభ రాశి వారికి :

వృషభ రాశి వారికి :

భార్యను ప్రేమతో గెలుస్తారు. వ్యవహారాలు సజావుగా సాగుతాయి. తండ్రిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకున్న విధంగానే సాధిస్తారు.

మిథున రాశి వారికి :

మిథున రాశి వారికి :

బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ధన ఇబ్బంది కలదు. పిల్లలు వారి పట్టుదలతో వారి పనులు చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మసులుకోవాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కర్కాటక రాశి వారికి :

కర్కాటక రాశి వారికి :

చేయు పనులలో ఆటంకాలు ఉంటాయి. పట్టుదలగా ఇంటి పనులు చేయవలసి ఉంటుంది. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. భార్య చేయు పనులు ఆటంకాలు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

సింహ రాశి వారికి :

సింహ రాశి వారికి :

దగ్గరి బంధువుల రాకపోకలు ఉంటాయి. దగ్గరి ప్రయాణం కూడా చేయవలసి వస్తుంది. ఇంటి పనులు చేయటంలో జాగ్రత్త అవసరం. పిల్లలు చేయు పనులు ఆలస్యంగా చేస్తారు. దైవదర్శన ప్రాప్తి కలదు. తండ్రిగారి సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి.

కన్యా రాశి వారికి :

కన్యా రాశి వారికి :

వ్యాపార నిమిత్తం దీర్ఘ ప్రణాళికలు వేస్తారు. అధికారుల మన్ననలు కలవు. ఇంటి పనులపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పిల్లల ప్రవర్తనపై ఒక కన్నేసి ఉంచాల్సి ఉంటుంది. చేతికొచ్చిన అవకాశాలు జారిపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. వృత్తి వ్యాపారాలు జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. మీ పనివారి సహకారం మీకు పూర్తిగా ఉంటుంది. భార్య మాటలు మీకు సంతోషాన్ని ఇస్తాయి.

తులా రాశి వారికి :

తులా రాశి వారికి :

మీరు తలచిన కార్యక్రమాలు పట్టుదలతో చేస్తారు. ఈ రోజంతా ఆనందంగా గడుపుతారు. భార్య మాటలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

వృశ్చిక రాశి వారికి :

వృశ్చిక రాశి వారికి :

ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. భార్య మాటలకి సహకరించండి. దైవ దర్శన ప్రాప్తి కలదు. పిల్లలు మాట వినకపోవటం వలన, కోపం వస్తుంది. దూర బంధువుల మాటలు వింటారు. వృత్తి వ్యాపారాలు బావుంటాయి.

ధనుష్ రాశి వారికి :

ధనుష్ రాశి వారికి :

చేయు పనులలో ఆటంకాలు ఉంటాయి. పట్టుదలతో సాధించవలసి ఉంటుంది. మీరు చేయు ప్రణాళికలు అనుకూలించవు. వాయిదా వేయటం ముఖ్యం. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకర రాశి వారికి :

మకర రాశి వారికి :

కెరీర్ కి సంబంధించిన శ్రమ ఉంటుంది. ఇంటి పనులు నెరవేరగలవు. వృత్తి వ్యాపారాలు పట్టుదలతో చేయవలసి ఉంటుంది. అధికారుల మన్ననలు పొందుతారు. అనవసర ఖర్చులు కలవు. ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.

కుంభ రాశి వారికి :

కుంభ రాశి వారికి :

దగ్గరి బంధువులు వస్తారు. చిన్న ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీ సహచరులు సహకారం ఉంటుంది. తండ్రిగారి సలహాలు తీసుకోండి. మేలు జరగగలదు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. బంధువుల సహకారం కూడా తీసుకోండి.

మీన రాశి వారికి ;

మీన రాశి వారికి ;

మీరు చేయు ప్రణాళికలు అనుకూలిస్తాయి. పిల్లలపై వ్యక్తిగత శ్రద్ధ అవసరం. అధికారుల నుండి లాభం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో శ్రద్ధ వహించండి. దైవ దర్శన ప్రాప్తి కలదు.

ఇప్పటివరకూ ఈనాటి దినఫలాలను విన్నారు కదా, మీకేదైనా సందేహాలుంటే నాకు కాల్ చేయండి.

సర్వేజనాః సుఖినోభవంతు.

సమస్త సన్మంగళానిభవంతు.

అందరికీ నమస్కారం".

English summary

horoscope for 2nd December 2017 | daily horoscope | astrology

Astrology is very interesting science which studies the movement of the celestial bodies and their effect on our lives. This ancient science is slowly gaining popularity with the younger generation as well.
Story first published: Saturday, December 2, 2017, 7:00 [IST]